Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

విమాన ఇంధన స్విచ్‌ల కటాఫ్ వల్లే ఎయిర్ ఇండియా ప్రమాదం!

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమానప్రమాదంపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. 260 మంది మృతి చెందిన ఈ విషాదకర ఘటనలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ అయ్యాక సెకనుపాటు ఇంజిన్లకు ఇంధనం సరఫరా నిలిచిపోయినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. జూన్ 12న అహ్మదాబాద్‌లోని జనసాంద్రత కలిగిన నివాస ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిపోవడంతో 241 మంది ప్రయాణికులు, భూమిపై ఉన్న 19 మంది మరణించారు. […]
Read more

కూతురి ఫీజు వాపసు ఇవ్వాలని కోరిన రైతు… హత్య చేసిన స్కూల్‌ యాజమాన్యం!

ముంబయి: మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో తన కూతురికి ఫీజు వాపసు ఇవ్వాలని డిమాండ్ చేసిన 42 ఏళ్ల రైతును పాఠశాల యాజమాన్యం కొట్టి చంపినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం సాయంత్రం పూర్ణలోని జీరో ఫాటా ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు. రైతు జగన్నాథ్ హెంగ్డేపై రెసిడెన్షియల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్, అతని భార్య దాడి చేశారు. హెంగ్డే తన కుమార్తె ఫీజు వాపసు ఇవ్వాలని, ఆమె టీసీ కూడా ఇవ్వాలని డిమాండ్ […]
Read more

కన్నతండ్రి చేతిలో హత్యకు గురైన టెన్నిస్‌ క్రీడాకారిణి!

న్యూఢిల్లీ: హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్‌ యాదవ్‌ కాల్చి చంపారు. కూతురి సంపాదనతో బతుకుతున్నావని గ్రామస్థులు హేళన చేయడం, తన మాట వినకుండా రాధిక టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో దీపక్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తండ్రి దీపక్ యాదవ్ తన కుమార్తెపై ఐదు బుల్లెట్లు కాల్చగా, మూడు బుల్లెట్లు ఆమెను తాకాయి. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బుల్లెట్ గాయాలతో ఉన్న […]
Read more

చిట్టి చేతులు.. చెట్లను పెంచే ఆశయాలు!

పచ్చదనం ప్రచారానికి నడుం బిగించిన కోయంబత్తూర్ చిన్నారులు…తమిళనాడులో మొట్టమొదటి పిల్లల ప్రెస్ మీట్ కు సర్వత్రా ప్రశంసలు.. నేటి బాలలే రేపటి బాధ్యత గల పౌరులు’ అనే కొత్త నానుడిని కోయంబత్తూర్ ముస్లిం విద్యార్థులు నిజం చేశారు! పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని చాటి చెప్పారు. అందుకోసం ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యతను చిన్నారులు తమ భుజ స్కంధాలపై వేసుకొన్నారు. మట్టిలో చేతులు పెట్టి.. చిట్టి పొట్టి మొక్కలను నాటుదామని… భారత దేశాన్ని హరిత నిలయంగా […]
Read more

బీహార్ ఓటర్ల జాబితా సవరణ కోసం ఆధార్‌ను పరిగణించాలి…సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: బీహార్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)లో ఆధార్ కార్డులు, ఓటరు ఐడి కార్డు,రేషన్ కార్డులను ఆమోదయోగ్యమైన పత్రాలుగా పరిగణించాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి సూచించింది. జూన్ 24న ECI ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం… ఆధార్, ఓటరు ID కార్డులను మినహాయించి పౌరసత్వాన్ని నిరూపించడానికి 11 నిర్దిష్ట పత్రాలను జాబితా చేసింది. జూన్ 24న […]
Read more

“డ్రోన్‌తో ఢీ కొట్టి”ట్రంప్‌ను హత్య చేయాలనుకున్నాం… ఖమేనీ సలహాదారు!

టెహ్రాన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన ఇంట్లో సన్‌బాత్‌ చేస్తున్నప్పుడు డ్రోన్‌తో దాడి చేసి చంపాలనుకున్నామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మాజీ సలహాదారుడు పేర్కొన్నాడు. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా సైన్యం కూడా పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులకు ట్రంప్, అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ […]
Read more

గాజాలో 66 మంది పాలస్తీనియన్లను చంపిన ఇజ్రాయెల్!

జెరూసలెం: గాజాను శవాల దిబ్బగా మార్చినా ఇజ్రాయెల్‌ రక్త దాహం తీరలేదు. ఆ దేశం పదేపదే పాలస్తీనీయన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా పాలస్తీనా దిగ్బంధిత ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 66 మంది మరణించారు. చనిపోయిన వారిలో హెల్త్ క్లినిక్ వెలుపల పోషకాహార సప్లిమెంట్ల కోసం క్యూలో నిలబడిన ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. ఐక్యరాజ్యసమితి పిల్లల సంస్థ ప్రకారం, మరణించిన వారిలో ఒక సంవత్సరం వయస్సు గల బాలుడు కూడా ఉన్నాడు, అతని […]
Read more

వడోదర వంతెన కూలిన ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య!

గుజరాత్‌: వడోదర జిల్లాలో మహిసాగర్ నది వంతెన కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుందని అధికారులు తెలిపారు. రాత్రికి ఆ ప్రదేశంలో గాలింపు, సహాయక చర్యలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఇద్దరు వ్యక్తులు కనిపించకపోవడంతో ఈ రోజు ఉదయం ఇది తిరిగి అన్వేషణ మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాల నాటి ఆనంద్ – వడోదర జిల్లాలను కలిపే వంతెనలోని ఒక భాగం కూలిపోవడంతో అనేక వాహనాలు మహిసాగర్ నదిలోకి పడిపోయాయి. నదిలో దట్టమైన బురదలో వాహనాలు […]
Read more

భారత రాజ్యాంగ ‘ప్రవేశిక’పై నిప్పులు చెరుగుతున్న హిందూ జాతీయవాదులు!

దేశంలో అత్యవసర పరిస్థితి (1975) విధించిన సమయంలో రాజ్యాంగ ప్రవేశికలోని ‘సోషలిస్ట్’ ‘లౌకిక’ పదాలను చేర్చారని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ పదాలు బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో ఎప్పుడూ భాగం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యవసర పరిస్థితి సమయంలో, ప్రాథమిక హక్కులు నిలిపివేసారు, పార్లమెంట్ పనిచేయలేదు, న్యాయవ్యవస్థ కుంటిగా మారింది, ఆ తరణంలో ఈ పదాలు జోడించారని ఆయన అన్నారు. ఈ అంశంపై తరువాత చర్చలు జరిగాయని, […]
Read more

దేశంలో భక్తి వరదలై పారుతోంది!

ఈమధ్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా భక్తి వరదలై పారుతూ కనిపిస్తోంది..రోజు రోజుకూ కొత్త కొత్త పండుగలు పుట్టుకొస్తున్నాయి. గతంలో కేవలం ఉత్తర భారతంలోనే ఎక్కువగా జరుపుకునే గణపతి నవరాత్రులు ఇప్పుడు గల్లీ గల్లీకి విస్తరించాయి. అలాగే అయ్యప్పమాల వేసేవారు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. భక్తి పేరిట వేలు లక్షలు ఖర్చుపెట్టడం అతి సాధారణం అయిపోయింది. పోనీ ఆ తర్వాత జీవితంలో విలువలకు కట్టుబడి ఉంటున్నారా అంటే అదీలేదు. దేనిదారి దానిదే. అత్యంత క్రైమ్ రేట్ […]
Read more
1 101 102 103 104 105 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.