Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇంటర్ పరీక్షల హాల్ టిక్కెట్లను నెట్‌లో అప్‌లోడ్ చేసిన ఇంటర్‌బోర్డ్‌!

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష కోసం హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మార్చి 5 నుండి ప్రారంభం కానున్న పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్‌ బోర్డు అధికారుల ప్రకారం, హాల్ టిక్కెట్లను కళాశాల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల నుండి తమ హాల్ టిక్కెట్లను తీసుకోవాలని సూచించారు. ఏవైనా తేడాలు ఉంటే, […]
Read more

ఇంటర్నెట్ షట్‌డౌన్‌…ప్రజాస్వామ్య దేశాలలో భారత్‌దే అగ్రస్థానం!

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని ఘనంగా చెప్పుకునే మనదేశంలో గత ఏడాది అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్‌ విధించారు. 2023లో మన దేశంలో విధించిన 113 షట్‌ డౌన్లతో పోలిస్తే నిరుడు వాటి సంఖ్య తగ్గినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని నివేదిక వెల్లడించింది. 2024లో 84 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను విధించింది, అయితే ప్రపంచవ్యాప్తంగా షట్‌డౌన్‌లను పరిశీలిస్తే మయన్మార్ అగ్రస్థానంలో మనదేశం రెండో స్థానంలో ఉంది. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్ కేవలం ఒక సౌకర్యంగా మాత్రమే కాకుండా […]
Read more

పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు!

జెనిన్: పాలస్తీనాపై మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు వెస్ట్‌బ్యాంక్‌లోకి ప్రవేశించాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన యుద్ధ ట్యాంకులు వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌కు వెళ్లాయి. కాగా, 2002 తరువాత ఇజ్రాయెల్‌ ట్యాంకులు వెస్ట్‌బ్యాంక్‌కు వెళ్లడం ఇదే ప్రథమం. ఈ ఏడాదంతా దళాలు అక్కడే ఉంటాయని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇస్రాయెల్‌ కాట్జ్‌ పక్రటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.  ఇక్కడ సుమారు 40వేల మంది శరణార్థులు […]
Read more

సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్నత విద్య & నైపుణ్య అభివృద్ధిపై సదస్సు!

హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ నిర్వహించిన ‘ఉన్నత విద్య & నైపుణ్య అభివృద్ధి’పై జరిగిన సమావేశంలో 2050 నాటికి తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా మారుస్తామని పారిశ్రామికవేత్తలు ప్రతిజ్ఞ చేశారు. ‘విద్య & యువత సాధికారత ద్వారా 2050 నాటికి తెలంగాణ అభివృద్ధి’ అనే థీమ్‌తో, ఈ సమావేశం తెలంగాణ అభివృద్ధి వేదిక (TDF) సహకారంతో జరిగింది. సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రారంభ సమావేశంలో CII చైర్మన్ డి సాయి […]
Read more

అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల భ‌ర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్!

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఓకే అంది. మొత్తం 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ మేళాను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. రాబోయే నోటిఫికేషన్‌లో 6,399 అంగన్‌వాడీ టీచర్లు, 7,837 మంది హెల్పర్ల నియామకాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు […]
Read more

ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్…ఇంకా లభ్యంకాని ఎనిమిది మంది ఆచూకీ!

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో నిర్మాణంలో ఉన్న SLBC సొరంగం కూలిపోయి కొన్ని గంటల తర్వాత కూడా, చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులతో కమ్యూనికేషన్ అందడం లేదు. NDRF, SDRF, భారత సైన్యం ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్, భారత నౌకాదళం, సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సభ్యులతో కూడిన రెస్క్యూ బృందాలు ఆదివారం సొరంగం 14వ కిలోమీటరుకు చేరుకున్నాయి, సొరంగం పైన ఉపరితలం 400 మీటర్లు ఉన్నందున, రెస్క్యూ బృందాలు నిలువుగా తవ్వకం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చాయి. […]
Read more

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం…కోహ్లీ సెంచరీ!

దుబాయ్:: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్నిఅందుకుంది. ఐసిసి టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ… మరోసారి ఈ మ్యాచ్‌లో విజృంభించాడు, ఈ బ్యాటింగ్ ఐకాన్ అద్భుత ఆటతీరుతో అజేయంగా 100 పరుగులు చేసి పాక్ జట్టపై సునాయస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గ్రూప్ Aలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్ స్థానాన్ని దాదాపుగా కైవసం చేసుకుంది. అయితే, వరుసగా రెండో ఓటమి తర్వాత […]
Read more

భారత్‌పై ప్రతీకార సుంకం విధిస్తాం…డోనాల్డ్‌ ట్రంప్‌!

వాషింగ్టన్: భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో పరస్పర సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. , ఈ దేశాలు అమెరికన్ వస్తువులపై విధించే సుంకాలను అమెరికా కూడా విధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. “మేము త్వరలో పరస్పర సుంకాలను విధిస్తాము — వారు మాపై వసూలు చేస్తారు, మేము వాటిని వసూలు చేస్తాము. భారతదేశం లేదా చైనా వంటి ఏ కంపెనీ లేదా దేశం వసూలు చేసినా, మేము న్యాయంగా ఉండాలని అనుకుంటున్నామని […]
Read more

తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దకండి…కేంద్రానికి సీఎం స్టాలిన్ వార్నింగ్!

చెన్నై: జాతీయ విద్యా విధానంలో భాగంగా రూపొందించిన త్రిభాషా ఫార్ములా కింద తమిళనాడుపై హిందీని రుద్దడానికి కేంద్ర విద్యాశాఖా మంత్రి ప్రయత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ విమర్శించారు. రాష్ట్రానికి హాని కలిగించే దేనిని తాను అనుమతించబోనని స్టాలిన్ అన్నారు. తమిళ గుర్తింపును సవాలు చేయవద్దని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం స్టాలిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “రాష్ట్రాలు అభివృద్ధి చెంది బలంగా మారినప్పుడు […]
Read more

కాంగ్రెస్ ఏడాదిపాలనపై బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్, కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరిన సీఎం రేవంత్‌రెడ్డి!

నారాయణపేట: కాంగ్రెస్ ఏడాది పాలన, తెలంగాణలో బిఆర్ఎస్ పదేళ్ల పాలన, కేంద్రంలో బిజెపి పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్‌కు సవాలు విసిరారు. శుక్రవారం నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో తాను ఓట్లు అడగనని ప్రకటించారు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బిఆర్ఎస్ కూడా ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్లు […]
Read more
1 90 91 92 93 94 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.