Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

డిజిటల్ అరెస్ట్ పేరిట వృద్ధుడిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు!

హైదరాబాద్‌: డిజిటల్‌ అరెస్టు పేరుతో ఓ వృద్ధుడిని సైబర్‌ కేటుగాళ్లు మోసం చేసారు. ఆ విశ్రాంత ఉద్యోగి నుంచి నిందితులు 59 లక్షలు కొట్టేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే… డిసెంబర్ 4న రిటైర్డ్ ఉద్యోగికి గుర్తు తెలియని వ్యక్తులు… పోలీసులు, ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వాట్సాప్‌లో కాల్స్ చేశారు. మానవ అక్రమ రవాణా, విదేశీ ఉద్యోగ మోసం, మనీలాండరింగ్ కేసులలో పాల్గొన్నందుకు అరెస్టు చేయబోతున్నామని వారు వృద్ధుడికి చెప్పారని, అతనిని బెదిరించడానికి మెసేజింగ్ పోర్టల్‌లో నకిలీ అరెస్ట్ […]
Read more

బంగ్లాదేశ్ ఆగని నిరసనలు…ఢాకాకు చేరుకున్న ఉస్మాన్ హాది మృతదేహం!

న్యూఢిల్లీ: యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణానికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్‌లో రెండో రోజు నిరసనలు కొనసాగాయి. వార్తాపత్రిక గృహాలను లక్ష్యంగా చేసుకుని హింస జరిగింది. ఆగ్రహంతో బంగ్లాదేశ్‌లోని రెండు ప్రముఖ పత్రికా కార్యాలయాలు… బెంగాలీ పత్రిక ప్రోథమ్‌ అలో, ఆంగ్ల పత్రిక డెయిలీ స్టార్‌పై దాడి చేసి వాటికి నిప్పు పెట్టారు. కొందరు ఆందోళనకారులు డెయిలీ స్టార్‌ కార్యాలయంలోని సిపియులు, మానిటర్లు, కుర్చీలను ఎత్తుకెళ్లారు. హింస ఎంతకు తగ్గకపోవడంతో పత్రికా సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. […]
Read more

తమిళనాడులో ఎస్ఐఆర్…97.4 లక్షల ఓటర్లను తొలగింపు!

చెన్నై: తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుండి మొత్తం 97.4 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆమె చెప్పారు.కొత్త ముసాయిదా ప్రకారం మొత్తం ఓటర్ల జాబితాలో […]
Read more

‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు ఊరట!

న్యూఢిల్లీ: ‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై చార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐకి అనుమతి మంజూరు చేస్తూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు ఈరోజు రద్దు చేసింది. మోయిత్రా పిటిషన్‌పై జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ… “ఆ ఉత్తర్వు రద్దు చేసాం. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం… సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఒక నెలలోపు అనుమతి మంజూరుపై పునఃపరిశీలన […]
Read more

యువ నాయకుడి హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో నిరసనలు!

ఢాకా: బంగ్లాదేశ్‌లో 2024 విద్యార్థి ఉద్యమానికి కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన షరీఫ్ ఉస్మాన్ హదిపై కాల్పులు జరగడంతో తీవ్రంగా గాయపడి, సింగపూర్‌లోని ఆసుపత్రిలో మరణించడంతో దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. వేలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో ఢాకాలోని కొన్ని పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హాదీ మరణాన్ని “దేశానికి తీరని లోటు”గా […]
Read more

నేటినుంచే హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌!

హైదరాబాద్‌: హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌కు వేళయింది. ఈ పుస్తక ప్రదర్శన నేటినుంచి ఈనెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. మద్యాహ్నం ఒంటిగంటనుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది. ఈ ఏడాది ప్రదర్శనను పుస్తకాల స్ఫూర్తిని చాటిచెప్పేలా, పిల్లల కోసం పండుగ వాతావరణాన్ని సృష్టించేలా ప్రణాళిక వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్‌ఫెయిర్‌లో మొత్తం 365 స్టాళ్లు, పఠనం ప్రాముఖ్యతను బలోపేతం చేసే లక్ష్యంతో అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పుస్తకాల కొనుగోలు, అమ్మకాలకు అతీతంగా ఈ […]
Read more

ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా ఏం వెతికారో తెలుసా?!

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన అంశాల జాబితాను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. టాప్ ట్రెండింగ్‌లను వెల్లడించింది. మొత్తం టాప్ టెన్ సెర్చ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొదటి స్థానంలో నిలిచి…భారత్‌లో క్రికెట్‌కు ఉన్న అభిమానాన్ని మరోసారి ఈ నివేదిక నిరూపించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఈ ఏడాది ఐపీఎల్‌ కప్పును గెలవడంతో, ఈ సలా కప్‌ నమ్‌దే’ అనే హ్యష్‌ట్యాగ్‌ […]
Read more

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూనే ఉన్నారు…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం గ్రామ పంచాయతీలను గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరిగిన 12,702 గ్రామ పంచాయతీలలో, కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు 7,527 చోట్ల విజయం సాధించగా, పార్టీ రెబల్ అభ్యర్థులు 808 గ్రామాలను కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. “అది పట్టణమైనా, గ్రామీణమైనా, గత రెండేళ్లుగా జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికలలో ప్రజలు మా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు,” అని ముఖ్యమంత్రి ఇక్కడ […]
Read more

గాజా స్థిరీకరణ దళం ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వకూడదు…ఖతార్‌!

వాషింగ్టన్‌: కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం గాజాలో మోహరించనున్న ప్రతిపాదిత స్థిరీకరణ దళం ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వకూడదని ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థాని అన్నారు. వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశాల తర్వాత…ఖతార్‌కు చెందిన అల్ జజీరా ఛానెల్‌తో మాట్లాడుతూ, గాజాలో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ఉల్లంఘనలు మధ్యవర్తులను “ఇబ్బందికరమైన […]
Read more

ఢిల్లీలో పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ ‘నో’!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠినమైన కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు నుండి బీఎస్-VI ఇంజన్లు లేని వాహనాలను ఢిల్లీలోకి అనుమతించడం లేదు. అలాగే కాలుష్య ధృవీకరణ పత్రం లేని వాహనాలకు బంకుల్లో పెట్రోల్ పోయరు. కాగా, ఢిల్లీలోకి పాత కార్లకు ప్రవేశం లేదన్న నిర్ణయం… సమీపంలోని గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుండి ఢిల్లీలోకి ప్రవేశించే 12 లక్షల వాహనాలపై […]
Read more
1 36 37 38 39 40 160

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.