Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

క్రేన్ కూలి ఐదుగురు వలస కార్మికులు మృతి!

Share It:

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో నిన్న సాయంత్రం ఒక ప్రీఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ తయారీ యూనిట్‌లో క్రేన్ కూలిపోవడంతో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మహాలింగాపురం గ్రామంలో సాయంత్రం పూట కార్మికులు మొత్తం విధుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. భారీ ఈదురుగాలులు వీయడంతో ఆ కంపెనీలోని భారీ క్రేన్ కంట్రోల్ తప్పి కార్మికులపై పడిపోయింది.

క్రేన్ కూలినప్పుడు 17 మంది కార్మికులు ఒక షెడ్డులో తలదాచుకున్నారు. మృతులు బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు. “వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ గాయాలతో మరణించారు,” అని ఒక సీనియర్ పోలీసు అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.

మృతులను అలీ హుస్సేన్, నాగేంద్ర సింగ్, సజిమ్, ముఖేష్ కుమార్, సోను రాజీబిగా గుర్తించారు – వీరందరూ బీహార్‌కు చెందినవారే. స్వల్ప గాయాలైన పన్నెండు మంది కార్మికులను ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ కూలిపోవడానికి గల కచ్చితమైన కారణంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ యూనిట్‌లో ప్రీఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలను తయారు చేస్తారని పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.