Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గిరిజన విద్యార్థులు అస్తిత్వం కోసం పోరాడాల్సి వస్తోంది…రాహుల్ గాంధీ!

నాసిక్‌: మహారాష్ట్రలోని గిరిజన విద్యార్థుల పోరాటం కేవలం విద్య, ఉపాధి, వసతి, ఆహారానికి సంబంధించిన డిమాండ్లకే పరిమితం కాలేదని, వారి అస్తిత్వం, ఆదివాసీ గుర్తింపు పరిరక్షణ వరకు విస్తరించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తన నాసిక్ పర్యటన సందర్భంగా గిరిజన విద్యార్థులతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను Xలో పంచుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. “‘మేము ఆదివాసీలం; ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మమ్మల్ని వనవాసులుగా మార్చాలని చూస్తున్నాయి.’ నాసిక్, మహారాష్ట్ర గిరిజన విద్యార్థుల పోరాటం కేవలం […]
Read more

ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల గండం…ఇరాన్‌తో ఇంకా ముగియని యుద్ధం!

వాషింగ్టన్‌: యూఎస్‌లో మధ్యంతర ఎన్నికల వేళ అమెరికా ఓటర్లలో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ తీవ్రతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించి చూపుతున్నారు. కాగా, అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. అధ్యక్షుడి పదవీకాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే ఈ ఎన్నికలు విజయం సాధించేందుకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఆలోచిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు సీనియర్ సహాయకులతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఆరు […]
Read more

భారత కంపెనీతో ఆయుధ ఒప్పందంలో స్కామ్‌…ఎస్తోనియా మంత్రి రాజీనామా!

తల్లిన్‌: ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించేందుకు ఉద్దేశించిన 70 మిలియన్ యూరోల (రూ. 768.50 కోట్లకు పైగా) ఆయుధ ఒప్పందంలో కుంభకోణం బయటపడటంతో ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్ రాజీనామా చేశారు. 2022 నుండి రక్షణ మంత్రిగా పనిచేస్తున్న పెవ్కుర్, ఆ దేశ జాతీయ ఆడిట్ కార్యాలయం వెల్లడించిన పలు కీలకమైన విషయాల నేపథ్యంలో, ఈ రక్షణ ఒప్పందానికి తానే బాధ్యత వహిస్తు తన రాజీనామాను ప్రకటించారు. “ఎస్తోనియా భద్రత అనేది ఒక్క వ్యక్తి చేసే […]
Read more

నాగా-కుకీల హింస… మణిపూర్ జాతి సంఘర్షణలో మరో వివాదం!

ఇంఫాల్‌: మణిపూర్‌లో నాగా, కుకీ వర్గాల మధ్య హింస, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని తాజా నివేదికలు వెలువడ్డాయి. 2023లో చెలరేగిన మైటీ-కుకీల అల్లర్లకు మించి ఈ సంఘర్షణ విస్తరించే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది. ఈసారి, కాంగ్‌పోక్పి జిల్లాలోని ఇంఫాల్-తమెంగ్‌లాంగ్ (ఐటీ) ప్రాంతం ఈ హింసకు కేంద్రబిందువుగా మారింది. ఆగస్టు 27న మకుయ్ అషాంగ్, తానన్బా నాగా గ్రామాల మధ్య జరిగిన దాడిలో నలుగురు నాగా పౌరులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడికి సాయుధ కుకీ బృందాలే […]
Read more

పాలస్తీనియన్లను తుడిచిపెట్టే పన్నాగం!

టెల్‌అవీవ్‌: పాలస్తీనాపై ద‌శాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగ‌తాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మితవాద దేశాధినేతలు బహుళజాతి కార్పొరేషన్‌ల దన్నుతో ‘గ్రేటర్‌ ఇజ్రాయెల్‌’ లక్ష్యాన్ని సాకారం చేసుకోమని ప్రోత్సహిస్తున్నాయి. ఈనేపధ్యంలో పాలస్తీనా భూభాగాన్ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఇజ్రాయెల్‌ భద్రతా మంత్రి బెన్‌గ్విర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఏడేళ్లలో గాజా జనాభాలో దాదాపు 85% మందిని ఇతర దేశాలకు పంపించివేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు గాజాలోని 18.6 లక్షల మంది పాలస్తీనియన్లను […]
Read more

ఢిల్లీ పోలీసుల బండారం బయటపెట్టిన బీజేపీ కార్యకర్త…ఇబ్బందిపడ్డ అమిత్ షా!

న్యూఢిల్లీ: జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు బలప్రయోగం చేయడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంకా సమర్థించను లేదు అటు ఖండించనూ లేదు. ఇంతలో ఢిల్లీలోని బీజేపీ కార్యకర్తగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, మఫ్టీలో ఉన్న ‘పోలీసులు’ నిరసనకారులను కొట్టడం వెనుక ఉన్న రహస్యాన్ని నిన్న బయటపెట్టడంతో హోం మంత్రి మరోసారి ఇబ్బందిపడ్డారు. కనీసం ఈసారైనా హోం మంత్రి మాట్లాడతారా లేదా చర్య తీసుకుంటారా, లేదా హిందుత్వ కార్యకర్త […]
Read more

నన్ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు…కొండా సురేఖ!

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను తొలగించిన కొద్దిసేపటికే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల ప్రాతిపదికన తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ కొండా సురేఖ కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాశారు. రేవంత్ తన నిర్ణయాలను అడ్డుకున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా ఆదేశాలు జారీ చేస్తూ, మంత్రిగా తన అధికారాలను పరిమితం చేశారని ఆరోపించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి రాసిన తన లేఖలో, తనను పక్కన పెట్టారని భావించిన పలు […]
Read more

న్యూయార్క్ స్కూళ్లలో AI వాడకంపై నిషేధం!

న్యూయార్క్‌: తరగతి గదిలో కొత్త సాంకేతికతకు సంబంధించి మార్గదర్శకాలను నిర్దేశించేందుకు ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో AI వాడకాన్ని ఒక సంవత్సరం పాటు నిలిపివేస్తున్నట్లు న్యూయార్క్ నగర అధికారులు ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద పాఠశాల తీసుకున్న ఈ చర్య, అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలలో అత్యంత కఠినమైనది. అయితే, లాస్ ఏంజిల్స్‌తో సహా ఇతర జిల్లాలు తాము ఏఐ విధానాలను సమీక్షిస్తున్నామని తెలిపాయి. ఈమేరకు న్యూయార్క్ నగర తరగతి […]
Read more

రామ మందిర్ సీఈఓ నియామకంపై రాజకీయ దుమారం!

న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేగింది. వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు చెందని వ్యక్తిని ఎంపిక చేశారని, ఈ రెండు సంస్థలపై ప్రభుత్వానికి విశ్వాసం లేదని పేర్కొంటూ కాంగ్రెస్ ఈ నియామకాన్ని ప్రశ్నించింది. మరోవైపు, విరాళాల దొంగతనం కేసులో న్యాయం జరగాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది, ఆర్థిక అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ […]
Read more

హైదరాబాద్‌లో ఎస్‌ఐఆర్‌… తొలగించిన వందమంది ఓటర్లలో 40 మంది ముస్లింలే!

హైదరాబాద్: ఎన్నికల సంఘం (EC) ప్రచురించిన జాబితాల ఆధారంగా హైదరాబాద్ ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించిన 19.41 లక్షల మంది ఓటర్లలో సుమారు 7.77 లక్షల మంది ముస్లింలే అధికంగా ఉన్నారు. అంటే, తొలగించిన ప్రతి 100 పేర్లలో దాదాపు 40 పేర్లు ముస్లింలవేనని సియాసత్‌, కోల్‌కతాకు చెందిన ‘సబర్ ఇన్‌స్టిట్యూట్’ విశ్లేషణల్లో వెల్లడయింది. ఆగస్టు 17న ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ముసాయిదా జాబితాతో పాటు జారీ చేసిన […]
Read more
1 8 9 10 11 12 235

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.