Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ట్రంప్‌ సుంకాలు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు…అయినా తగ్గేదేలేదన్న అగ్రరాజ్యాధిపతి!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలను ఆదేశ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై తాత్కాలికంగా 10% టారిఫ్‌ అమలు చేస్తున్నట్లు యూఎస్‌ ప్రకటించింది. ఈమేరకు ఫిబ్రవరి 24 నుండి 150 రోజుల పాటు ఈ సుంకాలు అమలులో ఉంటాయి. పలు దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలు… చట్టవిరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుంకాలు విధించేందుకు అత్యవసర అధికారాల వినియోగం సరికాదని పేర్కొంది. ఈ మేరకు ట్రంప్‌ విధించిన టారిఫ్‌లను కొట్టివేసింది. రిపబ్లికన్ అధ్యక్షుడి తీరు […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం…మరణాల సంఖ్యపై లాన్సెట్‌ షాకింగ్‌ నివేదిక!

లండన్‌: ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం… గాజాలో ఇజ్రాయెల్ చేసిన మారణహోమం జరిగిన మొదటి 15 నెలల్లో 75,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు, ఇది స్థానిక ఆరోగ్య అధికారులు ఆ సమయంలో ప్రకటించిన 49,000 మరణాల కంటే చాలా ఎక్కువని లాన్సెట్‌ అధ్యయనం తేల్చింది. పీర్-రివ్యూడ్ పరిశోధన ప్రకారం ఆ కాలంలో హింసాత్మక మరణాలలో మహిళలు, పిల్లలు, వృద్ధులు 56.2 శాతం ఉన్నారని తేలింది ఈ నిష్పత్తి గాజా […]
Read more

తెలంగాణలో ‘ఎస్‌ఐఆర్‌’ కోసం ఈఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చిన సీఈఓ!

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) సర్వేకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది. ఈమేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి నాలుగు కీలక జిల్లాలైన – మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి,హైదరాబాద్ నుండి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ERO) కోసం సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 50 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇది రాబోయే స్పెషల్ ఇంటెన్సివ్ […]
Read more

మోహన్ భగవత్ ‘ఘర్ వాపసీ’ పిలుపును ఖండించిన మౌలానా అర్షద్ మదానీ!

న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఇచ్చిన “ఘర్ వాపసీ” పిలుపును జమాత్‌ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలతపెడతాయని, భారతదేశ లౌకిక నిర్మాణానికి ప్రమాదకరమని ఆయన అభివర్ణించారు. “ఇరవై కోట్ల మంది ముస్లింల”ను “ఘర్ వాపసీ” చేయించాలనే ఆలోచన గత ఏడు దశాబ్దాలుగా వినలేదని మదానీ ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశాన్ని… నాశనం, విధ్వంసం, అశాంతి, పరస్పర శత్రుత్వం వైపు నెట్టే ఏదైనా దేశానికి ద్రోహంగా పరిగణించరని […]
Read more

తరావీహ్ సందర్భంగా మసీదు దగ్గర నినాదాలు…హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉద్రిక్తత!

హైదరాబాద్: నిన్న రాత్రి స్థానిక జామియా మసీదులో తరావీహ్ నమాజ్ జరుగుతుండగా… శివాజీ మహారాజ్ జయంతి ఊరేగింపులో పాల్గొన్న కొంతమంది నినాదాలు చేయడంతో అంబర్‌పేటలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక నివేదికల ప్రకారం…రాత్రి 10 గంటల ప్రాంతంలో మసీదులో నమాజ్ చేస్తున్న సమయంలో ఊరేగింపులో పాల్గొన్న కొందరు నినాదాలు చేయడంతో సమస్య చెలరేగింది. దీనికి నమాజ్‌ చేసుకుంటున్న వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వెంటనే అదనపు పోలీసులను సంఘటనా […]
Read more

హైదరాబాద్‌లో 13వేల కోట్ల విలువైన అక్రమ ఆన్‌లైన్ గేమింగ్‌ సిండికేట్‌పై జీఎస్టీ అధికారుల దాడి!

హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్టీ అధికారులు భారీ స్థాయిలో దాడులు చేపట్టారు. ఈ ఆపరేషన్‌ సందర్భంగా పెద్దమొత్తంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన సిండికేట్‌ను అధికారులు ఛేదించారు. ఈ అక్రమ జీఎస్టీ అక్రమ ఎగవేతల విలువ రూ.13,000 కోట్లు అని అధికారులు లెక్క తేల్చారు. ఈమేరకు మోసంలో కీలక పాత్ర పోషించిన యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్టు చేసింది. దర్యాప్తు వివరాల ప్రకారం… అక్రమ ఆన్‌లైన్ […]
Read more

వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల నుండి పరిశ్రమలను తరలిస్తాం…సీఎం రేవంత్‌ రెడ్డి!

ముంబయి: రానున్న ఐదేళ్లలో తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఉండవని, గ్రామీణ ప్రాంతాలకు లేదా హైదరాబాద్ శివార్లలోకి మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ముంబైలో జరిగిన క్లైమేట్ వీక్ (2026) సదస్సులో సీఎం కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి దృక్పథాన్ని వివరించారు, ఆర్థిక వృద్ధిని పర్యావరణ స్థిరత్వంతో అనుసంధానించారు. ఆర్థిక వ్యవస్థ లేదా కరెన్సీ విలువ విద్యుత్, ఇంధన వినియోగానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందని నొక్కి చెప్పారు. 2030 నాటికి […]
Read more

రాజకీయ మంటలు రేకెత్తించిన బీజేపీ ఎమ్మెల్యే లింగ వివక్ష వ్యాఖ్యలు!

జైపూర్‌: రాష్ట్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలి లింగవివక్ష వ్యాఖ్యలు చేయడంతో రాజస్థాన్ అసెంబ్లీలో రాజకీయ వివాదం చెలరేగింది. బిజెపి ప్రభుత్వ బడ్జెట్‌ను “అబ్బాయి జననం” తో, గత కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌ను “అమ్మాయి జననం” తో పోల్చారు. బడ్జెట్ చర్చలో పాల్గొన్న వీర్ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలి మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం “యువ బడ్జెట్” ను సమర్పించిందని, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు “వృద్ధాప్య బడ్జెట్” ను సమర్పించిందని […]
Read more

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌: రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సెక్యులరిజం, మత సామరస్యానికి తెలంగాణ ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుందని సీఎం చెప్పారు. రంజాన్ పవిత్ర నెల దానికి ఒక చిహ్నమని ఆయన చెప్పారు. ముస్లింలు పవిత్ర మాసం అంతా పాటించే ఉపవాసాలు, ప్రార్థనలు ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, భక్తిని పెంపొందిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో లౌకికవాదం, మత సామరస్యానికి తెలంగాణ ప్రతిరూపంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు […]
Read more

గుడారాలలో రంజాన్ జరుపుకుంటున్న గాజా నిర్వాసితులు!

గాజా: ఈ సంవత్సరం పవిత్ర రమజాన్‌ మాసం తన కుటుంబం ఒకప్పుడు అనుభవించిన ఆనందం లేకుండా ప్రారంభమైందని నిరాశ్రయులైన ఓ పాలస్తీనా తండ్రి వాపోయారు. ఇజ్రాయెల్ ఊచకోతకు ముందు రంజాన్ ఆనందాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనిక దాడుల నుండి పారిపోయి మావాసిలోని ఒక గుడారంలో నివసిస్తున్న పిల్లల తండ్రి వలీద్ అల్-జమ్లీ మాట్లాడుతూ…రంజాన్ మొదటి రోజు లాంతర్లు, స్వీట్లు, పిల్లల కోసం ప్రత్యేక వంటకాలతో నిండి ఉండేదని అన్నారు. “యుద్ధానికి ముందు, మేము రంజాన్‌ […]
Read more
1 11 12 13 14 15 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.