28.2 C
Hyderabad
Thursday, October 3, 2024

తమిళనాడుతో నాటు సారా తాగి 25మంది మృతి!

కళ్లకురిచి, తమిళనాడు:  తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. నాటు సారా దెబ్బకు 25మంది నిరుపేదలు బలయ్యారు.   వివిధ ఆసుపత్రిలో చికిత్స 60 మంది చికిత్స పొందుతున్నారు. అందులో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం  పుదుచ్చేరిలోని జిప్మర్‌ దవాఖానకు తరలించారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నారు. కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ పరామర్శించారు. ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 200 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు

మృతుల పట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,  ఈ దుర్ఘటనను నివారించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు.

మృతులకు టిఎన్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సంతాపం తెలుపుతూ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

“కల్లకురిచిలో నకిలీ మద్యం సేవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా షాక్ అయ్యాను. ఇంకా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఆసుపత్రిలో చేరిన వారు త్వరగా కోలుకోవాలని, “తమిళనాడు రాజ్ భవన్ షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరోవంక మృతదేహాలతో సారా కేంద్రం వద్ద మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఆగ్రహంతో సారా అమ్మిన దుకాణాన్ని గ్రామస్థులు ధ్వంసం చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles