Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెరిసిన తెలంగాణ… 20 మందికి ర్యాంకులు!

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలంగాణ మెరిసింది. మొత్తం 20 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మక పరీక్షలో ఉత్తీర్ణులై రాష్ట్రానికి గర్వకారణం అయ్యారు. కమిషన్ ప్రకారం, మొత్తం 958 మంది అభ్యర్థులు పరీక్షలో అర్హత సాధించారు. వివిధ కేంద్ర సివిల్ సర్వీసులకు నియామకానికి ఎంపికయ్యారు. అనుజ్ అగ్నిహోత్రి జాతీయ టాపర్‌గా నిలిచి ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించారు. ఆయన తర్వాత రాజేశ్వరి సువే రెండో ర్యాంక్‌, ఆకాన్ష్ ధుల్ మూడవ ర్యాంక్‌ సాధించారు. తెలంగాణ […]
Read more

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా AICC ఇన్‌చార్జ్‌కు లేఖ రాసిన మూసీ జన్ ఆందోళన్ కార్యకర్తలు!

హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయాలని మూసీ జన్ ఆందోళన్ కార్యకర్తలు AICC తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు. ఈమేరకు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ గ్రామంలో ఉన్న 10.34 ఎకరాల భూమిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడాన్ని ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఫలితంగా మధుపార్క్ రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేరొన్నారు. ప్రాజెక్ట్‌ కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ […]
Read more

విపక్షాల విమర్శలతో దిగొచ్చిన మోడీ ప్రభుత్వం…ఖమేనీ హత్యకు సంతాపం తెలిపిన భారత్‌!

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యపై భారత్ ఎట్టకేలకు సంతాపం వ్యక్తం చేసింది. ఈ హత్యపై ప్రభుత్వం మౌనం వహించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకను అమెరికా ముంచేయడాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ మరణించిన ఆరు రోజుల తర్వాత, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, భారత ప్రభుత్వం […]
Read more

‘ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్న పేరెంట్స్‌కు 25వేలు ఇస్తాం’…చంద్రబాబు నాయుడు!

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తగ్గుతున్న జనన రేటును పెంచడానికి రాయితీలు ప్రకటించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు రూ.25వేలు ప్రోత్సాహాకం ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు. ఈమేరకు అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR)ని ప్రస్తుత 1.5 నుండి 2.1కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. “మేము ఒక కొత్త పద్ధతిని పరిశీలిస్తున్నాము. ప్రసవ సమయంలోనే […]
Read more

బెంగాల్ గవర్నర్ రాజీనామా…షాక్‌కు గురయ్యానన్న మమతా బెనర్జీ!

కోల్‌కత: ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదాల కారణంగా వార్తల్లో నిలిచిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన పీటీఐతో మాట్లాడుతూ “గవర్నర్ కార్యాలయంలో తగినంత సమయం గడిపాను” అని అన్నారు. కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే కొత్త గవర్నర్‌ నియామకానికి ముందు తనను సంప్రదించలేదని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్రం చర్య “ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాష్ట్రాల […]
Read more

ఇరాన్ యుద్ధాన్ని గెలవగలదు – అయితే కొంత సమయం పడుతుంది!

రంజన్‌ సోలమన్‌___🖋️ ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ట్రంప్, నెతన్యాహు తక్షణ విజయం సాధించాలని కలలు కని ఉండాలి. అయితే వాస్తంలో యుద్ధం ఏమో ఉధృతంగా సాగుతోంది, ఇజ్రాయెల్ ప్రాణాంతక దాడికి గురవుతోంది, ఆ దేశ పౌరులు ఆపమని విజ్ఞప్తి చేస్తున్నారు. యుఎస్ స్థావరాలకు ఆతిథ్యం ఇచ్చిన గల్ఫ్ దేశాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నాయి. ఆ స్థావరాల నుండి ఫైటర్ జెట్‌లు భయంతో మరోచోటికి తనలిపోయాయి. ఇజ్రాయెల్, యుఎస్‌లకు ఇది చేదు వార్తే. వారి వద్ద ఉన్న […]
Read more

ఇస్లామోఫోబియా… ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఒక మానవ హక్కుల సంక్షోభం!

ప్రపంచ రాజకీయాలు, మీడియా, విద్యా వ్యవస్థలలో పెరుగుతున్న ఒక తీవ్రమైన సమస్య గురించి నేటి ప్రపంచం నిజాయితీగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ సమస్యే ఇస్లామోఫోబియా. ఇది కేవలం ముస్లింల పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషం లేదా అపోహ మాత్రమే కాదు; ఇది అనేక దేశాలలో రాజకీయాలు, విధానాలు, మీడియా కథనాలు, విద్యా వ్యవస్థలలో కూడా గాఢంగా నాటుకుపోయిన ఒక నిర్మాణాత్మక వివక్ష. ఇస్లాం, ముస్లింల పట్ల ఉన్న అర్థరహిత భయం, ద్వేషం లేదా పక్షపాత భావనల […]
Read more

జన్‌ జెడ్ నిరసనల తర్వాత నేపాల్‌లో నేడు ఎన్నికలు!

ఖాట్మండు: గత సంవత్సరం కె పి శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసిన జనరల్ జెడ్ నేతృత్వంలోని హింసాత్మక నిరసన తర్వాత తొలిసారిగా నేపాల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి నేపాల్ ప్రజలు ఈరోజు ఉదయం పోలింగ్ బూత్‌లకు చేరుకోవడం ప్రారంభించారు. ప్రత్యక్ష ఓటింగ్ జరిగే 165 స్థానాలకు మొత్తం 3,406 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా, మరో 110 స్థానాలకు దామాషా ఓటింగ్ ద్వారా 3,135 మంది అభ్యర్థులు ఢీ అంటే […]
Read more

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడి… ప్రధాని మోదీ మౌనాన్ని విమర్శించిన విపక్షాలు!

న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిరిపిన దాడిపై నరేంద్ర మోదీ మౌనం వహించడం, ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్యపై ప్రధానమంత్రి సంతాపం ప్రకటించకపోవడంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరాన్ నాయకుడి హత్యపై ప్రభుత్వం మౌనంగా ఉండటం తటస్థం కాదని; అది ఒక పరాజయం అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక వ్యాసంలో సోనియా గాంధీ అన్నారు. ఓవైపు చర్చలు కొనసాగుతున్న తరుణంలో… ఒక దేశాధినేతను […]
Read more

తెలంగాణ కొత్త విద్యా విధానంపై చర్చిద్దాం…సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని ఖరారు చేసే ముందు దానిని ప్రజాక్షేత్రంలో ఉంచాలని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ డిమాండ్ చేసింది. విధాన నిర్ణయాలను ఖరారు చేసే ముందు కమిషన్లు, కమిటీలు… ప్రజా చర్చ కోసం ముసాయిదా నివేదికలను విడుదల చేయడం చాలా కాలంగా ఉన్న ప్రజాస్వామ్య సంప్రదాయమని కమిటీ పేర్కొంది. సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్‌ను నియమించింది. ఇటీవల, కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి […]
Read more
1 6 7 8 9 10 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.