Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దేశంలో ఏకపక్ష కూల్చివేతలు…న్యాయాన్ని అణిచివేయడమే!

లక్నో: భారతదేశంలో కూల్చివేతలు వివాదాస్పదమైన పాలనా సాధనంగా మారాయి. గత రెండు సంవత్సరాలుగా, డజన్ల కొద్దీ మదర్సాలు, ఇళ్ళు, మసీదులు చట్టబద్ధమైన ప్రక్రియను కాదని కూల్చివేసారు. భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంటూ అధికారులు ఈ చర్యలను సమర్థిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వారిని లేదా అణగారిన వర్గాలకు చెందిన వారిని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆధారాలు లేదా ముందస్తు నోటీసు లేకుండా నిర్వహించిన […]
Read more

మరాఠా కోటా కోసం ఆమరణ దీక్ష చేపట్టిన మనోజ్ జరంగే-పాటిల్!

ముంబై: మహారాష్ట్రలో నాలుగు దశాబ్దాలుగా మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ సారి ఎలాగైన తమ డిమాండ్‌ సాధించుకునేందుకు మరాఠా కోటా వీరుడు పట్టుబిగించాడు. గత రెండు సంవత్సరాలుగా ఆందోళనకు నాయకత్వం వహించిన మనోజ్ జరంగే-పాటిల్ శుక్రవారం ముంబైలోని చారిత్రాత్మక ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. డిమాండ్ నెరవేరే వరకు తాను తిరిగి రానని ప్రకటించాడు. ఏక్ మరాఠా, లాఖ్ మరాఠా’, ‘చలో ముంబై’, ‘మనోజ్ దాదా….ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై’ […]
Read more

ఇజ్రాయెల్ నౌకలు, విమానాలపై నిషేధం విధించిన టర్కీ!

అంకారా: టర్కీ తన ఓడరేవులు, గగనతలాన్ని… ఇజ్రాయెల్ నౌకలు, విమానాలు రాకుండా మూసివేసింది. ఈ విషయాన్ని టర్కీ అత్యున్నత దౌత్యవేత్త తెలిపారు. ఈ నిషేధం “అధికారిక” విమానాలకు వర్తిస్తుందని దౌత్య వర్గాలు AFPకి తెలిపాయని చెప్పారు. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధంతో టర్కీ,ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి, ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగంలో “జాతిహత్య”కు పాల్పడిందని అంకారా ఆరోపించింది. గత సంవత్సరం మేలో అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. “మేము మా ఓడరేవులను ఇజ్రాయెల్ నౌకలు రాకుండా మూసివేసాము. […]
Read more

ఎన్నికలకు ముందు బీహార్‌లో ఉగ్రవాద హెచ్చరిక: భద్రతా ఆందోళనలా లేక రాజకీయ వ్యూహమా?

న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి ప్రవేశించిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి బీహార్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. బీహార్ నిఘా పోలీసు విభాగం కూడా దీనిని ధృవీకరించింది. పోలీసులు అనుమానిత ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేసి వారి పేర్లను గుర్తించారు. వారిలో ఒకరు రావల్పిండికి చెందిన హస్నైన్ అలీగా, మరొకరు ఉమర్‌కోట్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్‌గా, మూడవ వ్యక్తి బహవల్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్‌గా గుర్తించారు. హిందీ,ఇంగ్లీష్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ వార్తాపత్రికల ఆన్‌లైన్ […]
Read more

ఒకే గూటి కిందకు ప్రభుత్వ పాఠశాలల్లోని నిర్మాణ పనులు!

హైదరాబాద్: విద్యాసంస్థల్లోని టాయిలెట్లు, అదనపు తరగతి గదులు, వంటగది, భోజన గదులు మరియు సరిహద్దు గోడలు వంటి అన్ని నిర్మాణాలను ఇప్పుడు తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC) చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో జరిగిన విద్యా శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ… విద్యాసంస్థల్లో వివిధ నిర్మాణాలను నిర్వహిస్తున్న వివిధ విభాగాలు పనుల సరైన పర్యవేక్షణకు ఆటంకం కలిగిస్తున్నాయని, […]
Read more

సెప్టెంబర్ 1న ముగియనున్న ‘ఓటరు అధికార్ యాత్ర’…పాట్నాలో భారీ ఊరేగింపు!

పాట్నా: బీహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటరు అధికార్ యాత్ర’ సెప్టెంబర్ 1న రాష్ట్ర రాజధానిలో “భారీ ఊరేగింపు”తో ముగుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా వెల్లడించారు. పార్టీ మీడియా, ప్రచార విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఖేరా తూర్పు చంపారన్ జిల్లాలోని ఢాకాలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. “ఈ యాత్ర అన్ని మతాల ప్రజలు పాల్గొనే మతపరమైన యాత్ర లాంటిది. సెప్టెంబర్ 1న, మా నాయకులు పాట్నాలోని గాంధీ మైదాన్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు […]
Read more

దేశ విభజనను గుర్తుచేస్తూ ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసిన NCERT…ఖండించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్!

న్యూఢిల్లీ: భారతదేశ విభజనను గుర్తుచేస్తూ… ఆగస్ట్‌ 14న’విభజన గాయాల స్మారక దినం’ సందర్భంగా NCERT ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. విభజనకు మహ్మద్ అలీ జిన్నాతో పాటు కాంగ్రెస్‌పార్టీని బాధ్యులుగా పేర్కొంది. కాగా, ఈ వాదనను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (IHC) తీవ్రంగా ఖండించింది. ఇది మతపరమైన ఉద్దేశ్యంతో కూడిన అబద్ధాలు” అని పేర్కొంది. ఈ పాఠ్యాంశాలను “వక్రీకరించారని ఆగస్టు 25 నాటి తీర్మానంలో IHC పేర్కొంది, దీనిని “పాఠశాలకు వెళ్లే లేత మనస్సులోకి జొప్పిస్తున్నారని విమర్శించింది. […]
Read more

గాజాలో నాలుగువేలకుపైగా పిండాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌!

న్యూఢిల్లీ: పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ పాశవిక దాడులకు గాజా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వీరిలో మహిళలు, పిల్లలే కాదు ఏకంగా ఇంకా జీవం పోసుకోని పిండాలు కూడా ఉండటమే నేటి విషాదం. ఇక్కడి అల్-బాస్మా IVF కేంద్రంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినప్పుడు 4,000 కంటే ఎక్కువ ఘనీభవించిన పిండాలు, 1,000 స్పెర్మ్ నమూనాలు, ఇంకా ఫలదీకరణం చెందని అండాలనుయనాశనం చేసిందని పాలస్తీనియన్ మానవ హక్కుల కేంద్రం (PCHR) విడుదల చేసిన నివేదిక తెలిపింది. “ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణ […]
Read more

ధర్మస్థల ఫైల్స్‌..కొత్తగా ‘సిట్’కు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి!

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉన్న పుణ్య క్షేత్రం ధర్మస్థల. కాగా ఈ పట్ణంలోని 13 ప్రదేశాలలో వందలాది మంది మహిళలు, బాలికల మృతదేహాలను తాను ఖననం చేశానని గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు పేర్కొన్న తర్వాత ఇది దేశ వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, దశాబ్దం క్రితం తన కూతురి సౌజన్యని అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆ […]
Read more

తెలంగాణలో వరదలు…1,444 మందిని రక్షించిన రెస్క్యూ టీం!

హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. వివిధ జిల్లాలు తీవ్ర వరదల బారిన పడ్డాయి. గురువారం సాయంత్రం 6:30 గంటల నాటికి విపత్తు ప్రతిస్పందన దళాలు మొత్తం 1,444 మందిని రక్షించాయి. కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టారు. గందరగోళం, విధ్వంసం మధ్య, ఆరుగురు వ్యక్తులు కనిపించకుండా పోయినట్లు సమాచారం. జగిత్యాల నుండి ఒకరు, మెదక్ నుండి ఇద్దరు, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, […]
Read more
1 64 65 66 67 68 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.