Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

చారిత్రాత్మక ఇరాన్ ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్, హర్ముజ్‌ను తక్షణమే తెరుస్తామని ప్రతిజ్ఞ!

Share It:

వాషింగ్టన్‌: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు, ఇరాన్‌తో ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై సంతకాలు పూర్తయిన వెంటనే ప్రపంచ వాణిజ్య నౌకల కోసం ‘హార్ముజ్ జలసంధి’ని తక్షణమే తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

“ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. అందరికీ అభినందనలు!” అని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో ప్రకటించారు.

“హర్ముజ్ జలసంధిని టోల్-ఫ్రీగా తెరవడానికి నేను పూర్తి అధికారం ఇస్తున్నాను…అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ నావికా దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయడానికి కూడా అధికారం ఇస్తున్నానని” ట్రంప్‌ వెల్లడించారు. .

ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా సముద్ర రవాణా, ఇంధన రవాణాను పునఃప్రారంభించనున్నట్లు కూడా ట్రంప్ సంకేతం ఇచ్చారు. “ప్రపంచ నౌకలారా, మీ ఇంజిన్‌లను ప్రారంభించండి. చమురు ప్రవహించనివ్వండి!” అని ఆయన సోషల్‌ మీడియాలో రాశారు. అయితే ట్రంప్‌ తన ప్రకటనలో ఒప్పందం గురించి గానీ, అందులోని చర్యల అమలు గురించి గానీ అదనపు వివరాలు అందించలేదు.

“తక్షణ, శాశ్వత” కాల్పుల విరమణ
తీవ్రమైన చర్చల అనంతరం అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందానికి వచ్చాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈరోజు తెల్లవారుజామున ప్రకటించారు.

“తీవ్రమైన చర్చల అనంతరం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము,” అని షరీఫ్ అమెరికా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

“లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ఇరుపక్షాలు ప్రకటించాయని” ఆయన తెలిపారు.
అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్‌లో జరగనుందని షరీఫ్‌ తెలిపారు.

కాగా, శాంతి ఒప్పందంపై ట్రంప్‌ ప్రకటన వెలువడ్డంతో చమురు మార్కెట్లు కొంత శాంతించాయి. దేశీయ స్టాక్‌మార్కెట్‌లు జోరందుకున్నాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.