31.7 C
Hyderabad
Thursday, October 3, 2024

విమాన క్యాబిన్ లోకి ఒకటే బ్యాగ్… డొమెస్టిక్ ప్రయాణికులకు వర్తింపు… భద్రతరీత్యా తప్పదన్న సీఐఎస్ఎఫ్!

న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లో ప్రయాణికులకు ఇకపై క్యాబిన్ లోపలికి కేవలం ఒకే హ్యాండ్ బ్యాగ్ తో ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు ఈ నిబంధనను అమలు చేయాలంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
‘దేశీయ ప్రయాణికులు సగటున రెండు,మూడు బ్యాగుల్ని స్క్రీనింగ్ కోసం తీసుకెళ్తున్నారు. దీంతో క్లియరెన్స్ సమయం పెరుగుతోంది. తీవ్ర జాప్యంతో పాటు చెక్ ఇన్ కౌంటర్లలో రద్దీతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. సర్క్యూలర్ పేర్కొన్న లేడీ బ్యాగ్, ఇతర వస్తువులు మినహాయించి ఒకటి కంటే ఎక్కువ బ్యాగుల్ని తీసుకెళ్లేందుకు ప్రయాణికులను అనుమతించకూడదని బీసీఏఎస్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బోర్డింగ్ పాస్లు, టికెట్లపై ‘వన్ హ్యాండ్ బ్యాగ్’ నియమాన్ని స్పష్టంగా ముద్రించాలని, విమానాశ్రయాల్లోనూ హోర్డింగ్లు, బ్యానర్లు, బోర్డుల ద్వారా ప్రయాణికులకు ఈ మేరకు సమాచారం అందజేయాలని బీసీఏఎస్ సూచించింది. దీంతో సంబంధిత ప్రయాణికులు అవసరమనుకుంటే వారి అదనపు బ్యాగుల్ని రిజిస్టర్డ్ బ్యాగేజీకి మార్చుకునే అవకాశం కలుగుతుందని తెలిపింది. ప్రయాణీకుడు సగటున 2-3 హ్యాండ్ బ్యాగ్‌లను స్క్రీనింగ్ పాయింట్‌కి తీసుకువెళ్లడంతో క్లియరెన్స్ కోసం సమయం పెరగడంతో పాటు ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్ (PESC) పాయింట్‌లో రద్దీ పెరిగి ప్రయాణికుల అసౌకర్యానికి దారితీస్తోంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని అన్ని విమానయాన సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని జనవరి 19న CISF IG (ఎయిర్‌పోర్ట్ సెక్టార్) విజయ్ ప్రకాష్ BCASకి లేఖ రాశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles