29.7 C
Hyderabad
Saturday, May 4, 2024

కాశ్మీర్ ఫైల్స్ – అబద్ధాల అల్లిక

‘హేట్ స్టోరీ’ లాంటి అడల్ట్ కంటెంట్ సినిమాలు తీసుకునే ‘వివేక్ అగ్నిహోత్రి’కి సడన్ గా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ముస్లిములను హిందూ వ్యతిరేకులుగా, దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ ‘కాశ్మీర్ ఫైల్స్’ పేరుతో సినిమా తెరకెక్కించేంత అవసరం ఎందుకు ఏర్పడింది? లేదా దీని వెనుక మతతత్వ రాజకీయ శక్తుల హస్తం ఉందా? అన్నది తెలుసుకునే ముందు నిజంగా ఒకవేళ హిందూ పండిట్లు అన్యాయంగా చంపబడ్డ సంఘటనను తెరమీదకు తీసుకురావటమే అసలు
బెంగాల్ హిందువుల ఊచకోత గురించి సినిమా తియ్యాలి కదా?

లక్షల కొద్దీ కాశ్మీరీ పండితుల్ని చంపేశారా?

ఆర్.ఎస్.ఎస్, బీజీపీ కార్యకర్తలు అత్యుత్సాహం కొద్దీ ప్రచారం చేసే కల్పితాల్లో ఒకటేమిటంటే- ఎలాగైతే గుజరాత్ దాడుల్లో స్థానిక హిందుత్వ వాదులే ముస్లిములను చంపేశారో, అలాగే స్థానిక కాశ్మీర్ ముస్లిములే లక్షల కొద్దీ కాశ్మీర్ పండిట్లను చంపేశారన్నది! ఇలాంటి గాలి వార్తలతో ముస్లిములను కిరాతకులు, హంతకులుగా హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ ‘కాశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాలు తెరకెక్కించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి.
నిజానికి చెప్పాలంటే బెంగాల్ హిందువుల మరణాలతో పోల్చితే కాశ్మీర్ లో హిందూ పండిట్ల మరణాలు 1% కూడా ఉండవు. ఎందుకంటే శ్రీనగర్, జిల్లా పోలీసు కార్యాలయం RTI క్రింద అందించిన ప్రామాణిక సమాచారం ప్రకారం 1990 తరువాత మిలిటెంట్ల చేతిలో చనిపోయిన మొత్తం 1724 మందిలో కాశ్మీరీ పండిట్ల సంఖ్య కేవలం 89 మాత్రమే అని మిగతా 1635 మందిలో ముస్లిములతో పాటు ఇతర నిమ్న కులాలకు చెందిన హిందువులు కూడా ఉన్నారు. కానీ వారి చావులేవీ కళ్లకు కనపడవు. అంటే మొత్తం మరణాల్లో కేవలం 5% మాత్రమే కాశ్మీరీ పండిట్లు చనిపోయింది. దీనికి “జెనోసైడ్” అని పేరు పెట్టి సినిమా తీసేంత అవసరం ఏర్పడినప్పుడు…

1947 లో జరిగిన ‘జమ్మూ ఊచకోత’ చాలా మందికి తెలిసే ఉంటుంది. డోగ్రా పాలకుడు ‘హరిసింగ్’ సైన్యాలు సాగించిన జనహననంలో 2 లక్షల మంది ముస్లిములు చంపబడ్డారు. వారి హత్యల గురించి సమాధానం ఏమిటి?

సరిగ్గా కాశ్మీరీ పండిట్లు జనవరి 20 న కాశ్మీర్ విడిచిపెట్టి వెళ్లిన రెండవరోజే జనవరి 21 1990న ‘గావ్కాడల్ ఊచకోత’ జరిగింది. CRPF జవాన్లు కాల్పులు జరిపి 50 మంది ముస్లిములను చంపేయటం జరిగింది. మరి ఈ హత్యల గురించి సమాధానం ఏమిటి?

కున్నన్ పోష్పోరాలో మిలట్రీ దళాలు ఒక రాత్రిలో పురుషులను బెదిరించి వందల కొద్దీ స్త్రీలపై సాగించిన సామూహిక అత్యాచారాల గురించి సమాధానం 1984 లో సాగిన సిక్కుల ఊచకోతలో 2800 మంది దారుణంగా చంపబడ్డ సిక్కుల ప్రాణాల గురించి సమాధానం ఏమిటి?
2002 లో గుజరాత్ లో హిందూ మతతత్వవాదులు సాగించిన జనహననంలో చంపబడ్డ 2000 మంది ముస్లిముల హత్యల గురించి సమాధానం ఏమిటి?

దారుణమైన ఇలాంటి సంఘటనలేవీ సినిమాలుగా తెరకెక్కించటానికి పనికి రావు. ఎందుకంటే హిందూ-ముస్లిం రాజకీయాలు నడిపి, మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందువుల్ని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోటానికి అవేమీ పెద్దగా పనికి రావు కాబట్టి.

అసలు జరిగిందేమిటి?
కాశ్మీరీ పండిట్ల వలసలు కేవలం పోలిటికల్ గేమ్ తప్ప మరేమీ కాదు. కొందరు ఊహించుకుని ప్రచారం చేస్తున్నట్లు కాశ్మీర్ లో స్థానిక ముస్లిములు అక్కడి కాశ్మీరీ పండిట్లను చంపి, మిగతావారిని తరిమెయ్యలేదు. ఎప్పటి నుండో స్థానిక ముస్లిములు కాశ్మీరీ పండిట్లు ఎంతో అనోన్యంగా కలిసి మెలసి జీవిస్తూ ఒకపై ఒకరు ఆధారపడుతూ వ్యాపారాలు చేసుకుంటున్నవారే. ఇప్పటికీ అక్కడ 800 కాశ్మీరీ పండిట్ల కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఇక్కడ అడగాల్సిన ప్రశ్నలు

అసలు నాటి వీ.పి సింగ్ ప్రభుత్వం కాశ్మీర్ పండిట్లను సమయానికి ఎందుకు సంరక్షించలేకపోయింది? మిలిటెంట్ల నుండి కాశ్మీరీ పండిట్ల ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు సైనిక బలగాలు ఉన్నప్పటికీ వారికి సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోయింది? అన్నవి.

కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోవటం కేవలం ఆనాడు బీజేపీ సపోర్ట్ తో ప్రధానిగా ఉన్న వీ.పి. సింగ్ బలహీనమైన ప్రభుత్వ విధానాలు మరియు అప్పటి కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న జగ్మోహన్ మల్హోత్రా యొక్క చేతకానితం అనటం అతిశయోక్తి కాదు. పైగా అప్పటి గవర్నర్ జగమోహన్ సైనిక బలగాలతో మిమ్మల్ని సంరక్షిస్తామని కాశ్మీర్ పండిట్లకు భరోసా ఇవ్వటం మానేసి.. రివర్స్ లో “మీకు సెక్యూరిటీ కావాలంటే ఇళ్లు
వదిలిపెట్టి రెఫ్యూజీ క్యాపుల్లోకి రండి అక్కడే మీకు సెక్యూరిటీ దొరుకుతుంది” అని చెప్పి, కాశ్మీరీ బ్రాహ్మణులను మీరు కొన్నాళ్లాగితే పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి మిమ్మల్ని రప్పిస్తానని అక్కడి నుండి రాత్రికిరాత్రి బస్సులు ఏర్పాటు చేసి మరీ బయటకు పంపించాడు. అలా ఎంతో మంది ఇల్లూవాకిలి లేక రెఫ్యూజీ క్యాంపుల్లోనే హీనమైన జీవితాన్ని గడపాల్సి వచ్చింది.

పాపం వారికి తెలినేతెలీదు తాము విడిచిపెట్టి వెళుతున్న ఇళ్లకు ఎప్పటికీ తిరిగి రప్పించబడబోమని. ఆ విధంగా వారి వలసలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కాలంలో వారి వలసలకు హిందూ-ముస్లిం వేర్పాటువాద రాజకీయ రంగు పులమటం జరిగింది. వారి పేరును రాజకీయాలకు వాడుకుని బలిపశువులు చెయ్యటం జరిగింది.

కాశ్మీరీ పండిట్లే కుట్ర కోణాన్ని వివరించారు.

నాటి ప్రభుత్వానికి తమను సైనిక బలగాలతో కాపాడే అవకాశమున్నప్పటికీ ఆదుకోక కాశ్మీరీ పండిట్లు అక్కడి నుండి ఎలా ఎందుకు పంపబడ్డారో కుట్ర కోణాన్ని వివరిస్తూ స్వయంగా సంతకాలు చేసి మరీ కాశ్మీరీ పండిట్లే 1990 సెప్టెంబర్ 23 లో కాశ్మీరీ ముస్లిములకు రాసిన ఒక ఉత్తరంలో తెలియజేశారు. “కాశ్మీర్ వదిలి పెట్టి వెళ్లిపోవటం అన్నది బీజేపీ, ఆర్.ఎస్.ఎస్, శివసేనల యొక్క పోలిటికల్ డామా మరియు గేమ్”
అని వారు స్పష్టంగా రాశారందులో. “ముస్లింలను ఊచకోత కోయడానికి కాశ్మీరీ పండిట్లను లోయ నుండి వలస వెళ్లేలా ప్రణాళిక రూపొందించబడ్డాయని” పేర్కొన్నారు.

నిజానికి జరిగింది కూడా అదే కాశ్మీర్ లోయలో మిలిటెంట్ల చేతిలో చనిపోయిన కాశ్మీరీ పండిట్ల కంటే ముస్లిములే అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇంకా ఆ ఉత్తరంలో వారేమి పేర్కొన్నారంటే “లోయలోని ప్రజలను శాంతింపజేసిన తరువాత వెంటనే మమ్మల్ని మీ ఇళ్లకు తిరిగి పంపుతామని మాకు హామీ ఇచ్చారు. ఆ రోజు ఇంకా రాలేదు మరియు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి ఆశలేమీ కనిపించడం లేదు” అని.

కాశ్మీరీ పండిట్లపై అంత ప్రేమే ఉంటే ప్రభుత్వం వారికి చేసిందేమిటి?

కేవలం కాశ్మీరీ పండిట్ల పేరును తమ హిందూ-ముస్లిం వేర్పాటు వాద రాజకీయాలకు వాడుకోటానికి తప్పితే నిజానికి ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం వారికి ప్రయోజనం చేకుర్చింది ఏదీ లేదు. 2014 లో కాశ్మీరీ పండిట్లను తిరిగి కాశ్మీర్ లో పునరావాసం కల్పిస్తామని, వారిని ఆదుకుంటామని చేసిన వాగ్దానాలన్నీ కేవలం పోలిటికల్ గేమ్ తప్ప బీజేపీ వల్ల తమకు పిసరంత లాభం కుడా కలగదని ఇప్పుడు కాశ్మీరీ పండిట్లకు స్పష్టంగా ఓ క్లారిటీ వచ్చే వారు ఇప్పుడు చెప్పుకుని బాధపడుతున్నారు.
ఇప్పటికీ జమ్మూలో “జగ్రి” పేరుగల టౌన్ షిప్ లో దాదాపు 5000 మంది కాశ్మీరీ పండిట్లు నివసిస్తున్నారు.

హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే…

‘బేస్డ్ ఆన్ లైస్’తో తయారైన ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఏదో దేశభక్తిని ప్రేరేపిస్తూ పైగా అదేదో హిందూ-ముస్లిం ఐక్యతను పెంపొందించే గొప్ప సినిమా అన్నట్టు గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ట్యాక్స్ ఫ్రీ చెయ్యటం! 2002 లో గుజరాత్ అల్లర్లపై ‘బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్’ ఆధారంగా ‘పర్జానియా’ పేరుతో విడులైన సినిమాను బ్యాన్ చెయ్యటం!

మొత్తానికి హిందుత్వ ఏజండాలో భాగంగా సామాన్య హిందూ-ముస్లిముల భావోద్వేగాలు రెచ్చగొట్టటం ఆధారంగా తమ రాజకీయ ఉనికిని కాపాడుకునే కుట్రలో కాశ్మీరీ పండిట్లు కేవలం బలిపశువులుగా మార్చబడ్డారంతే. ప్రభుత్వం వారిని కాపాడటం, పునరావాసం కల్పించటం మాట ప్రక్కనపెడితే.. వారిపై సినిమా తీసి కొందరు లాభాలు మటుకు సంపాదించుకోవటం జరుగుతుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles