Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఎస్‌ఐఆర్‌లో సవరణకు కుటుంబ సభ్యులు ఎవరైనా హాజరు కావచ్చు!

Share It:

హైదరాబాద్: ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) దృష్ట్యా, వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా విదేశీ ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిష్కారం కోసం, వారి తరపున వారి కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడైనా ఎన్నికల నమోదు అధికారి (ERO) లేదా సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) ఎదుట హాజరై అవసరమైన పత్రాలను సమర్పించవచ్చని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు.

ప్రతి వారం జరిగే రాజకీయ పార్టీల సమావేశాల సందర్భంగా నోటీసుల జారీ, పరిష్కారంలో అనుసరించే విధానాన్ని వివరించాలని కూడా EROలకు, AEROలకు సూచించారు.

తప్పుడు పత్రాలు సమర్పించవద్దని ఓటర్లకు హెచ్చరిక

వ్యక్తిగత విచారణ సమయంలో తప్పుడు, నకిలీ లేదా తప్పుదోవ పట్టించే పత్రాలు సమర్పిస్తే, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 217 (ప్రభుత్వ అధికారికి తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద చర్యలు తీసుకుంటామని సీఈఓ ఓటర్లను హెచ్చరించారు.

తమ రికార్డులలో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లను లేదా గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలతో సంబంధాన్ని నిరూపించుకోలేని వారిని వ్యక్తిగత విచారణలకు పిలుస్తున్న తరుణంలో ఈ హెచ్చరిక జారీ అయింది.

ఓటర్ల జాబితాను తయారుచేసేటప్పుడు, సవరించేటప్పుడు, సరిదిద్దేటప్పుడు, చేర్చేటప్పుడు లేదా తొలగించేటప్పుడు తప్పుడు ప్రకటన చేయడం కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హమైన నేరం. దీనికి జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు.

12 లక్షలకు పైగా నోటీసులు జారీ

హైదరాబాద్ వ్యాప్తంగా, తమ రికార్డులలో లోపాలు ఉన్న లేదా ఎస్ఐఆర్ 2002 ఓటర్ల జాబితాలతో తమను తాము గుర్తించుకోలేని ఓటర్లకు 12 లక్షలకు పైగా నోటీసులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా, 92.8 లక్షల మంది ఓటర్లకు నోటీసులు అందాల్సి ఉంది. వీరిలో 60.5 లక్షల మంది వారి గణన ఫారం డేటాలో లోపాల కారణంగా గుర్తించబడగా, మరో 32.3 లక్షల మంది వివరాలు 2002 ఎస్ఐఆర్ జాబితాలతో సరిపోలలేదు.

నోటీసు జారీ దో లేదో తనిఖీ చేయడానికి, ఓటరు ECI వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు

వెబ్‌సైట్‌లో, ఈ దశలను అనుసరించాలి:

మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి

“జారీ చేసిన నోటీసుకు వ్యతిరేకంగా పత్రాన్ని సమర్పించండి” (Submit Document Against Notice Issued) బటన్‌పై క్లిక్ చేయండి

EPIC నంబర్‌ను నమోదు చేయండి

నమోదు అయిఉన్న మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేయండి.

నోటీసు జారీ అయితే, అది కనిపిస్తుంది; లేకపోతే, ‘రికార్డు కనుగొనలేదు’ (no record found) అనే సందేశం వస్తుంది.

‘రికార్డు కనమనబడలేదు’ అనే సందేశం రెండు సందర్భాలలో చూపుతుంది. ఒకటి, ఇప్పటివరకు ఓటరుకు నోటీసు జారీ కాలేదు, లేదా ఓటరుకు నోటీసు అవసరం లేదు. ఓటర్లు రెండు రోజుల తర్వాత స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.