Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హైదరాబాద్‌లో నవంబర్ 30న ఆటో డ్రైవర్ల సమ్మె!

Share It:

హైదరాబాద్: రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… మహాత్మా గాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నవంబర్ 30న హైదరాబాద్‌లో ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చింది.

ఈమేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ మాట్లాడుతూ… 15 రోజుల్లోగా సవరించిన ఆటో మీటర్ ఛార్జీలను అమలు చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం ఆటో కనీస చార్జీని 1.6 కిలోమీటర్లకు రూ. 30కి పెంచింది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ. 14గా నిర్ణయించింది. అయితే వీటిని ఇంకా ప్రభుత్వం అమలు చేయలేదు.

గ్రీన్ క్యాబ్‌లు తమ జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆరోపిస్తూ, వాటిపై తక్షణమే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఆటో బ్లాక్ మార్కెట్ రాకెట్‌పై ఉక్కు చర్య తీసుకోవాలని, ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున మొత్తం రూ.36,000 చెల్లించాలని కూడా కమిటీ డిమాండ్ చేసింది.

బెంగళూరులో మాదిరిగా నగరంలో కూడా ద్విచక్ర వాహన ట్యాక్సీలను నిషేధించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లో దాడికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ ముకరం కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆ సంస్థ కోరింది.

ఈ డిమాండ్లు నెరవేరకపోతే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు 15 రోజుల పాటు తమ డిమాండ్లను నేరవేర్చేందుకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. అప్పటిలోగా ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఇటీవల ఆటో ఛార్జీలను భారీగా పెంచింది. అయితే ఈ చార్జీలు ఇంకా అమల్లోకి రాలేదు.

గతంలోనూ ఆటో డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆగస్టులో సమ్మెను ప్రకటించింది, కానీ రవాణా శాఖ మంత్రితో సమావేశం తర్వాత దానిని విరమించుకుంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.