Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఢిల్లీలో స్పల్ప భూకంపం… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రధాని!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన బలమైన ప్రకంపనలు ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లోని అనేక ఎత్తైన భవనాలలోని ప్రజలు బయటకు పరుగెత్తారు. అయితే ఎటువంటి నష్టం లేదా గాయాలు సంభవించినట్లు తక్షణ నివేదికలు లేవు. కాగా, భూకంపం సంభవించిన ప్రదేశం ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని […]
Read more

చెదిరిన డాలర్ కలలు…అమృత్‌సర్‌ చేరుకున్న 112 మంది భారతీయ అక్రమ వలసదారులు!

చండీగఢ్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పి పంపేందుకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న మరో 112 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం ఆదివారం అర్థరాత్రి అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది, అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తిరిగి పంపించిన భారతీయుల మూడవ బ్యాచ్ ఇది. సి-17 విమానం రాత్రి 10:03 గంటలకు ల్యాండ్ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. […]
Read more

ఆధార్ కార్డు లేదని మహిళకు వైద్యం చేయ‌ని ఉస్మానియా డాక్టర్లు!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఒక మహిళ ఆధార్ కార్డు చూపించకపోవడంతో ఆమెకు వైద్య చికిత్స నిరాకరించిన హృదయవిదారక ఘటన కలకలం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని మారేడ్‌పల్లికి చెందిన ప్రమీల అనే మహిళ తన మైనర్ కుమార్తెతో కలిసి వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లింది. అయితే, ఆమె వద్ద ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి సిబ్బంది ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. కాగా, ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన […]
Read more

రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్‌ ఫీజు నియంత్రణకు చట్టం!

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టబద్ధమైన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రతిపాదించింది. ముసాయిదా బిల్లుతో పాటు ప్రభుత్వానికి ఈ సిఫార్సు,సమర్పించింది. విద్యారంగ సమస్యలపై 2024 జులైలో ప్రభుత్వం మంత్రులు దుద్దిళ్ల శ్రీధరబాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఎలాంటి కీలక నిర్ణయమైనా అందులో చర్చించిన తర్వాతే తీసుకుంటారు. ఫీజుల నియంత్రణపైనా కమిటీ చర్చిస్తుంది” అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు […]
Read more

రంగరాజన్ పై దాడి దేనికి సంకేతం?

నేటి సమాజం విద్యా విజ్ఞానాల పరంగా ఎంత ప్రగతి సాధించినా, నైతిక, సామాజిక, ఆధ్యాత్మికతల పరంగా తిరోగమనంలోనే పయనిస్తోంది. నేడు సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం, సద్భావన, మానవీయ విలువలు అడుగంటి పోతున్నాయి. అశాంతి, అలజడులు, అనుమానం, అభద్రతాభావం, అమానవీయం తాండవ మాడుతున్నాయి. కులం పేరుతో, మతం పేరుతో ఉన్మాదం పెరుగుతోంది. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి వంతొచ్చింది. ఆయనపై దాడి దేనికి సంకేతం? రంగరాజన్ బ్రాహ్మణ పూజారి అయినప్పటికీ […]
Read more

కొత్తగూడెంలో పోలీసులకు లొంగిపోయిన 19 మంది నక్సల్స్!

హైదరాబాద్: నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి చెందిన 19 మంది సభ్యులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ముందు లొంగిపోయారు. భద్రతా దళాలకు లొంగిపోయిన వారిలో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో పనిచేస్తున్న మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల ప్రకారం, లొంగిపోయిన సభ్యులలో ఒకరు డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) హోదాను కలిగి ఉన్నారు. వారిపై రూ. 8 లక్షల రివార్డు ఉంది, మరో […]
Read more

ట్రంప్‌తో మోదీ భేటీ…భారత్‌కు ఎఫ్‌-35 యుద్ధ విమానాలు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి అత్యాధునిక యుద్ధ విమానాలను విక్రయించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అగ్ర రాజ్యాధిపతిగా ట్రంప్ తిరిగి ఎన్నికయ్యాక వైట్ హౌస్‌ను సందర్శించిన నాల్గవ ప్రపంచ నేత మోడీ. ఈ సమావేశంలో తోటి జాతీయవాది అయిన ట్రంప్‌ను “స్నేహితుడు”గా మోదీ అభివర్ణించారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ […]
Read more

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన!

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ రాజీనామా చేసిన నాలుగు రోజుల తర్వాత, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ నుండి తనకు నివేదిక అందిందని, ఇతర సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తిందని నేను సంతృప్తి చెందానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన […]
Read more

గాజాను ఆక్రమించుకుంటానన్న ట్రంప్‌ ప్రతిపాదనకు 64% అమెరికన్లు వ్యతిరేకం – సర్వే!

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ మారణహోమంతో శిధిల నగరంగా మారిన గాజాను విలీనం చేసుకొని “మధ్యప్రాచ్య రివేరా”గా మార్చాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను 64 శాతం అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని ఇటీవలి సర్వేలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం ట్రంప్‌ ఆలోచనపై మండిపడ్డారు. 47 శాతం మంది ఈ ప్రణాళికను “తీవ్రంగా” వ్యతిరేకిస్తున్నామని, 17 శాతం మంది దీనిని “కొంతవరకు” వ్యతిరేకిస్తున్నామని ప్రోగ్రెసివ్ థింక్ ట్యాంక్ – డేటా ఫర్ ప్రోగ్రెస్ నిర్వహించిన సర్వే […]
Read more
1 93 94 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.