Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఏఐ-ఆధారిత ఆర్థిక మోసాన్ని చేధించిన తెలంగాణ సైబర్‌ పోలీసులు!

హైదరాబాద్‌: కృత్రిమ మేధస్సు (ఏఐ) నేడు సమాజ పురోభివృద్ధికే కాకుండా వినాశనానికి కూడా దోహదపడుతోంది. రోజురోజుకు మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా AI-ఆధారిత పెట్టుబడి వేదికలు, పోంజీ స్కీమ్ వ్యూహాలను ఉపయోగించుకుని… భారీ ఆర్థిక మోసానికి పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ క్రమంలో మోసపూరిత స్టాక్ మార్కెట్ అంచనా సాఫ్ట్‌వేర్ ద్వారా స్థిరమైన నెలవారీ రాబడిని హామీ ఇచ్చి… పలు రాష్ట్రాలలో […]
Read more

నినాదాలు మాత్రమే దేశభక్తికి కొలమానమా?

జైపూర్: ఇటీవల జైపూర్ నగరంలోని హవా మహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన బాలముకుంద్‌ ఆచార్య పాఠశాల కార్యక్రమంలో “వందేమాతరం” ఆలపించని విద్యార్థి దేశభక్తిని ప్రశ్నించారు. కేవలం నినాదాలు మాత్రమే దేశభక్తికి కొలమానమా? అనే చర్చను ఈ సంఘటన లేవనెత్తింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… దేశం పట్ల ప్రేమ నోటీమాటలపై ఆధారపడి ఉందా? నిశ్శబ్దం కూడా ఒక ప్రకటనముస్లిం విద్యార్థి నిరసన వ్యక్తం చేయలేదు; అతను కేవలం మౌనంగా ఉన్నాడు. అతని నిశ్శబ్దం ఇలా చెబుతున్నట్లు అనిపించింది: […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం… ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల సంఘం (ECI) ఓటరు జాబితా ప్రత్యేక సారాంశ సవరణ (SSR) షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎన్నికల అధికారుల ప్రకారం…సవరించిన ఓటరు జాబితా సెప్టెంబర్ 2న ప్రచురించనున్నారు. ఓటర్లు సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 17 మధ్య అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఈ క్లెయిమ్‌లను సెప్టెంబర్ 25 నాటికి పరిష్కరిస్తారు. తుది ఓటరు జాబితాలను సెప్టెంబర్ 30న విడుదల చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం […]
Read more

అరబ్ దేశాల్లో ఆహార వృథా: గాజాలో కరువు వ్యథ!

అరబ్ దేశాల్లో ఒక సంవత్సరంలో వృథా అయిన ఆహారం విలువ…. గాజాలో నెలకొన్న కరువు సంక్షోభాన్ని పరిష్కరించడానికి సరిపోతుంది. అంతేకాదు ఈ మొత్తంతో గాజాను పునర్నిర్మించగలం. జెరూసలేం, పాలస్తీనా స్వాతంత్య్రాన్ని కూడా సాధించగలమని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు 600 రోజులకు పైగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న, ఇజ్రాయెల్‌కు భారీ సైనిక, రాజకీయ, ఆర్థిక నష్టాలను కలిగించిన వీరోచిత పోరాట బడ్జెట్ కొన్ని వందల మిలియన్ డాలర్లకు మించి లేదు. మరోవైపు, 2024లో మన అరబ్ ప్రపంచం వృథా చేసిన […]
Read more

‘మార్వాడీ గో బ్యాక్’ ప్రచారానికి మద్దతు ప్రకటించిన ఓయూ జాక్‌!

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ జాయింట్ యాక్షన్ కమిటీ (OUJAC) “మార్వాడీ గో బ్యాక్” ప్రచారానికి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో ఆగస్టు 22న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రజలు బంద్‌లో విరివిగా పాల్గొనాలని OUJAC చైర్మన్ కొత్తపల్లి తిరుపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. మార్వాడీలు మోసపూరిత వ్యూహాలను అవలంబించడం ద్వారా తెలంగాణ వ్యాపారుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. “తెలంగాణ పోలీసులు మార్వాడీల కార్యకలాపాలను మౌనంగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్వాడీ వ్యాపారుల […]
Read more

ముంబయిలో ఆకస్మికంగా నిలిచిన రెండు మోనోరైళ్లు…782 మందిని రక్షించి రెస్క్యూ సిబ్బంది!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి గత మూడురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో సతమతమవుతోంది. కరెంట్‌ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో కరెంట్‌ అందక నిన్న సాయంత్రం ప్రజలతో కిక్కిరిసి ఉన్న రెండు మోనోరైల్ రైళ్లు ఎలివేటెడ్ ట్రాక్‌పై చిక్కుకుపోయాయి. ఎంతకూ కరెంట్‌ రాకపోవడంతో రైళ్లలో ఏసీ ఆగిపోయింది. దీంతో మోనోరైల్ లోపల డజనుకు పైగా ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. తక్షణమే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది మోనోరైల్ కిటికీలను పగలగొట్టి ప్రయాణీకులను రక్షించడానికి తలుపులు […]
Read more

సజీవ ఖననమైన 45 రోజుల తర్వాత బయటపడ్డ పాలస్తీనా జర్నలిస్ట్ అస్థిపంజరం!

గాజా: పాలస్తీనా జర్నలిస్ట్ మర్వా ముసల్లం, ఆమె తమ్ముళ్ల అస్థిపంజరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో శిథిలాల కింద సజీవ సమాది అయిన కొన్ని వారాల తర్వాత వెలికితీసారు. 45 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఆగస్టు 18న వారి అవశేషాలను వెలికితీశారు. జూలై 5న, ఇజ్రాయెల్ దళాలు వారి పొరుగు ప్రాంతాలపై దాడి చేసినప్పుడు, మార్వా ముసల్లం తన సోదరులతో కలిసి ఇంట్లో ఉంది. వారి ఇల్లు నేలమట్టమై, ముగ్గురినీ సజీవంగా సమాధి చేసింది. అల్ జజీరా […]
Read more

పీఎం, సీఎంలు ముఫ్పైరోజులు జైల్లో ఉంటే పదవీ గండం!

న్యూఢిల్లీ: తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయిన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా మార్గం చూపే బిల్లును నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రతిపాదిత చట్టం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, మంత్రులకు వర్తించనుంది. ఈ బిల్లే కాదు మరో రెండు బిల్లులు – కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు 2025, రాజ్యాంగం (నూట ముప్పైవ సవరణ) బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2025 – పార్లమెంటరీ కమిటీకి తరలించవచ్చు. కేంద్ర హోంమంత్రి […]
Read more

బాలాపూర్ మదర్సా వెలుపల రెండు గంటల పాటు నిరసన చేపట్టిన హిందూత్వ గ్రూపు!

హైదరాబాద్: హైదరాబాద్‌లో మత కలహాలను రెచ్చగొట్టే ప్రయత్నంగా, రైట్‌వింగ్‌ హిందుత్వ గ్రూపు బాలాపూర్‌లోని ఒక మదర్సా ముందు ధర్నా నిర్వహించి, దానిని మూసివేయాలని డిమాండ్ చేసింది. పాత నగరానికి ఆవల నగర శివారులోని బాలాపూర్‌ షరీఫ్ నగర్‌లోని మదర్సా నూమానియాలో ఈ సంఘటన జరిగింది. ఈమేరకు MBT నాయకుడు అమ్జాదుల్లా ఖాన్ మాట్లాడుతూ…కుతుబ్ షాహీ కాలం నాటి మసీదు ప్రాంగణంలో నిర్వహిస్తున్న మదర్సా నోమానియాను మూసివేయాలని డిమాండ్ చేస్తూ హిందూత్వ మత శక్తులు బాలాపూర్ పోలీస్ స్టేషన్ […]
Read more

వరదల తర్వాత చిసోటి గ్రామం స్థానంలో శిథిలాలు…మృతదేహాల కోసం ఎదురుచూపులు!

చిసోటి (కిష్ట్వార్, J&K): ఆగస్టు 14న ఉదయం 11:40 గంటల ప్రాంతంలో, జమ్మూ & కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని చిసోటి గ్రామంలోని పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం పిల్లల బృందం రిహార్సల్స్ చేస్తుండగా, ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. “ఒక VIP హెలికాప్టర్ కూలిపోయిన్నట్లు నాకు అనిపించింది” అని చిసోటిలోని ప్రభుత్వ నిర్వహణలోని మిడిల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడు హుకుమ్ చంద్ అన్నారు. ప్రతి సంవత్సరం జూలైలో, శ్రీనగర్ నుండి NH-44 ద్వారా 300 కిలోమీటర్ల దూరంలో […]
Read more
1 68 69 70 71 72 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.