Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హింస, అహంకారం ఫ్యాషన్‌గా మారుతున్నాయి… రాహుల్‌గాంధీ!

Share It:

న్యూఢిల్లీ: మణిపురి సంగీతకారుడు చోంగ్థమ్ విక్రమ్ సింగ్‌కు లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా “తరచుగా” జరుగుతున్న హింస, వివక్షలో భాగంగానే ఆయన హత్య జరిగిందని ఆరోపించారు.

“కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు హత్యతో ముగియదు, మరికొన్ని సార్లు అవమానాలు, బెదిరింపులు, హింసతో ముగుస్తుంది. మన దేశంలో ఇది చాలా తరచుగా జరుగుతోందని” చోంగ్థమ్ సింగ్‌ స్మారక సభలో రాహుల్‌ గాంధీ అన్నారు. ఈశాన్య ప్రాంత ప్రజలు, ఇతర వర్గాల వారు ఇటువంటి సంఘటనలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ఆయన, ఈ హింసను వ్యతిరేకిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దీనిపై పోరాడుతామని, దీనిని ఓడిస్తామని” ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మణపురి సంగీతకారుడు సింగ్ కుటుంబ సభ్యులకు, ఆయన మరణంతో బాధపడిన ఇతరులకు రాహుల్‌ గాంధీ తన సంతాపాన్ని తెలియజేశారు. “ఆయనపై జరిగిన హింస వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ నా సానుభూతిని, ప్రేమను తెలియజేస్తున్నానని” రాహుల్‌ అన్నారు.

మణిపురి సంగీతకారుడి హత్య కేవలం ఒక వ్యక్తిని చంపడం మాత్రమే కాకుండా, ఆయన ప్రాంతీయతను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం ఒక విషాదమని కాంగ్రెస్ అగ్రనేత అభివర్ణించారు. ఈ రోజుల్లో శక్తివంతులుగా ఉంటే అహంకారంతో ప్రవర్తించవచ్చని, తమకు నచ్చినట్లుగా చేయవచ్చని భావించడం ఒక ఫ్యాషన్‌గా మారిందని” ఆయన అన్నారు.

మణిపురి సంగీతకారుడి జీవితం…ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక. ఆయన ప్రతిభావంతుడు, సౌమ్యుడు” అని రాహుల్‌ గుర్తుచేసుకున్నారు. “మేము ఆయన పట్ల అత్యంత గర్వంగా ఉన్నాము. మేము న్యాయాన్ని ఆశిస్తున్నాము. మాకు న్యాయం లభిస్తుంది, హింసకు భయపడి మేము బెదిరిపోమని” రాహుల్‌ గాంధీ అన్నారు.

మణిపూర్‌కు చెందిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు విక్రమ్‌సింగ్, తన ఇంటి బయట జరుగుతున్న గొడవకు అభ్యంతరం చెప్పినందుకు ఢిల్లీలో కొట్టి చంపారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన హత్య ఈశాన్య ప్రాంత సమాజ సభ్యులలో ఆందోళనను రేకెత్తించింది, న్యాయం చేయాలని పిలుపునిచ్చింది. కాగా, న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో సింగ్ జ్ఞాపకార్థం సంతాప సభ జరిగింది, అక్కడ రాహుల్‌ గాంధీ ఇతరులతో కలిసి ఆ సంగీతకారుడికి నివాళులర్పించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.