Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: Business

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పేద ముస్లిం కుటుంబాలకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏపీ వక్ఫ్ బోర్డు!

న్యూఢిల్లీ: పేద ముస్లిం కుటుంబాలకు భద్రత,మద్దతు అందించడానికి ఏపీ ప్రారంభించిన ప్రత్యేకమైన P-4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు స్వీకరించింది. ఈ కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ ఏడాది ఉగాది రోజున సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. P-4 భావనలో భాగంగా, జనాభాలోని అత్యంత సంపన్నులైన 10% మంది పేద కుటుంబాలలో దిగువన ఉన్న 20% మందికి మద్దతు ఇచ్చేలా వారిని ప్రోత్సహిస్తారు. ఇది సమ్మిళిత వృద్ధిని పెంపొందిస్తుంది. పేదలను […]
Read more

గోడి మీడియా…దాని సంపాదన-ప్రభావం!

ముంబయి: నూట యాభై సంవత్సరాల క్రితం, వార్తలకు వార్తాపత్రికలు మాత్రమే మూలం. ఆ తర్వాత రేడియో, ఆ తర్వాత 1927లో టెలివిజన్ వచ్చాయి. దశాబ్దాలుగా, జర్నలిజం మరియు టెలివిజన్ సమాచారానికి ప్రాథమిక వనరులుగా ఉన్నాయి. అయితే, గత 10–15 సంవత్సరాలలో, సోషల్ మీడియా ఈ రంగంలో బలమైన మాథ్యమంగా ఉద్భవించింది. అయినప్పటికీ, భారతదేశంలో, ప్రింట్ మీడియా, టెలివిజన్ ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రతి సాయంత్రం, లక్షలాది మంది ప్రైమ్‌టైమ్ వార్తలు, సినిమాలు, వినోద కార్యక్రమాల కోసం టీవీని […]
Read more

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: మూడు రోజుల విస్తృత విచారణ తర్వాత, భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తన మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. గురువారం జరిగిన విచారణ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కొత్త చట్టంలోని వివాదాస్పద నిబంధనలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న భూమిపై వక్ఫ్ ఆస్తుల […]
Read more

తేలికపాటి వర్షానికే కుప్పకూలిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌ ముఖద్వారం…పనుల్లో నాణ్యతపై విస్మయం!

హైదరాబాద్‌ : వందల కోట్లు ఖర్చు చేసి, మూడు నెలల క్రితం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. చిన్నపాటి ఈదురు గాలులతో కూడిన వర్షానికే ధ్వంసం అయ్యింది. దక్షిణ భాగం వైపు కొత్తగా నిర్మించిన ప్రధాన ముఖద్వారం వద్ద రూఫింగ్​ షీట్లు కింద పడిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ప్రధాన ముఖ ద్వారం పైకప్పు భాగాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు, స్టేషన్​ […]
Read more

వరంగల్‌లో AI ఆధారిత గోల్డ్ లోన్ ATM!

హైదరాబాద్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్‌లో AI ఆధారిత బంగారు రుణ ATMను ప్రారంభించింది, ఇది దేశంలోనే మొట్టమొదటి కావడం గమనార్హం. ఈ అత్యాధునిక యంత్రాన్ని శుక్రవారం వరంగల్ బ్రాంచ్‌లో మేనేజింగ్ డైరెక్టర్, CEO, M V రావు ప్రారంభించారు. AI ఆధారిత బంగారు రుణ ATM ఆర్థిక రంగంలో గేమ్-ఛేంజర్‌గా నిలిచే అనేక కీలక లక్షణాలను అందిస్తుంది. ఇది ఆధార్, మొబైల్ నంబర్ ధృవీకరణను ఉపయోగించి కేవలం 10 నుండి 12 నిమిషాల్లో బంగారు […]
Read more

సూడాన్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న కోకా-కోలాలో ఉపయోగించే కీలకమైన ముడి పదార్థం ‘గమ్‌ అరబిక్‌’!

ఖర్తుమ్ : కోకా-కోలా నుండి స్వీట్స్ వరకు ప్రతిదానిలోనూ ఉపయోగించే కీలక ముడి పదార్థమైన గమ్ అరబిక్, సూడాన్‌లోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుండి ఎక్కువగా అక్రమ రవాణా అవుతోంది. ఇది పాశ్చాత్య కంపెనీలు తమ సప్లై-చైన్‌ వ్యవస్థను సంఘర్షణ నుండి రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తుందని వ్యాపారులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని గమ్ అరబిక్‌లో దాదాపు 80% సూడాన్ ఉత్పత్తి చేస్తుంది, ఇది అకాసియా చెట్ల నుండి సేకరించిన సహజ పదార్ధం, […]
Read more

భారతదేశ సమగ్రతకు ముస్లిం-సిక్కు ఐక్యత చాలా అవసరం!

న్యూఢిల్లీ ‘మలేర్‌కోట్ల వారసత్వం’ సోదరభావాన్ని జరుపుకునేందుకు ఢిల్లీలోని ఐఐసిసి ఆడిటోరియంలో జరిగిన సంయుక్త సమావేశం ముస్లిం-సిక్కు ఐక్యత కోసం పిలుపు ఇచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న అణచివేతపై రెండు వర్గాలకు చెందిన ప్రముఖ నాయకులు ఆందోళనను వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కులను నిలబెట్టడానికి ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా, తఖ్త్ మాజీ జఠేదార్ శ్రీ దమ్‌డమా సాహిబ్ జ్ఞాని కేవాల్ సింగ్ మాట్లాడుతూ… భారతదేశంలో సమానత్వం స్థితిపై నిరాశ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “రాజ్యాంగం […]
Read more

కేటీఆర్‌ను కాపాడేందుకు బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫార్ములా ఈ కుంభకోణం, గొర్రెల పంపిణీ అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఇతరులను అభియోగాల నుంచి విడిపించేందుకు, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గులాబీ పార్టీ సపోర్ట్ ఇస్తుందని సీఎం అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, బీజేపీకి 8 […]
Read more

గవర్నర్ అల్టిమేటం తర్వాత ఆయుధాలను అప్పగిస్తున్న మణిపూర్‌ వాసులు!

ఇంఫాల్‌: గవర్నర్‌ అజయ్ కుమార్ భల్లా విజ్ఞప్తి మేరకు మణిపూర్ ప్రజలు చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న ఆయుధాలను స్వచ్ఛందంగా అప్పగించడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. తౌబాల్, చురాచంద్‌పూర్, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అప్పగించారు. ఇంఫాల్ తూర్పు ప్రాంతంలో అప్పగించిన ఆయుధాలలో బహుళ సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLRలు) మ్యాగజైన్‌లు, కార్బైన్ తుపాకులు, 9mm పిస్టల్, ట్యూబ్ లాంచర్లు, లైవ్ రౌండ్లు, ఒక మందుగుండు పెట్టె, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్, స్టన్ […]
Read more

ఇంటర్ పరీక్షల హాల్ టిక్కెట్లను నెట్‌లో అప్‌లోడ్ చేసిన ఇంటర్‌బోర్డ్‌!

హైదరాబాద్‌: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష కోసం హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మార్చి 5 నుండి ప్రారంభం కానున్న పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్‌ బోర్డు అధికారుల ప్రకారం, హాల్ టిక్కెట్లను కళాశాల లాగిన్‌లకు అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సంబంధిత కళాశాలల నుండి తమ హాల్ టిక్కెట్లను తీసుకోవాలని సూచించారు. ఏవైనా తేడాలు ఉంటే, […]
Read more
1 2 3 4

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.