Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బులంద్‌షహర్ కేసు… బీజేపీ నేత యోగేష్ రాజ్ సహా 38 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు!

లక్నో: ఏడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోవధ ఆరోపణలపై మూక హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ సహా స్థానిక యువకుడి ప్రాణాలను బలిగొన్న సంఘటనకు సంబంధించి బీజేపీ నాయకుడు, మాజీ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ యోగేష్ రాజ్‌తో సహా 38 మందిని జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది. డిసెంబర్ 3, 2018న సయానా తహసీల్‌లోని చింగ్రావతి గ్రామ సమీపంలోని చెరకు తోటలో ఆవుల కళేబరాలు కనిపించాక […]
Read more

బీహార్‌లో 70,800 కోట్ల స్కామ్‌…సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పవన్ ఖేరా!

పాట్నా: బీహార్‌లో కాగ్‌ నివేదిక వెల్లడైంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్ ఖేరా నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏకంగా 70,877 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇది రాష్ట్ర స్థాయి కుంభకోణం మాత్రమే కాదు, “జాతీయ కుంభకోణం”గా అభివర్ణించారు, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇందులో ఉన్నాయని అన్నారు. డబుల్ […]
Read more

భారత్‌పై 25% సుంకం విధించిన ట్రంప్‌…ప్రధానిని ఎగతాళిచేసిన విపక్షం!

న్యూఢిల్లీ: భారతీయ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకం, జరిమానాలు విధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీకి ఉన్న స్నేహం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని దీంతో తెలిసిపోయిందని విపక్షాలు ఎద్దేవా చేశాయి. హౌడీ మోదీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న ‘తారిఫ్‌ (పరస్పర పొగడ్తలు)’ పనికిరాలేదని.. ట్రంప్‌ మనపై టారిఫ్‌ (సుంకం), వేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికైనా […]
Read more

వందమంది అమ్మాయిల్లో నలుగురు మాత్రమే వర్జిన్…దుమారం రేపిన ప్రేమానంద్ మహారాజ్ వ్యాఖ్యలు!

లక్నో: ప్రముఖ హిందూ సాధువు ప్రేమానంద్ మహారాజ్, ఆయన శిష్యులలో స్టార్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఉన్నారు, ఆధునిక కాలంలో పురుషులు, స్త్రీల పవిత్రతపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదం చెలరేగింది. ‘ఆధునిక కాలంలో, 100 మంది అమ్మాయిల్లో 2 నుంచి 4గురు అమ్మాయిలు అరుదుగా పవిత్రంగా ఉంటారు… మిగిలిన వారందరికీ బాయ్‌ఫ్రెండ్స్ ఉంటారు’ అని ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో […]
Read more

పహల్గామ్ దాడి… కేంద్రంపై విరుచుకుపడ్డ మల్లికార్జున్ ఖర్గే!

న్యూఢిల్లీ: రాజ్యసభలో నిన్న ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్‌పై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ… ఖర్గే ప్రభుత్వంపై మాటల దాడికి దిగారు. భద్రతా వైఫల్యం కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రరిజం […]
Read more

‘ఒత్తిడితో ఆపరేషన్‌ సిందూర్ ఆగలేదు’…రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌!

న్యూఢిల్లీ: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌పై నిన్న ఎట్టకేలకు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటుకు గైర్హాజరయ్యారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చను ప్రారంభించారు. ఏప్రిల్ 22 ఉగ్రవాద దాడి గురించి కేవలం ప్రస్తావించారు.నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంతరం చేస్తున్న వాదనలను ప్రస్తావించలేదు. బదులుగా, భారతదేశం ఇప్పటికే తన “ప్రకటించిన […]
Read more

ఐవీఎఫ్‌, సరోగసీ ముసుగులో పిల్లలను అమ్ముతున్న మహిళా డాక్టర్‌ అరెస్టు!

హైదరాబాద్: ఐవీఎఫ్‌, సరోగసీ క్లినిక్ పేరుతో అక్రమంగా పిల్లలను అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. 64 ఏళ్ల గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతను, ఆమె సిబ్బందిలోని పలువురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్లినిక్‌లో సరోగసీ ద్వారా గర్భం దాల్చిందని చెప్పుకున్న బిడ్డ డీఎన్‌ఏ, దంపతుల నమూనాలతో మ్యాచ్‌ కాలేదు. దీంతో బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో నేరం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జరిపిన దర్యాప్తులో డాక్టర్ నమ్రత పెద్ద ఎత్తున అక్రమ […]
Read more

విద్యార్థుల ఆత్మహత్యలపై దృష్టిసారించండి…సుప్రీం కోర్టు!

న్యూఢిల్లీ: ఇటీవలి సంవత్సరాలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఒక ప్రధాన సామాజిక సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో 2022లో ప్రచురించిన ‘యాక్సిడెంటల్‌ డెత్స్‌ అండ్‌ సూసైడ్స్‌ ఇన్‌ ఇండియా’ నివేదికను ఉటంకిస్తూ.. చాలా దారుణమైన పరిస్థితులను గమనిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘మానసిక ఒత్తిడి, విద్యాభారం, విద్యాసంస్థల తీరు, సామాజిక వివక్ష వంటి కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది వ్యవస్థాపక వైఫల్యాన్ని సూచిస్తోందని’’ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ నీట్‌ పరీక్ష […]
Read more

బీహార్‌లో SIR కు అవసరమైన పత్రాలేమిటో 68% మందికి తెలియదని తేల్చిన ఓ సర్వే!

పాట్నా: బీహార్‌లో అత్యంత వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాలో లేవనెత్తిన అంశాలపై ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వలసదారులను ఈ ప్రక్రియలో విస్మరించడం, తరువాత ఓటు హక్కును కోల్పోవడం అనే అంశాన్ని ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు హైలైట్ చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే… SIR కి అవసరమైన పత్రాల గురించి అరవై ఎనిమిది శాతం మంది ప్రజలకు ఇప్పటికీ తెలియదని ఓ సర్వే తాజాగా వెల్లడించింది. అంతేకాదు […]
Read more

ఢిల్లీలో బెంగాలీ వలస కుటుంబంపై దాడి…బీజేపీని తీవ్రంగా విమర్శించిన మమతా బెనర్జీ!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై మాటల దాడి చేశారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అక్కడ బెంగాలీ మాట్లాడే వలస కుటుంబాన్ని వేధించి, హింసించిందని దీదీ ఆరోపించారు. https://www.instagram.com/reel/DMnpDTqSI5P/?igsh=MWN0bmZnMml4MGx6cg== బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు, దీని పరిపాలనా నియంత్రణ కేంద్ర ప్రభుత్వం కింద ఉందన్న విషయం తెలిసిందే. ఈ మేరకు బెంగాల్‌ సీఎం నిన్న సాయంత్రం తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు, పశ్చిమ బెంగాల్‌లోని […]
Read more
1 13 14 15 16 17 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.