హైదరాబాద్: దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. SCCLలో అర్హులైన కార్మికులకు రూ. 1,10,250 వరకు బోనస్‌ను ప్రకటించింది. దీంతో సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా అందినట్టైంది. మొన్నే దసరా బోనస్ అందుకున్న సింగరేణి కార్మికులకు తాజాగా దీపావళి బోనస్ కూడా అందుకోనున్నారు. దీంతో దసరా, దీపావళి కలిపి రెండు బోనస్‌ల రూపంలో కార్మికులకు గరిష్ఠంగా రూ.2.65 లక్షల వరకు ప్రయోజనం కలగనుంది. ఈ రెండు బోనస్‌ల చెల్లింపుల కోసం సింగరేణి సంస్థ రూ.1,020 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఈమేరకు ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ‘నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్’ (NCWA) పరిధిలోకి వచ్చే సుమారు 38,000 మంది అర్హులైన ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ. 419 కోట్లను నవంబర్ 5న జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ బోనస్‌కు అదనంగా, ఈ నెల ప్రారంభంలోనే లాభాల్లో వాటాగా సుమారు రూ. 600 కోట్లను కార్మికులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
అయితే దీపావళి బోనస్ చెల్లింపులకు కొన్ని అర్హత నిబంధనలు విధించారు. ఈ ప్రయోజనం నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్‌సీడబ్ల్యూఏ) పరిధిలోని కార్మికులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. సింగరేణి సంస్థలో పనిచేసే అధికారులకు ఇది వర్తించదని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో కనీసం 190 పని దినాలు.. ఓపెన్‌కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తి బోనస్ అందుతుందని తెలిపింది.

