31.2 C
Hyderabad
Friday, October 4, 2024

భారత్‌లో మత స్వేచ్ఛ అధ్వాన్నం అన్న అమెరికా…యూఎస్ నివేదికను తిరస్కరించిన విదేశాంగ శాఖ!

న్యూఢిల్లీ: భారతదేశంలో మత స్వేచ్ఛ అధ్వాన్నంగా ఉందని  అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్ ప్రభుత్వ కమిషన్ తన వార్షిక నివేదికలో ఆరోపించింది.  కొంతమంది ప్రభుత్వ అధికారులు ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు తప్పుడు కధనాలు, సమాచారాన్ని ఉపయోగించి భారతదేశంలోని మైనారిటీల ప్రార్థనా స్థలాలపై హింసాత్మక దాడులను ప్రేరేపిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. యు.ఎస్.సి.ఐ.ఆర్.ఎఫ్ తన వార్షిక నివేదికలో.. భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛను క్రమబద్ధంగా ఉల్లంఘనలు కొనసాగుతూ ఉన్నందున “ప్రత్యేక ఆందోళన కలిగిన దేశం”గా గుర్తించాలని సిఫార్సు చేసింది.

భారతదేశంలో మతపరమైన హింసను ప్రేరేపించడానికి తప్పుడు సమాచారాన్ని ఉపయోగించుకున్నారని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై US కమిషన్ (USCIRF) నివేదిక పేర్కొంది.

అంతేకాదు 2024లో భారతదేశంలో మైనారిటీలపై జరిగిన దాడుల శ్రేణిని కూడా నివేదిక ఎత్తిచూపింది, ఇక్కడ వ్యక్తులు ఎక్కువగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై దాడి చేయడం, చంపడం లేదా కొట్టడంతోపాటు ప్రార్థనా స్థలాలను కూల్చివేయడం జరిగింది. “ఈ సంఘటనలు ముఖ్యంగా మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి” అని నివేదిక పేర్కొంది.

అయితే భారత్‌లో మతస్వేచ్ఛపై దాడి జరుగుతోందని “అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ కమిషన్ (USCIRF)” విడుదల చేసిన తాజా నివేదికను భారత్ ఖండించింది. ‘యూఎసీసీఐఆర్ఎస్’ అనేది రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థగా పేర్కొంది. భారత్‌కు సంబంధించిన వాస్తవాలను ఆ సంస్థ తప్పుగా ప్రచారం చేస్తోందని, తమ దేశంపై ప్రేరేపిత కథనాలను కొనసాగిస్తోందని మండిపడింది.

“అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యూఎస్ కమిషన్ (USCIRI)పై మా అభిప్రాయమేంటో తెలుసు. అది రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ. భారత్ గురించి అవాస్తవాలను, ప్రేరేపిత కథనాలను వ్యాప్తి చేయడం కొనసాగిస్తూనే ఉంది” అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. యూఎస్ సీఐఆర్ఎఫ్ తాజాగా విడుదల చేసిన ఆ ప్రమాదకరమైన నివేదికను భారత్ తిరస్కరిస్తోందన్నారు తాజా నివేదిక ఆ సంస్థను మరింత దిగజార్చేందుకే ఉపయోగపడుతుందన్నారు.

నివేదికను తిరస్కరిస్తూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ… “రాజకీయ ఎజెండాతో కూడిన సంస్థ”పక్షపాతంగా ఇచ్చిన నివేదిక అని అందరికీ తెలిసిందే అని ఆయన అన్నారు.

ఈ హానికరమైన నివేదికను మేము తిరస్కరిస్తున్నాము, ఇది USCIRFని మరింత అప్రతిష్టపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది” అని జైస్వాల్ వ్యాఖ్యానించారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles