Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా రేపు ‘కోటా’లో నిరసన ర్యాలీ… రాహుల్‌గాంధీ!

Share It:

న్యూఢిల్లీ: పదేపదే జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల రద్దు, నియామక ప్రక్రియలలో జాప్యం వంటి ఘటనలపై మోదీ ప్రభుత్వాన్ని… లోక్‌సభలో విపక్షనేత ఘాటుగా విమర్శించారు. ఇవి కేవలం పరిపాలనా వైఫల్యాలు మాత్రమే కాదని, లక్షలాది మంది యువ భారతీయుల ఆకాంక్షలపై జరుగుతున్న దాడులని అన్నారు.

“ఈ దేశంలోని ప్రతి యువతకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను — ఈనాడు, కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు; కలలు కనడానికే శిక్ష పడుతోంది. ప్రతి పేపర్ లీక్, రద్దు అయిన ప్రతి పరీక్ష కేవలం వ్యవస్థ వైఫల్యం మాత్రమే కాదు, లక్షలాది కలలపై జరుగుతున్న దాడి అని రాహుల్‌గాంధీలో ఎక్స్‌లో రాసారు.”

యువతలో ఉన్న నిరాశ, ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే వారంతా సమష్టిగా గళం విప్పాలని ఆయన కోరారు. “ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేనప్పుడు, ప్రజలు గట్టిగా మాట్లాడాలి. అందుకే రేపు కోటాలో జరిగే ‘స్టూడెంట్స్ ఎకో’ ర్యాలీలో మాతో చేరాలని మీ అందరికీ పిలుపునిస్తున్నాను,” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

ఈ ఉద్యమం కోటాలో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని ఆయన తెలిపారు.”మనమందరం ఏకమై, ఎవరూ విస్మరించలేని ఒక గొంతుకను సృష్టిద్దాం. ఇది మీ భవిష్యత్తు కోసం చేసే పోరాటం, నేను మీకు అండగా ఉంటానని ఆయన అన్నారు.

విద్యార్థులు, ఉద్యోగార్థుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) మరియు యూజీసీ-నెట్ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) సహా పలు పోటీ పరీక్షలలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

పరీక్షలకు సంబంధించిన అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ, ముంబై, జైపూర్, గౌహతితో సహా పలు నగరాల్లో నిరసనలు నిర్వహించారు.

పదేపదే జరుగుతున్న పేపర్ లీక్‌లు, నియామక ప్రక్రియలలో అంతరాయాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అవకాశాలను దెబ్బతీశాయని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.