Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తమిళనాడు కస్టడీ మరణంపై సీబీఐ దర్యాప్తు…ఐదుగురు పోలీసుల అరెస్టు!

చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన కస్టడి మరణంపై సీఎం స్టాలిన్‌ కొరడా ఝళిపించారు. , దొంగతనం కేసుకు సంబంధించి విచారణ కోసం తీసుకెళ్లిన అజిత్ కుమార్ (29) మరణంపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేశారు. విచారణ కోసం తీసుకెళ్లిన అజిత్ కుమార్ తిరుప్పువనంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడని తెలిసి తాను బాధపడ్డానని, “విచారణ సమయంలో పోలీసులు కొట్టడం వల్లే” అని ముఖ్యమంత్రి అన్నారు. “ఇది అన్యాయం, క్షమించలేము” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ […]
Read more

డోనాల్డ్ ట్రంప్ మానసపుత్రిక మెగా-బిల్లుకు US సెనేట్ ఆమోదం!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మానసపుత్రిక వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును సెనేట్‌ ఆమోదించింది. పన్ను విరామం, వ్యయ కోతలతోపాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధుల కేటాయించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ వారం చివరి నాటికి ఈ బిల్లును చట్టంగా తీసుకురావాలనే ట్రంప్ లక్ష్యానికి ఇది ఒక ప్రధాన ముందడుగు. US ఉపాధ్యక్షుడు JD వాన్స్ నిర్ణయాత్మక ఓటుతో ఈ బిల్లు 51 నుండి 50 తేడాతో తృటిలో ఆమోదం పొందింది. […]
Read more

బీహార్‌లో దొడ్డిదారిన NRC?..కొత్త ఓటర్ల నమోదుకు బర్త్‌ సర్టిఫికేట్లు అడుతున్న వైనం!

పాట్నా: బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్ల నమోదు కోసం జనన ధృవీకరణ పత్రాలను అడగడం ఎన్‌ఆర్‌సీ పోలి ఉందని, ఇది దొడ్డిదారిన జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) అమలుకు సమానమని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ జరగనున్నాయి. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి… జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, CBSE/రాష్ట్ర బోర్డులు జారీచేసే X తరగతి […]
Read more

గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే…ట్రంప్!

వాషింగ్టన్‌ : గాజాలో 60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు రూపొందించిన షరతులను ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి తాము పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు. ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించే అధికారుల ద్వారా దీనికి సంబంధించిన పత్రాలను అందిస్తారని చెప్పారు. అలాగే గాజాలో ఇజ్రాయెల్‌తో 60 రోజుల కాల్పుల విరమణకు “తుది ప్రతిపాదన”కు అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మద్దతుగల […]
Read more

విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 72 గంటల బంద్!

గద్వాల్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు బంద్‌ చేపట్టారు. ఈ బంద్ నేటినుంచి 72 గంటల పాటు కొనసాగనుంది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా, గద్వాల్ జిల్లా ప్రధాన కార్యాలయంలోని శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల ఆవరణలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీం పాషా మీడియాతో మాట్లాడుతూ అనేక డిమాండ్లు చేశారు. […]
Read more

ఒడిశాలో ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం…మాజీ సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి!

భువనేశ్వర్: ఒడిశాలో ఓ ప్రభుత్వ అధికారి కొందరు దుండగులు దౌర్జన్యం చేశారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆయన ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశం నిర్వహిస్తుండగా, కార్యాలయం లోపలకు వచ్చిన యువకుల బృందం ఆయనపై మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. BMC కార్యాలయ ప్రాంగణంలో సాహూపై కొంతమంది యువకులు దాడి చేస్తున్నట్లు ఇందులో కనిపిస్తుంది, […]
Read more

డబ్బా ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించిన సూరత్ పోలీసులు…8 మంది అరెస్టు!

గుజరాత్: సూరత్ పోలీసులు రూ.943 కోట్ల డబ్బా ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ రాకెట్‌ను రియల్ ఎస్టేట్ సంస్థగా చెబుతూ నడిపిస్తున్నారని పోలీసులు తేల్చారు. ఈ స్కామ్‌కు సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి నగదు, గాడ్జెట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఇప్పటివరకు అక్రమ ఆన్‌లైన్ ట్రేడింగ్, బెట్టింగ్ నెట్‌వర్క్‌లో 250 మందికి పైగా వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించారు. నిందితులు వినియోగదారుల కోసం యూజర్ ఐడిలు, పాస్‌వర్డ్‌లను […]
Read more

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు…74 మంది మృతి!

జెరూసలేం: పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దమనకాండ కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య లక్షకు సమీపిస్తున్నా… ఇజ్రాయెల్‌ రక్తదాహం తీరడంలేదు. తాజాగా జరిగిన దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. మృతుల్లో మహిళలు, పిల్లలు పెద్దసంఖ్యలో ఉన్నారు. వైమానిక దాడిలో దక్షిణ గాజాలో ఆహార కోసం ఎదురుచూస్తున్న 23 మంది అన్నార్తులు మరణించారు. ఇజ్రాయెల్ దళాలు జనసమూహంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు నివేదించారు. మరో ఘటనలో సముద్రతీర కేఫ్‌పై జరిగిన వైమానిక దాడుల్లో 30 మంది మరణించారు. మహిళలు, […]
Read more

ఫార్మా కంపెనీలో పేలుడు…34కు పెరిగిన మృతుల సంఖ్య!

సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 34కి పెరిగిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో అనేక మృతదేహాలు బయటపడ్డాయి. మొత్తం 31 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. “రక్షణ చర్యలో చివరి దశ ఇంకా కొనసాగుతోంది” అని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరితోష్ పంకజ్ పిటిఐకి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రమాద స్థలాన్ని […]
Read more

హలో డాక్టర్…!

నిత్యం రోగుల ప్రాణాలు కాపాడేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్న వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నిజంగా డాక్టర్ అందిస్తున్న సేవలు మహోన్నతమైనవి. ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న వైద్యులందరికీ మా శుభాభినంనలు. నిత్యం రోగ పీడితులకు వైద్యం అందిస్తూ వాళ్లకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తూ, పలు వ్యాదులు, ఎన్నో ప్రమాదాలబారిన పడి చావుబ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడే వారికి సకాలంలో వైద్యమందించి వారికి ప్రాణ భిక్ష పెట్టేది కేవలం వైద్యులు మాత్రమే. అందుకే డాక్టర్లను ప్రాణదాతలంటారు. ఇంతటి మహోన్నతమైన, […]
Read more
1 105 106 107 108 109 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.