న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలలో ₹34,200 కోట్లు పెట్టుబడి పెట్టమని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థను ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన నివేదికను ఎల్‌ఐసి తిరస్కరించింది.ఈ నివేదిక ” నిరాధారమైనది, సత్యానికి దూరంగా ఉంది” అని ఎల్‌ఐసి తెలిపింది.
అమెరికా వార్తాపత్రిక నివేదికలో సూచించినట్లుగా, అదానీ గ్రూప్‌లోకి నిధులను చొప్పించడానికి కార్పొరేషన్ కోసం ప్రభుత్వ అధికారులు ఎటువంటి ప్రతిపాదనను రూపొందించలేదని బీమా సంస్థ తెలిపింది.
ఈ సంవత్సరం మే నెలలో బీమా సంస్థ మొత్తం ₹5,000 కోట్ల విలువైన అదానీ పోర్ట్స్, SEZ (APSEZ) బాండ్లను తీసుకున్నప్పుడు, అదానీ గ్రూప్‌లో LIC పెట్టుబడిని పోస్ట్ నివేదిక ఉదహరించింది. బాండ్లు 7.75% కూపన్‌ను అందించాయి.’AAA’ క్రెడిట్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
బాండ్ ఇష్యూలో LIC పెట్టుబడి పెట్టడాన్ని భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి, ప్రజా నిధుల దుర్వినియోగం చేశారని మండిపడ్డాయి. మే 2022లో పబ్లిక్‌గా విడుదలైన ఈ బీమా కంపెనీలో ప్రభుత్వానికి 96.5% వాటా ఉంది
స్వతంత్ర నిర్ణయాలు
బీమా సంస్థ ఏకైక బిడ్డర్‌గా ఉండి, పోటీ బిడ్డింగ్ ద్వారా 100% సెక్యూరిటీల కేటాయింపును పొందిన కార్పొరేట్ బాండ్ జారీల అనేక సందర్భాలు కూడా ఉన్నాయని LIC అధికారి ఒకరు ఆరోపణలను ప్రతిఘటించారు.
టాటా గ్రూప్‌లో దాదాపు 13 లక్షల కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌లో 42,600 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు చాలా తక్కువ ఆయన పేర్కొన్నారు.
ది వాషింగ్టన్ పోస్ట్ శుక్రవారం ప్రచురించిన నివేదిక… LICలో పెట్టుబడి నిర్ణయాలు కొందరు వ్యక్తుల సూచన మేరకు ప్రభావితమవుతాయని, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అదానీ గ్రూప్ కంపెనీలలో భారీగా పెట్టుబడి పెట్టాలని బీమా సంస్థకు సూచించారని ఆరోపించింది.
ఇటువంటి వాదనలు దాని పారదర్శక నిర్ణయ ప్రక్రియను దెబ్బతీసేందుకు, సంస్థ ప్రతిష్టను, అలాగే భారతదేశం బలమైన ఆర్థిక రంగ పునాదిని దెబ్బతీసేందుకు ఉద్దేశించినట్లు కనిపిస్తున్నాయని LIC ఒక ప్రకటనలో తెలిపింది.
బీమా సంస్థ తన పెట్టుబడి నిర్ణయాలన్నీ స్వతంత్రంగా, బోర్డు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా,పూర్తి శ్రద్ధతో తీసుకున్నట్లు తెలిపింది. ఆర్థిక సేవల విభాగం లేదా మరే ఇతర అధికారం దాని పెట్టుబడి ఎంపికలను ప్రభావితం చేయదని స్పష్టం చేసింది.
బీమా సంస్థ మొత్తం ఈక్విటీ పెట్టుబడి ₹7.3 లక్షల కోట్ల పుస్తక విలువను కలిగి ఉంది, దీని మార్కెట్ విలువ దాదాపు 15 లక్షల కోట్లు.
“(అదానీ బాండ్లలో) పెట్టుబడి ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా చేసారు. ఇది దీర్ఘకాలిక, అధిక-రేటెడ్ మౌలిక సదుపాయాల బాండ్ల కోసం LIC అవసరానికి అనుగుణంగా ఉంటుంది” అని పైన పేర్కొన్న వ్యక్తి చెప్పారు.
LIC దాదాపు రూ.5.5 లక్షల కోట్ల వార్షిక పెట్టుబడులు పెడుతుంది. ది వాషింగ్టన్ పోస్ట్ నివేదికలో పేర్కొన్న మొత్తం దాని మొత్తం వార్షిక పెట్టుబడులలో 1% కంటే తక్కువగా ఉంటుందని ఆ వ్యక్తి జోడించారు.
LIC అనేక అదానీ గ్రూప్ కంపెనీల ఈక్విటీ,రుణాలలో పెట్టుబడి పెట్టింది కానీ ఇప్పటివరకు అదానీ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడి పెట్టలేదు.


