Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రచ్చ రచ్చ అయిన పూణే భూ ఒప్పంద వివాదం…డీల్ రద్దు చేసిన అజిత్ పవార్!

ముంబయి: పూణేలో భూ ఒప్పంద వివాదం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ కొడుకు పార్ధ్‌పవార్‌కు చెందిన కంపెనీకీ కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా దోచిపెట్టిన వైనంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో డీల్ రద్దు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. తన కుమారుడు పార్థ్ పవార్ సంస్థ కొనుగోలు చేయాలనుకున్న రూ. 300 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదని తన కొడుక్కి తెలియదని, వివాదం రేగడంతో […]
Read more

ఆలోచించి ఓటేయండి…జూబ్లీహిల్స్ ఓటర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి!

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఓటర్లను తెలివిగా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు నిన్న విలేకరులతో మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గత ఏడాది కాలంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో […]
Read more

గాజా మారణహోమం…ఇజ్రాయెల్‌కు ‘బ్లాంక్‌ చెక్’ ఇచ్చిన జో బిడెన్‌!

వాషింగ్టన్‌: గాజా విషయంలో మాజీ అధ్యక్షుడు జో బిడెన్ విధానాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ – పాలస్తీనా పట్ల అమెరికా విధానంలో పెద్ద మార్పు రావాలని పిలుపునిచ్చారు. వాషింగ్టన్ D.C.లో జరిగిన ఒక కార్యక్రమంలో US కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా మాట్లాడుతూ… “మనం సత్యంతో ప్రారంభించాలి. అధ్యక్షుడు బిడెన్ గాజాకు సంబంధించి సరిగ్గా వ్యవహరించలేదు. ఆయన తప్పు చేశారు. మనం ఎప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వకూడదని అన్నారు.” కాగా, […]
Read more

బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల నుండి వీధి కుక్కలను తొలగించండి…సుప్రీంకోర్టు సంచలన ఆదేశం!

న్యూఢిల్లీ: కుక్కకాటు కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు ప్రజల భద్రత, పరిశుభ్రత కోసం… స్టెరిలైజేషన్ తర్వాత కుక్కలను సంబంధిత డాగ్ షెల్టర్లకు మార్చాలని పేర్కొంది. ఎనిమిది వారాల్లోగా ఈ తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాలలో స్పష్టం చేసింది. కుక్క […]
Read more

చేవెళ్ల బస్సు దుర్ఘటన…బీజాపూర్ హైవే విస్తరించాలని స్థానికుల డిమాండ్!

హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాదం .. చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం… రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ గ్రామస్తులు బీజాపూర్ హైవే వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రహదారి విస్తరించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. వికారాబాద్-బీజాపూర్ హైవేలోని గ్రామాల్లో నివసిస్తున్న అనేక మంది విద్యార్థులు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైవేపై అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున, రోడ్డు విస్తరణ […]
Read more

జూబ్లీహిల్స్ ఎన్నిక… ఓటర్లకు ఫోటో ఐడీ తప్పనిసరి!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు ఓటర్ల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవాలని, పోలింగ్ రోజున చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీని తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు తమ ఓటు వేసే ముందు గుర్తింపు కోసం పోలింగ్ స్టేషన్‌లో తమ ఎలక్టర్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC)ని తప్పనిసరిగా చూపించాలని ఒక ప్రకటనలో తెలిపింది. EPICలో స్పెల్లింగ్ లోపాలు […]
Read more

సుడాన్‌లో కాల్పుల విరమణకు అంగీకరించిన ఆర్‌ఎస్‌ఎఫ్‌!

ఖర్తోమ్‌: సుడాన్‌లో ప్రస్తుతం సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న ఘర్షణల కారణంగా తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొంది. ఈ సంఘర్షణ 2023లో ప్రారంభమై, ఇప్పటికీ కొనసాగుతోంది, దీని ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వస్తోంది. ఆహార కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు సూడాన్ పారామిలిటరీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF), US నేతృత్వంలోని మధ్యవర్తి బృందం ప్రతిపాదించిన మానవతావాద సంధికి అంగీకరించింది. 18 నెలలకు […]
Read more

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌కు మహిళా ఓటర్ల మద్దతు!

పాట్నా: బీహార్‌లో జరిగిన మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం 121 నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. సుమారు 65శాతం మంది తమ ఓటు హుక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 57.29 మాత్రమే నమోదైంది. కాగా, తాజా ఎన్నికల్లో మహిళా ఓటర్లలో ఎక్కువ శాతం సీఎం నితీష్‌కుమార్‌కు బాసటగా నిలిచారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈమేరకు దర్భంగా జిల్లాలోని అలీనగర్‌కు చెందిన రేఖా దేవి మాట్లాడుతూ… తన జీవితాన్ని మెరుగుపరిచినందుకు ముఖ్యమంత్రి […]
Read more

‘జేఎన్‌యు’ విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కూటమి గెలుపు!

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘనవిజయం సాధించింది. నాలుగు కీలక స్థానాలను లెఫ్ట్ కూటమి (ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, డిఎస్‌ఎఫ్‌) కైవసం చేసుకోవడం విశేషం. జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలు ఈ నెల 4న జరిగాయి. ఆ రోజు నాలుగు సెంట్రల్‌ ప్యానెల్‌ పోస్టులతోపాటు, 42 కౌన్సిలర్ల పోస్టులకు పోలింగ్‌ జరిగింది. అర్హత కలిగిన 9,043 మంది విద్యార్థులలో 67 శాతం ఓట్లు వేశారు. మంగళవారం రాత్రి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ […]
Read more

బీహార్‌లో కొనసాగుతున్న పోలింగ్‌…ఓటేసిన లాలూ, నితీష్!

పాట్నా: బీహార్‌లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 243 సీట్లకు గాను మొదటి దశలో భాగంగా 121 స్థానాల్లో ఉదయం పోలింగ్‌ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో అధికార NDA రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టాలని ఆశిస్తుండగా, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి తేజస్వీ యాదవ్‌ సీఎం అభ్యర్థిగా నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడుతోంది. ఈ వార్త రాసే సమయానికి మొత్తం 27.65% ఓటర్ల పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ […]
Read more
1 52 53 54 55 56 160

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.