28.2 C
Hyderabad
Thursday, October 3, 2024

రాష్ట్రంలో ప్రతి 30 కి.మీకి ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం…వైద్యశాఖ మంత్రి రాజనరసింహ!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ వైద్యసేవ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను కోరారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో జిల్లా ఆరోగ్య, వైద్య అధికారులతో (DHMO) జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… రానున్న వర్షాకాలంలో సాధారణ ప్రజల ఆరోగ్యంపై సీజనల్ వ్యాధులు ప్రభావితం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరోగ్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

పేదలలో పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఈ విషయంపై అధికారుల నుండి జవాబుదారీతనం కోరాలని ఆయన వ్యాఖ్యానించారు.

జిల్లా, ఏరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలని మంత్రి అధికారులను కోరారు. నిబంధనలను పాటించని ప్రైవేట్‌ ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేయాలని ఆయన వారికి సూచించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles