Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితాలో ఒక్క అక్రమ వలసదారుడు కూడా లేడు’…ఆర్.వి. కర్ణన్!

Share It:

హైదరాబాద్‌: ‘హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితాలో ఒక్క అక్రమ వలసదారుడు కూడా లేడని ఎస్ఐఆర్ ప్రక్రియలో తేలిందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ధృవీకరించారు. ఓటర్ల జాబితాలో కొద్దిమంది నేపాలీ పౌరులు మాత్రమే ఉన్నారని, వారి పేర్లను తొలగించినట్లు ఆయన తెలిపారు.

“వారు విదేశీయులే అయినప్పటికీ, చట్టబద్ధమైన మార్గంలో దేశంలోకి ప్రవేశించినందున వారిని అక్రమ వలసదారులుగా పరిగణించలేము. కానీ వారికి ఇక్కడ పౌరసత్వం లేకపోవడం, నేపాల్‌లో ఓటు హక్కు ఉండటం వల్ల, వారిని ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చడం చట్టవిరుద్ధం. అందుకే వారి పేర్లను తొలగించామని కర్ణన్ అన్నారు.

అటువంటి వలసదారుల కచ్చితమైన సంఖ్య ఇంకా అందుబాటులో లేనప్పటికీ, సనత్ నగర్ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో 10 నుంచి 12 మందిని గుర్తించినట్లు కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్ జాతీయులు గానీ, రోహింగ్యా ముస్లింలు గానీ లేరని ఆయన ఖచ్చితంగా చెప్పారు.

కాగా, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి నగరంలోకి అక్రమంగా చొరబడినవారు ఏళ్ల తరబడి ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకుని, ఎన్నికల ప్రక్రియ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారన్న వాదనను జిల్లా ఎన్నికల అధికారి వ్యాఖ్యలతో తోసిపుచ్చినట్టైంది.

మరోవంక తొలగించిన 13 కోట్ల ఓటర్లలో 3 కోట్ల ‘అక్రమ చొరబాటుదారులను’ గుర్తించినట్లు ఆరోపిస్తూ, ఎస్ఐఆర్‌కు అమిత్ షా మద్దతు తెలిపారు. నవంబర్ 2న నగర పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా నుంచి మూడు కోట్ల అక్రమ చొరబాటుదారులను తొలగించినట్లు పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారులను, అనర్హులను ఏరివేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యంతో, 2002 నాటి ఓటర్ల జాబితాతో ఓటర్లను సరిపోల్చే అదనపు అంశంతో ఎస్ఐఆర్ 2026ను రూపొందించారు.

తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి, ఓటర్లు 2002 నాటి ఓటర్ల జాబితాలో ఉన్న విధంగానే తమ వివరాలను నింపాల్సి ఉంటుంది. 2002 ఓటర్ల జాబితా ప్రకారం తమ పేర్లను నమోదు చేసుకున్న వారిలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ‘నమోదు కానివారు’గా ప్రకటించిన 32లక్షల 36వేల 659 మంది ఓటర్లకు పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలతో హాజరు కావాలని నోటీసులు జారీ చేసారు. ECINET సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా, మ్యాపింగ్ వివరాలు యాప్‌లోకి అప్‌లోడ్ కాలేదని పేర్కొన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.