Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘వక్ఫ్ బచావో…దస్తూర్ బచావో’ సమావేశం ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక దినం!

ఇమారత్-ఎ-షరియా అధినేత మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రెహమానీ, భారత ముస్లింల ప్రాంతీయ, జాతీయ నాయకత్వంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఒక ముఖ్యమైన శక్తిగా కూడా ఎదిగారు. భారతదేశం అంతటా 5 కోట్ల ఇమెయిల్‌లను సమీకరించడం ద్వారా, సరైన ప్రణాళిక, అమలుతో జిల్లా వారీగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించడం, వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ద్వారా ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు…దేశవ్యాప్తంగా ఆయనకు […]
Read more

రాజ్యాంగ ప్రవేశికపై ఆర్‌ఎస్‌ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు…పోలీసులకు పిర్యాదు చేసిన భారత యువజన కాంగ్రెస్!

బెంగళూరు: భారత రాజ్యాంగ ప్రవేశికలో “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను చేర్చడాన్ని పునఃపరిశీలించాలని పిలుపునిచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసి) లీగల్ సెల్ కర్ణాటక యూనిట్ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లీగల్ సెల్ చైర్మన్ శ్రీధర్, కో-చైర్మన్ సమ్రుధ్ హెగ్డే, ఇతర ఆఫీస్ బేరర్లు,న్యాయవాదులు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూన్ 26న అత్యవసర పరిస్థితిని గుర్తుచేసుకుంటూ జరిగిన బహిరంగ సభలో […]
Read more

హిందీపై మహారాష్ట్ర యూ టర్న్‌… త్రీ-భాషా విధానం రద్దు!

ముంబయి: విద్యార్థులపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారన్న విమర్శల నేపథ్యంలో ఫడ్నవీస్‌ ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుంది. ఈ మేరకు పాఠశాలల్లో త్రీ-భాషా విధానంపై తీసుకొచ్చిన రెండు తీర్మానాలను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధానం భవిష్యత్తుపై చర్చించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత… దీనిని ఎలా అమలు చేయాలనే విషయాన్ని పరిశీలించేందుకు నరేంద్ర జాదవ్‌ నేతృత్వంలో ఒక కమిటీని వేశామని, ఈ కమిటీ […]
Read more

“వారిని విచారించండి”…ట్రంప్, నెతన్యాహుపై ఇరాన్ మతాధికారి ఫత్వా!

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇరాన్‌లోని ప్రముఖ షియా మతాధికారి గ్రాండ్ అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ‘ఫత్వా’ జారీ చేశారు. వారిని “దేవుని శత్రువులు” అని అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న కారణంగా అమెరికన్, ఇజ్రాయెల్ నాయకులను ఓడించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు. ఇరాన్‌ నేతలను బెదిరించే ఏ వ్యక్తి నైనా ‘యుద్ధనేత’ లేదా ‘మొహరేబ్’గా పరిగణిస్తారని” మకరెంజీ తన ఫత్వాలో పేర్కొన్నట్లు మెహర్ […]
Read more

మేక్ ఇన్ ఇండియా’ కాదు, ‘ఇన్వెన్ట్ ఇన్ తెలంగాణ’ మా నినాదం…మంత్రి శ్రీధర్ బాబు!

హైదరాబాద్: “మా దార్శనికత ‘మేక్ ఇన్ ఇండియా’ని మించిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ ప్రజా ప్రభుత్వం ‘ఇన్వెన్ట్ ఇన్ తెలంగాణ’పై దృష్టి సారించింది. తెలంగాణను ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చడమే విధానం అని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం హైటెక్స్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో (IITEX) 2025 ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా […]
Read more

వచ్చే ఏడాదినుంచి అన్ని టూ-వీలర్లకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్!

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింత పెంచే దిశగా రవాణా మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి అన్ని కొత్త టూవీలర్లకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎ‌స్‌)ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 125 సీసీ ఇంజన్‌ సామర్థ్యం దాటిన టూవీలర్లకే పరిమితమైంది. ఇకపై ఇంజన్‌ సామర్థ్యంతో సంబంధంలేకుండా అన్ని స్కూటీలు, బైకులు, మోటార్‌ సైకిళ్లకు ఎబీఎస్‌ తప్పనిసరి కానుంది. అంతేకాదు కొత్త బండి […]
Read more

ప్రవేశిక వివాదం: హిందూత్వ భావజాలం vs అంబేద్కర్ రాజ్యాంగం!

ముంబై: యాభై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించినందుకుగానూ, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే డిమాండ్ చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయంలో చేర్చిన “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించాలని కూడా హోసబాలే గట్టిగా డిమాండ్ చేశారు. “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన ప్రవేశికలో ఈ పదాలు లేవు” అని హోసబాలే వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో “ప్రాథమిక హక్కులను […]
Read more

“నాన్న దగ్గరికి పరిగెత్తడం తప్ప మరో మార్గం లేదు”…ఇజ్రాయెల్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్‌!

టెహ్రాన్: ఇరాన్ అయతుల్లా అలీ ఖమేనీని ” అవమానకరమైన మరణం” నుండి కాపాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ” ఆమోదయోగ్యం కాని” వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఖండించారు. అణు “ఒప్పందం కోరుకోవడంలో అధ్యక్షుడు ట్రంప్‌కు నిజాయితీగా ఉంటే, అతను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీని మర్యాదగా సంబోధించాలని, ఖమేనీని అభిమానించే లక్షలాది మంది మద్దతుదారులను బాధపెట్టడం ఆపాలని అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ […]
Read more

తెలంగాణలో ఈనెల 30 నుండి జూనియర్ డాక్టర్ల సమ్మె!

హైదరాబాద్: తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె సైరన్‌ మోగించారు. సమ్మెనుంచి అత్యవసర సేవలను మినహాయించారు. తమ సమస్యలపై రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో 30వ తేదీ నుండి రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలల్లో నిరవధిక సమ్మెను ప్రారంభించనున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (T-JUDA) ప్రకటించింది. నవంబర్ 2024 నుండి తాము ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శికి, ఆరోగ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదన్నారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ […]
Read more

తెలంగాణలోని 339 గ్రామాల నుండి ఆదివాసీలను తరలించడాన్ని వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు!

హైదరాబాద్: టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో కుమ్రం-భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాల నుండి ఆదివాసీలను తరలించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) తీవ్రంగా వ్యతిరేకించింది. గురువారం, సిర్పూర్ (యు), వాంకిడి, జైనూర్, కెరమేరి, ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్, నార్నూర్, సిర్పూర్ (టి), చింతల మాసపల్లి, గాజుగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికల్‌పేట్ మండలాల్లోని ఆదివాసీలు తమ నివాసాలను వదిలి వెళ్ళవలసి వస్తోందని హైలైట్ చేస్తూ సిపిఐ (ఎం) రాష్ట్ర ప్రభుత్వానికి ఒక […]
Read more
1 106 107 108 109 110 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.