న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో జరిగిన ‘హరా భరా స్వరాజ్’ కార్యక్రమంలో మహాత్మా గాంధీ భావనలను గుర్తు చేశారు. దేశంలో మార్పు తెచ్చేందుకు విద్యార్థులు తమ శక్తిని ఉపయోగించాలని, ప్రతి ఒక్కరి ఆశయాలను గౌరవించే వాతావరణం రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, విద్యార్థులు ఇప్పుడు తమ భావాలను వ్యక్తపరచడానికి ముందుకు వస్తున్నారని, దీనిని ఆపలేమని అన్నారు. దేశ యువతలో మౌలిక మార్పులు తీసుకురావడానికి ఈ శక్తిని వినియోగించాలని ఆయన వారిని కోరారు.
తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ… ప్రభుత్వం యువతకు తన ద్వారాలు తెరిచి, ఆ మార్గంలో వారికి సహాయపడితేనే, ప్రతి ఒక్కరూ ‘స్వరాజ్యం’ మార్గంలో నడవగల భారతదేశమనే మహాత్మా గాంధీ ఆశయాన్ని సాధించగలమని అన్నారు.
మైనారిటీలపై దాడులు చేయడం, గిరిజనుల భూములను లాక్కోవడం, దళితులను అణచివేయడం వంటి చర్యలకు బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు పాల్పడుతున్నాయని ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారు. ఈ చర్యలను వెనక్కి తిప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
మీ ఊహాశక్తికి ద్వారాలు తెరిచి, సత్యం అంటే ఏమిటో మీరు అనుభూతి చెందేలా, విశ్వసించేలా, ఆ విశ్వాసాన్ని కలిగించేలా చేయడమే ప్రభుత్వం, దేశం కర్తవ్యం. ఆ మార్గంలో నడవడానికి దేశం మీకు సహాయపడాలి. భారతదేశం పట్ల గాంధీజీ దార్శనికత ఇదే, ఇదే స్వరాజ్య మార్గం అని రాహుల్ గాంధీ ఉద్బోధించారు.
“భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పోరాటం ఇది. మాకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, వ్యక్తులుగా మేము కొన్ని విషయాలను విశ్వసిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. లక్షలాది మంది యువ విద్యార్థులు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను. వారిని బంధించి, తమ భావాలను వ్యక్తపరచడానికి అనుమతించకపోవడం వల్లే వారు ఆ బాధను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ భావప్రకటనా స్వేచ్ఛ అకస్మాత్తుగా బయటకు వచ్చింది, దానిని ఆపలేము,” అని రాహుల్ గాంధీ అన్నారు.
You want to be an engineer, a cook, or a shoemaker. Good for you, be a shoemaker. You want to be an astronaut. Good for you, be that.
— Congress (@INCIndia) August 20, 2026
The job of the government and the country is to open the doors to your imagination and make you feel and believe. The country should help you… pic.twitter.com/ykECHk3nbQ


