Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

సౌదీలోని రియాద్ ఆర్థిక కేంద్రంపై మరోసారి దాడి!

Share It:

రియాద్‌: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఆర్థిక కేంద్రంపై మరోసారి భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో సహా మొత్తం 11 మంది గాయపడ్డారు. దాదాపు 385 మీటర్ల ఎత్తు, 80 అంతస్తులు కలిగిన ఈ ఆకాశహర్మ్యం (PIF టవర్) పైభాగంలోని దాదాపు 19 అంతస్తులు ఈ దాడి వల్ల దెబ్బతిన్నట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. కాగా, వారం రోజుల వ్యవధిలో ఈ ఆర్థిక కేంద్రంపై దాడి జరగడం ఇది రెండోసారి.

ఈ నేపథ్యంలో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికీ మాట్టాడుతూ… ఇది ఒక “పిరికిపంద ఉగ్రవాద దాడి” అని అన్నారు. అధికారులు సంఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారని చెప్పడం మినహా, ఆయన మరిన్ని వివరాలు వెల్లడించలేదు.

యెమెన్‌లోని లాహ్జ్ ప్రావిన్స్‌లో సౌదీ దళాలు వాహనాలపై దాడి చేశాయని, ఈ దాడిలో కనీసం 26 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని హౌతీ సైన్యం చెప్పిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది.

హోడెడాలో టెలికమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలపై సౌదీ జరిపిన మరో దాడిలో 17 మంది ఉద్యోగులు మరణించిన నేపథ్యంలో, ఈ దాడులకు “ప్రత్యుత్తరం ఇవ్వకుండా వదిలిపెట్టబోమని” హౌతీ బ్రిగేడియర్ యాహ్యా సరీ ప్రతిజ్ఞ చేశారు.

నవంబర్ 19న హౌతీ దళాలు లక్ష్యంగా చేసుకున్న పిఐఎఫ్ టవర్‌పై కొద్ది రోజులకే ఈ దాడి జరిగింది. అంతకుముందు జరిగిన దాడిలో, కూలిన శిథిలాల వల్ల భవనానికి తీవ్ర నష్టం వాటిల్లింది. భవనం ముఖభాగం అంతస్తులంతటా దెబ్బతినగా, కిటికీలు పేలిపోయాయి.

యెమెన్‌లోని పౌర మౌలిక సదుపాయాలను “సౌదీ శత్రువు” లక్ష్యంగా చేసుకోవడానికి ప్రతిస్పందనగా నవంబర్ 19న ఈ దాడి జరిగిందని హౌతీ సైన్యానికి చెందిన బ్రిగేడియర్ యాహ్యా సరీ తెలిపారు.

గాయపడిన వారిలో ఇద్దరు సౌదీ పౌరులు, ఇద్దరు భారత జాతీయులు, ముగ్గురు నేపాలీ జాతీయులు, నలుగురు ఈజిప్షియన్లు ఉన్నారని సౌదీ సివిల్ డిఫెన్స్ ప్రతినిధి తెలిపారు.
సౌదీలోని ప్రముఖ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పిఐఎఫ్) ప్రధాన కార్యాలయం ఉన్న టవర్ ముఖభాగం దెబ్బతిన్నట్లు చూపిస్తున్న ఒక చిత్రాన్ని సౌదీ సివిల్ డిఫెన్స్ విడుదల చేసింది.

కాగా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారని ధృవీకరిస్తూ, రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపింది.

ఇలాంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని భారత్ పిలుపునిచ్చింది. సౌదీ అరేబియా తన సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, మరియు తన పౌరులు, నివాసితుల భద్రతను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలుపుతూ, ఆ దేశానికి తన సంఘీభావాన్ని పునరుద్ఘాటించింది.

యూఏఈ, ఖతార్, కువైట్, లెబనాన్, అమెరికా, పాకిస్తాన్ కూడా ఈ దాడిని ఖండించాయి. యూఏఈ సౌదీ అరేబియాకు సంఘీభావం తెలపగా, ఖతార్ ఈ ఘటనను “సౌదీ సార్వభౌమాధికారం దారుణ ఉల్లంఘన”గా అభివర్ణించింది.

పౌర, ఆర్థిక సౌకర్యాలపై దాడులు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని, ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కువైట్ హెచ్చరించింది. ఇటువంటి ఘటనలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతాయని, శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయని పాకిస్తాన్ పేర్కొంది.

ఇదిలా ఉండగా, క్షిపణి, డ్రోన్ దాడులు లేదా వాటి ప్రభావ ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని చిత్రీకరించడం, ప్రచురించడం లేదా పంచుకోవడం చేయరాదని సౌదీ ప్రజా భద్రతా సంస్థ హెచ్చరించింది. దీనిపై చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.