Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం…కోహ్లీ సెంచరీ!

దుబాయ్:: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయమైన విజయాన్నిఅందుకుంది. ఐసిసి టోర్నమెంట్లలో పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ… మరోసారి ఈ మ్యాచ్‌లో విజృంభించాడు, ఈ బ్యాటింగ్ ఐకాన్ అద్భుత ఆటతీరుతో అజేయంగా 100 పరుగులు చేసి పాక్ జట్టపై సునాయస విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గ్రూప్ Aలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్ స్థానాన్ని దాదాపుగా కైవసం చేసుకుంది. అయితే, వరుసగా రెండో ఓటమి తర్వాత […]
Read more

భారత్‌పై ప్రతీకార సుంకం విధిస్తాం…డోనాల్డ్‌ ట్రంప్‌!

వాషింగ్టన్: భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో పరస్పర సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. , ఈ దేశాలు అమెరికన్ వస్తువులపై విధించే సుంకాలను అమెరికా కూడా విధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. “మేము త్వరలో పరస్పర సుంకాలను విధిస్తాము — వారు మాపై వసూలు చేస్తారు, మేము వాటిని వసూలు చేస్తాము. భారతదేశం లేదా చైనా వంటి ఏ కంపెనీ లేదా దేశం వసూలు చేసినా, మేము న్యాయంగా ఉండాలని అనుకుంటున్నామని […]
Read more

తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దకండి…కేంద్రానికి సీఎం స్టాలిన్ వార్నింగ్!

చెన్నై: జాతీయ విద్యా విధానంలో భాగంగా రూపొందించిన త్రిభాషా ఫార్ములా కింద తమిళనాడుపై హిందీని రుద్దడానికి కేంద్ర విద్యాశాఖా మంత్రి ప్రయత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ విమర్శించారు. రాష్ట్రానికి హాని కలిగించే దేనిని తాను అనుమతించబోనని స్టాలిన్ అన్నారు. తమిళ గుర్తింపును సవాలు చేయవద్దని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం స్టాలిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “రాష్ట్రాలు అభివృద్ధి చెంది బలంగా మారినప్పుడు […]
Read more

కాంగ్రెస్ ఏడాదిపాలనపై బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్, కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరిన సీఎం రేవంత్‌రెడ్డి!

నారాయణపేట: కాంగ్రెస్ ఏడాది పాలన, తెలంగాణలో బిఆర్ఎస్ పదేళ్ల పాలన, కేంద్రంలో బిజెపి పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్‌కు సవాలు విసిరారు. శుక్రవారం నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో తాను ఓట్లు అడగనని ప్రకటించారు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బిఆర్ఎస్ కూడా ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్లు […]
Read more

షిరిబిబాస్‌కు సంతాపం తెలుపుతున్న ప్రపంచం…అదే సమయంలో ఇజ్రాయెల్ చంపిన 17,880 పిల్లలను మరిచింది!

గాజా: ఇజ్రాయెల్‌ బాంబుల ధాటికి మరణించిన బందీలు షిరి బిబాస్, ఆమె పిల్లల అవశేషాలను హమాస్ తిరిగి ఆ దేశానికి అప్పగించింది. కానీ ఇజ్రాయెల్ చంపేసిన పాలస్తీనా పిల్లల ఆక్రందనలు, దుఃఖిస్తున్న తల్లుల రోదనలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, అయినా ఇజ్రాయెల్ మిత్రదేశాలు, వారిని సమర్థించే మీడియాకు మాత్రం ఇవి వినబడటం లేదు. గాజాలో బందీగా ఉన్న ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సహా నలుగురు ఇజ్రాయెలీయుల మృతదేహాలను తిరిగి ఇచ్చే వేడుకలకు ప్రపంచం స్పందించినప్పటికీ, […]
Read more

జీఓ 99 కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే హైడ్రాను మూసివేస్తాం…తెలంగాణ హైకోర్టు వార్నింగ్!

హైదరాబాద్: హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా  కూల్చివేత చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు 99 కు వ్యతిరేకంగా HYDRAA చర్యలు కొనసాగిస్తే, , HYDRAAను పూర్తిగా మూసివేయాల్సి రావచ్చని కోర్టు హెచ్చరించింది. హైడ్రా ఏర్పాటు జీవో 99ను చదివారా? ఆ జీవోలోని నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలని తెలియదా అని వ్యాఖ్యానించింది. నిబంధనల పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. […]
Read more

భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అమెరికా సాయం…కాంగ్రెస్, బీజేపీ ప్రత్యాపరోణలు!

న్యూఢిల్లీ: భారత్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు గత బైడెన్‌ ప్రభుత్వం రూ.181 కోట్ల నిధులు కేటాయించిందని ఇటీవల ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ(డోజ్‌) వెల్లడించింది. దీనిపై మియామిలో జరిగిన ఎఫ్‌ఐఐ సదస్సులో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు అమెరికా ఎందుకు 21 మిలియన్‌ డాలర్ల సాయం చేయాలంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు చేశారు. ఈ మేరకు భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను […]
Read more

నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన కిట్ వ్యవస్థాపకుడు అచ్యుత సామంత!

భువనేశ్వర్: నగరంలోని కిట్ డీమ్డ్ యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి, ఆత్మహత్య, తదనంతరం పొరుగు దేశ విద్యార్థులపై దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) వ్యవస్థాపకుడు అచ్యుత సామంత గ నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. క్యాంపస్‌ను ఖాళీ చేసిన వారందరూ తిరిగి రావాలని కోరాడు. ఈ సంఘటనపై సామంత చేసిన మొదటి బహిరంగ ప్రకటన వీడియోను KIIT X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు, ఈ […]
Read more

మోడీ ప్రభుత్వం జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తోంది…ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే!

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా 90 కొత్త గ్రామాలను నిర్మిస్తోందని వచ్చిన నివేదికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామం భారతదేశ జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతను… సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పీఆర్ స్టంట్స్, తప్పడు ప్రకటనలకే ప్రాధాన్యతనిస్తోంది. నేషనల్ సెక్యురిటీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని తెలిపారు. చైనాకు రెడ్ […]
Read more

సైబర్ బాధితులకు ఊరట…!

హైదరాబాద్: సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న పలువురు బాధితులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఊరట కల్పించారు. సైబర్ మోసాల కారణంగా కోల్పోయిన రూ.62,46,900 లక్షల విలువైన డబ్బును తిరిగి చెల్లించే వీలు కల్పించారు. మొత్తం 16 కేసులకు గాను ఎనిమిది స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి మోసాలు, ఆరు ఫెడెక్స్, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. అలాగే ఒక రుణ మోసం కేసు, మరొకటి ఇంప్రెశన్ ప్రాడ్ కేసు ఉన్నాయి. ఈ మేరకు బాధితులుందరికీ మోసపోయిన మొత్తాన్ని తిరిగి […]
Read more
1 153 154 155 156 157 158

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.