Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

రామ మందిర నిధుల గోల్‌మాల్…నిందితుల తరపున వాదించబోమన్న ఫైజాబాద్ బార్ అసోసియేషన్!

Share It:

లక్నో: అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసులో ప్రధాన నిందితులు, సూత్రధారులు తప్పించుకున్నారని, కేవలం చిన్న స్థాయి ఉద్యోగులను మాత్రమే బలిపశువులను చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవంక ఈ కేసులో నిందితులకు ప్రాతినిధ్యం వహించకూడదని ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది.

రామ మందిర ఉగ్రదాడి కేసులో నిందితులకు ప్రాతినిధ్యం వహించడానికి నిరాకరించిన 2005 నాటి నిర్ణయాన్నే ఈ బార్ అసోసియేషన్ ఇప్పుడు కూడా తీసుకుంది.
“రామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలోని కానుకల దొంగతనం మా మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది,” అని బార్ అసోసియేషన్ కార్యదర్శి శైలేంద్ర జైస్వాల్, సయ్యద్ ఫిర్దౌస్ అష్రఫ్ మీడియాతో అన్నారు. “అరెస్ట్ అయిన నిందితుల తరఫున మా బార్ అసోసియేషన్ నుండి ఏ న్యాయవాది కూడా వాదించరు.”

రామ జన్మభూమి ఆలయ నిర్వహణతో సంబంధం ఉన్న (కానీ ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొనబడని) చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు మూడు రోజుల్లోగా అయోధ్యను విడిచి వెళ్లకపోతే, నగరం మొత్తాన్ని దిగ్బంధించి, ఎవరినీ లోపలికి అనుమతించబోమని బార్ అసోసియేషన్ హెచ్చరించింది.

రామ జన్మభూమి దొంగతనం నిందితులకు కోర్టులో ప్రాతినిధ్యం వహించకూడదని మీరెందుకు నిర్ణయించుకున్నారని మీడియా ప్రశ్నించగా…ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. మేము హిందూ మతాన్ని విశ్వసిస్తాము. అయోధ్య శ్రీరాముడు జది. న్మించిన ప్రదేశమని జవాబిచ్చాఉ. రామజన్మభూమి ఆలయాన్ని దొంగతనం నుండి కాపాడాల్సిన వారే దొంగలుగా మారితే, వారి చట్టపరమైన కేసును కోర్టులో ఎవరైనా ఎలా వాదించగలరని వారు ప్రశ్నించారు

అయోధ్య నుండి ఏ న్యాయవాది కూడా వారి తరఫున కేసు వాదించరు. మేము వారి కోసం పనిచేయము, మేమందరం వారికి వ్యతిరేకంగా కేసు వాదించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కేసును సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) చేపట్టాలని మేము కోరుకుంటున్నామని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ పేర్కొంది.

అయోధ్య స్థానిక పోలీసులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ రోజు అయోధ్యలో రామ జన్మభూమి ఆలయం నిలబడి ఉందంటే, దానికి కారణం మన తోటి న్యాయవాది ఉమేష్ పాండే. ఆయన బాబ్రీ మసీదు తాళాలు తెరవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, 1986లో కోర్టు దానిని అంగీకరించింది. ఆయనకు మన అయోధ్య న్యాయవాదుల సంఘం మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చింది. అందుకే ఈ దొంగతనం వల్ల మనం చాలా బాధపడటం సహజం అని అన్నారు.

నిందితుల తరఫున వాదించే ఏ న్యాయవాది అయినా రూ. 5 లక్షల జరిమానా చెల్లించాల్సిందేనని మా బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అంతేకాదు, ఆ న్యాయవాది సభ్యత్వాన్ని కూడా మా బార్ అసోసియేషన్ నుంచి రద్దు చేస్తామని బార్ అసోసియేషన్ కార్యదర్శి శైలేంద్ర జైస్వాల్ స్పష్టం చేశారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.