Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణలో ఎస్‌ఐఆర్‌… గణన ఫారం నింపడంలో గందరగోళం!

హైదరాబాద్: పన్నెండు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ముందు, పిల్లలకు సంబంధించిన విషయాలు, గణన ఫారం నింపడంలో గందరగోళం నెలకొంది. చాలా అంశాలు నింపడం సులభం అయినప్పటికీ, మునుపటి SIR నుండి ఏ వివరాలను పొందుపరచాలోనని ప్రజలు గందరగోళంలో ఉన్నారు. SIRలో సంతానం వివరాలు-గణన ఫారమ్‌లో, ఓటర్లు తమ లేదా మునుపటి SIR నుండి వారి బంధువుల వివరాలను ఇవ్వవచ్చు. -ఏదైనా వివరాలు ఇవ్వడం లింక్ చేయడంలో లేదా మ్యాపింగ్ చేయడంలో […]
Read more

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో శక్తివంతమైన భూకంపం… ఏడుగురు మృతి, 150 మందికి గాయాలు!

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రకృతి పగబట్టింది. తరచూ ప్రకృతివైపరీత్యాలు సంభవించడం మామూలైపోయింది. తాజాగా మజార్-ఇ-షరీఫ్ నగరానికి సమీపంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీనితో కనీసం ఏడుగురు మరణించగా, 150 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. అనేకమంది శిథిలాల్లో చిక్కుకున్నారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. మజార్-ఇ-షరీఫ్ సమీపంలో 28 కి.మీ లోతులో ఈరోజు తెల్లవారుజామున 12:59 గంటలకు భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే […]
Read more

హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లపై పోలీసులు దాడులు…మద్యం, హుక్కా స్వాధీనం!

హైదరాబాద్: నగరశివార్లలోని ఫామ్‌హౌస్‌లపై హైదరాబాద్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు నిన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ముడిమ్యాల్, టోల్కట్టా గ్రామాల్లోని 39 ఫామ్‌హౌస్‌లపై దాడులు నిర్వహించి, మద్యం, హుక్కా వినియోగంతో సహా అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు కనుగొన్నారు. టోల్కట్టా గ్రామంలో పోలీసులు అజీముద్దీన్ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి, అక్రమంగా హుక్కా సేవిస్తున్నట్లు గుర్తించారు. ప్రణవ విల్లా హిల్స్‌లో ఒక విస్కీతో సహా 18 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫామ్‌ హౌస్‌లలో జరుగుతున్న ఒక […]
Read more

“భారతదేశం విశాల దృక్పథం అలవర్చుకోవాలి”… శశి థరూర్!

న్యూఢిల్లీ: వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు హిందీ స్కాలర్‌ను ఢిల్లీ నుండి బహిష్కరించిన వారం అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ అంశంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ మాట్లాడుతూ… భారత అధికారులు విశాల దృక్పథం అలవర్చుకోవాల్సిన అవసరముందని అన్నారు. బిజెపి మాజీ ఎంపి స్వపన్ దాస్‌గుప్తా రాసిన కాలమ్‌కు థరూర్ స్పందిస్తూ, అధికారులు ఇమ్మిగ్రేషన్‌ విషయాలు చూసుకోవాలి కానీ ప్రొఫెసర్ పాండిత్యాన్ని అంచనా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. “భారతదేశం విదేశీ స్కాలర్‌లకు తలుపులు మూసివేసిందనే […]
Read more

గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని194 సార్లు ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌!

జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంలో హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ పదేపదే ఉల్లంఘిస్తోంది. గత నెల అక్టోబర్ 10 నుండి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికి 194 సార్లు ఉల్లంఘించిందని ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. ఈమేరకు ఆఫీస్ డైరెక్టర్ ఇస్మాయిల్ అల్-తవాబ్తే వార్తాసంస్థతో మాట్లాడుతూ… “ఎల్లోలైన్‌”ను పలుమార్లు దాటుతోంది. ఆ గీత వెలుపల ఇజ్రాయెల్ చొరబాట్లు, వైద్య సామాగ్రి, మందులు, గుడారాలు, మొబైల్ గృహాలను నిరోధించడం, […]
Read more

జూబ్లీహిల్స్‌లో జోరుగా సాగుతున్న ఓటర్ల అవగాహన ప్రచారం!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసారు. మరోవంక ఓటరు అవగాహన ప్రచారం జోరుగా సాగుతోంది. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ చొరవతో నైతిక ఓటింగ్, ఓటు ప్రాముఖ్యతను హైలైట్ చేసే అవగాహన డ్రైవ్ ఊపందుకుంది. ‘నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను, నా ఓటు…నా హక్కు-నా శక్తి’ అనే నినాదం జూబ్లీహిల్స్‌ వీధులు, కాలనీల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ ప్రచారానికి అద్భుతమైన చిహ్నం ఈమేరకు […]
Read more

‘ఆర్‌ఎస్‌ఎస్’ను నిషేధించండి…మల్లికార్జున్ ఖర్గే డిమాండ్!

న్యూఢిల్లీ: రాష్ట్రీ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను నిషేధించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్‌ చేశారు. ఈమేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948లో రాసిన చారిత్రాత్మక లేఖను ప్రస్తావించారు. మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన మత వాతావరణాన్ని పెంపొందించడానికి ఆ సంస్థ కారణమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ప్రసంగించిన ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. భారతదేశ ఉక్కు మనిషిని నిజంగా గౌరవిస్తే పటేల్ వైఖరిని గౌరవించాలని సవాలు చేశారు. ఈ సందర్భంగా 1948 ఫిబ్రవరి 4న శ్యామా […]
Read more

అలీఘర్‌లో దేవాలయ గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన హిందూత్వ వ్యక్తుల అరెస్టు!

లక్నో: ముస్లిం సమాజ సభ్యులను ఇరికించడానికి,మతపరమైన అశాంతిని రేకెత్తించడానికి అలీఘర్‌లోని అనేక దేవాలయాల గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన నలుగురు హిందూత్వ కార్యకర్తలను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని జీశాంత్ సింగ్, ఆకాష్ సరస్వత్, దిలీప్ శర్మ, అభిషేక్ సరస్వత్‌గా గుర్తించారు. పోలీసు నివేదికల ప్రకారం, ఈ వారం ప్రారంభంలో అనేక దేవాలయాలపై ఈ రాతలు కనిపించాయి. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు దర్యాప్తు […]
Read more

ఖైదీల వీడియో లీక్…ఇజ్రాయెల్ ప్రాసిక్యూటర్‌ రాజీనామా!

జెరూసలేం: గాజా యుద్ధంలో అరెస్టయిన పాలస్తీనా ఖైదీపై క్రిమినల్ విచారణ సందర్భంగా ఇజ్రాయెల్‌ సైనికులు దుర్భాషలాడిన వీడియో లీక్ కావడంపై పై ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లీగల్ ఆఫీసర్ రాజీనామా చేశారు. కాగా, ఆగస్టు 2024లో ఈ వీడియో లీక్‌ను ఆమోదించినందుకుగాను తాను రాజీనామా చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ మేజర్-జనరల్ యిఫత్ టోమర్-యెరుషల్మి తెలిపారు. దుర్వినియోగంపై దర్యాప్తు తర్వాత ఐదుగురు సైనికులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇది ఒక కలకలం రేపింది. ఈ దర్యాప్తును మితవాద […]
Read more

తెలంగాణ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల!

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈమేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. TSBIE ప్రకారం… ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 17 వరకు నిర్వహించనున్నారు. రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 26 నుండి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పరీక్షలు […]
Read more
1 54 55 56 57 58 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.