24.7 C
Hyderabad
Thursday, October 3, 2024

బాలికపై లైంగిక వేధింపుల కేసు…పోలీసులపై రాళ్లు రువ్వడంతో 14 మందికి గాయాలు!

ముంబయి: మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలోని జామ్‌నేర్‌లో ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి… ఆ చిన్నారిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేసిన వ్యక్తిని కస్టడీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు కొంతమంది వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో కనీసం 14 మంది పోలీసులు గాయపడ్డారని అధికారు.  తెలిపారు.

జామ్నర్ పోలీస్ స్టేషన్ వెలుపల గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాళ్లదాడి జరిగినట్లు వారు తెలిపారు.

“జూన్ 11 రాత్రి జామ్నేర్‌లోని చించ్‌ఖేడా శివర్ గ్రామంలో ఆరేళ్ల బాలికను అపహరించి, లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేశారు.  రాత్రిపూట కావడంతో నిందితుడు స్పాట్ నుండి చల్లగా జారుకున్నానడని”  ఒక అధికారి తెలిపారు.

ఎట్టకేలకు గురువారం అతడిని పోలీసులు అరెస్టు చేసారు. అయితే అతని అరెస్టు గురించి సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, స్థానికులు నిందితులను అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ వెలుపల గుమిగూడారు. వారు అతనిని శిక్షించే అవకాశముందని “పోలీసులు అన్నారు.

దీంతో పోలీస్‌స్టేషన్‌ బయట ప్రజలు ఆందోళనకు దిగారు. కొంతసేపటి తర్వాత పోలీసులు నిందితుడిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వడం ప్రారంభించారు.

“గుంపులోని కొంతమంది సభ్యులు పోలీసులపై దాడి చేశారు. పెద్ద ఎత్తున ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు” అని పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్‌తో సహా 14 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు.

గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బల ప్రయోగం చేయాల్సి వచ్చిందని, సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ఆయన చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles