Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం!

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ముసాయిదా బిల్లుకు న్యాయపర చిక్కులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ నుండి వచ్చిన మధ్యంతర నివేదికను క్యాబినెట్ సమీక్షించింది. వివిధ వర్గాల నుండి 71 పిటిషన్లను పరిశీలించిన తర్వాత కమిషన్ మార్చి 2న […]
Read more

మణిపూర్‌లో గవర్నర్‌ డెడ్‌లైన్‌ తరువాత 196 ఆయుధాల అప్పగింత…మిగతా వాటికోసం ఆపరేషన్!

ఇంఫాల్: మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా విజ్ఞప్తికి స్పందిస్తూ, దోచుకున్న, అక్రమంగా కలిగి ఉన్న 196 ఆయుధాలు పోలీసులకు తిరిగి వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా మార్చి 6లోపు ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్‌ డెడ్‌లైన్‌ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాలు – చురాచంద్‌పూర్, బిష్ణుపూర్, తౌబాల్, ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, కాక్చింగ్, జిరిబామ్, ఫెర్జాల్‌లలో 196 ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు […]
Read more

బంగ్లాదేశ్ మీదుగా బెంగాల్- ఈశాన్య రాష్ట్రాల మధ్య కొత్త ఆర్థిక కారిడార్ నిర్మించాలన్న మేఘాలయ!

గువహతి: బంగ్లాదేశ్ మీదుగా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య ప్రాంతం కనెక్టివిటీని పెంచాలని మేఘాలయ ప్రభుత్వం డిమాండ్ చేసింది. హిలి-మహేంద్రగంజ్ ట్రాన్స్‌నేషనల్ ఎకనామిక్ కారిడార్‌తో ఇది సాధ్యమవుతుందని తెలిపింది. కాగా హిలి పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు పట్టణం కాగా, మహేంద్రగంజ్ మేఘాలయ గారో హిల్స్ ప్రాంతంలో సరిహద్దు పట్టణం. ఈ రెండు ప్రాంతాలు బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటాయి. ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా కోల్‌కతా నుండి తురా, బాగ్మారా, డాలు, డాకి వంటి వృద్ధి కేంద్రాలకు 100 కి.మీ […]
Read more

‘మీకు హోలీ ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండండి’ యుపీ డీఎస్‌పీ అనుజ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు!

ఉత్తరప్రదేశ్‌ : పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థనలతో పాటు వచ్చే హోలీ పండుగకు ముందు సంభాల్‌ పోలీస్‌ అధికా అనుజ్ చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. సంభాల్ సర్కిల్ ఆఫీసర్ (సిఓ) అనుజ్ చౌదరి గురువారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ…హోలీ రంగులు మీకు అసౌకర్యంగా అనిపిస్తే ఆరోజు ఇంట్లోనే ఉండాలని సూచించారు, హోలీ పండుగ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది, శుక్రవారం ప్రార్థనలు సంవత్సరానికి 52 సార్లు వస్తాయని వివాదాస్పద […]
Read more

ప్రైవేట్ పాఠశాలల వార్షిక ఫీజులను 15 శాతం పెంచాలని ప్రతిపాదించిన ‘ట్రెస్మా’ !

హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలు ఏటా 15 శాతం ఫీజు పెంపుతో పాటు ఫీజు ఎగవేతదారుల నిర్వహణకు మార్గదర్శకాలను ప్రతిపాదించాయి. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ గుర్తింపు పొందిన స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TRSMA ప్రతిపాదనల ప్రకారం, పాఠశాలలు 15 శాతానికి మించి ఫీజులను పెంచాల్సిన అవసరం ఉంటే ఫీజు నియంత్రణ కమిటీ నుండి అనుమతి పొందాలి. తెలంగాణలోని ఏ పాఠశాల కూడా విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేయకుండా ఉండేలా ఫీజు నియంత్రణ […]
Read more

డీలిమిటేషన్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్: పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవడానికి పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ పై అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత గురువారం ఆలస్యంగా విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నియోజకవర్గాల డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి హాని కలిగించాలని యోచిస్తోందని సమాచార, ప్రజా సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాదిలో పెరిగే విధంగా […]
Read more

ఏప్రిల్‌ 2 నుంచి భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకం…ట్రంప్!

న్యూఢిల్లీ: తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న  భారతదేశంపై ప్రతీకారం సుంకం ఏప్రిల్ 2 నుండి అమలులోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆకస్మికంగా అమెరికాకు బయలుదేరారు. ఈ మేరకు అమెరికా అధికారులతో అత్యవసర వాణిజ్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారతదేశం, మెక్సికో, కెనడా సహా మిగతా దేశాలు మనం వసూలు చేసే దానికంటే […]
Read more

బందీలను విడుదల చేయండి…హమాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్‌!

వాషింగ్టన్: గాజాలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో రాశారు. ‘షాలోమ్ హమాస్’ అంటే హలోనా? గుడ్ బైనా?.. ఏదో మీరే ఎంచుకోండి. బందీలందరినీ వెంటనే విడుదల చేయండని హమాస్‌ను బెదిరించారు . మీరు విడుదల చేసిన కొందరు బందీలను నేను కలిశాను. ఇదే మీకు నా చివరి హెచ్చరిక. గాజాను వెంటనే వీడండి. ఇదే మీకు […]
Read more

ఉత్తరాఖండ్‌లో ‘మదరసాలు’, మసీదులకు సీలు… రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించిన ముస్లింలు!

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ముస్లిం వ్యతిరేక ప్రచారం పవిత్ర రంజాన్ మాసంలోనూ కొనసాగుతోంది. ఇటీవల, డెహ్రాడూన్ జిల్లాలోని అనేక మదర్సాలు, ఒక మసీదుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా, అనేక మదర్సాలను సీలు చేశారు. ఇతర మదర్సాలకు నోటీసులు జారీ చేశారు, దీంతో స్థానిక ముస్లిం సమాజం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. . ప్రభుత్వం చేపట్టిన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన” చర్యలను నిరసిస్తూ మార్చి 4న […]
Read more

తెలంగాణ వ్యాప్తంగా మార్చి 8 న జాతీయ లోక్ అదాలత్!

హైదరాబాద్: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మార్చి 8 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. తద్వారా ప్రీ-లిటిగేషన్, పెండింగ్ కేసులు రెండింటినీ సహా సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ కార్యనిర్వాహక ఛైర్మన్‌తో పాటు, ప్రధాన న్యాయమూర్తి, ప్యాట్రన్-ఇన్-చీఫ్ మార్గదర్శకత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. లోక్ అదాలత్ ఉచితంగా సేవలను అందిస్తుంది. ఈ విధానం ద్వారా సమస్య పరిష్కారమైతే పెండింగ్ కేసులలో […]
Read more
1 148 149 150 151 152 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.