Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

యూపీలో గాలి, వాన బీభత్సం…89 మంది మృతి!

Share It:

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. కేవలం ఒక్కరోజులోనే గాలి, వాన బీభత్సానికి 89 మంది బలయ్యారు. ప్రయాగ్‌రాజ్‌, భదోహి, సోన్‌భద్ర, ఫతేపుర్‌ తదితర జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మృతిచెందిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు.

భారీ ఈదురు గాలులు, వర్షాల కారణంగా అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, నివాస గృహాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో మరో 53 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. 114 పశువులు చనిపోయాయి. 87 ఇళ్లకు నష్టం వాటిల్లింది.

బరేలిలో ఈదురుగాలుల దాటికి ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరిన ఓ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది.

https://x.com/ManjeetVishwas/status/2054731676287369622?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2054731676287369622%7Ctwgr%5E712ac8657984e419e1fdc67a05bf7dc6b2d45fab%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-1682514219629514980.ampproject.net%2F2605071401000%2Fframe.html

కాగా, అకాల వాతావరణం వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిగణనలోకి తీసుకున్నారు. 24 గంటల్లోగా బాధితులకు సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.