31.2 C
Hyderabad
Friday, October 4, 2024

ఇసుక మాఫియాతో చేతులు కలిపిన 16 మంది పోలీసులు…స్వచ్ఛంద పదవీ విరమణ చేయించిన ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో పనిచేస్తున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు సహా 16 మంది పోలీసు అధికారులు ఇసుక మాఫియాతో చేతులు కలిపిన కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణ శిక్షకు గురయ్యారు. ఈ మేరకు మల్టీ జోన్-II ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ సీరియస్‌గా అయ్యారని సీనియర్ అధికారి తెలిపారు.
ఐజీపీ నివేదికల దృష్ట్యా ఇటీవల ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌, 14 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ మాట్లాడుతూ… పోలీసు అధికారులు తమ విధుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వకూడదన్నారు. పీడీఎస్ మాఫియాపై చర్యలు ప్రారంభించామని, పీడీఎస్ బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించామని తెలిపారు.

గ్యాంబ్లింగ్ స్థావరాలపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌లు (ఎస్పీలు) సీరియస్‌గా వ్యవహరించాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఐజిపి అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles