Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సుంకాల వివాదం మధ్య భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రుల భేటి!

న్యూయార్క్: న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సందర్భంగా నిన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో… విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, ఖనిజాలు వంటి కీలక రంగాలలో భారతదేశం, అమెరికా మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం గురించి ఇరువురు నాయకులు చర్చించారు. ఈ భేటీ అనంతరమే మార్కో రూబియో మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలు అమెరికాకు అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమెరికా విదేశాంగ […]
Read more

‘గ్రేటర్ ఇజ్రాయెల్’దిశగా అడుగులు వేస్తున్న నెతన్యాహు!

సిడ్నీ: చాలా కాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడంపై ప్రపంచంలోని చాలా దేశాలు దృష్టి సారిస్తే… ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన “గ్రేటర్ ఇజ్రాయెల్” కలను సాకారం చేసుకోవడానికి అంకితభావంతో ఉన్నట్లు కనిపిస్తోంది. గాజాలో నెతన్యాహు సాగిస్తున్న యుద్ధంపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినప్పటికీ, మిగతా దేశాలు ఇజ్రాయెల్‌ను ఒంటరిగా చేస్తున్నప్పటికీ, ఈ లక్ష్యాన్ని సాధించడంలో నెతన్యాహు సగం దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఈ భావనను పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి తీవ్రంగా కృషి […]
Read more

ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లు…ఉత్తరప్రదేశ్‌ ఓటర్‌లిస్ట్‌లో భారీ కుంభకోణం!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితాలో భారీ ఓట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మహోబా జిల్లా జైత్‌పూర్ గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒకే ఇంటి చిరునామా కింద ఏకంగా 4,271 మంది ఓటర్లు నమోదవ్వడం పెద్ద సంచలనంగా మారింది. ఈ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,069 కాగా, దాదాపు నాలుగో వంతు ఓటర్లు ఒకే ఇంటికి ట్యాగ్ కావడం స్థానికులను, ప్రజాప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. […]
Read more

సింగరేణి కార్మికులకు రూ.819 కోట్ల దసరా బోనస్‌!

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏకంగా రూ.819 కోట్ల వార్షిక దసరా బోనస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 41,000 మంది SCCL ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.1,95,610 బోనస్, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ లభిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. “ఈ ఆర్థిక సంవత్సరంలో SCCL మొత్తం రూ.6,394 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. భవిష్యత్ విస్తరణ, ఇతర వ్యయాల కోసం రూ.4,034 కోట్లు కేటాయించిన తర్వాత, కంపెనీ రూ.2,360 కోట్ల […]
Read more

దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టేందుకు సిద్ధమైన ఎన్నికల కమిషన్‌!

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 30 నాటికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం సిద్ధం కావాలని భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. అక్టోబర్‌లో నవంబర్ మొదటి వారం వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల (CEOలు) సమావేశంలో, ఎన్నికల కమిషన్‌లోని ఉన్నతాధికారులు సెప్టెంబర్ 30 లోపు SIR కోసం సిద్ధం కావాలని ఆదేశించారని అధికారులు ధృవీకరించారు. 2008లో ఢిల్లీలో, 2006లో ఉత్తరాఖండ్‌లో, […]
Read more

బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించిన తాలిబన్!

కాబూల్‌: ఆప్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను తాలిబన్‌లు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ ఒప్పందం “సాధ్యం కాదు” అని ఆఫ్ఘన్ ప్రభుత్వ రక్షణ అధికారి ఒకరు అన్నారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న బాగ్రామ్ ఆఫ్ఘనిస్థాన్‌లో అతిపెద్ద వైమానిక స్థావరం. రెండు దశాబ్దాలు తాలిబన్లతో యుద్ధంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. నాలుగేళ్ల కిందట అమెరికా సేనలు అఫ్గన్ నుంచి వైదొలగాయి. మళ్లీ […]
Read more

అస్సాంలో జాతి ప్రక్షాళన…సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిజనిర్ధారణలో వెల్లడి!

న్యూఢిల్లీ: అస్సాంలో బెంగాలీ మాతృభాషగా ఉన్న ముస్లింలను సామూహికంగా బహిష్కరించడం, చెల్లుబాటు అయ్యే భూమి, గుర్తింపు సంబంధిత పత్రాలు ఉన్నప్పటికీ గ్రామాల్లోని వారి పూర్వీకుల ఇళ్ల నుండి వారిని తరిమికొట్టడం, రాష్ట్రంలో జాతి ప్రక్షాళన చేపట్టాలనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని వెల్లడించింది. ఇప్పటికే 60,000 మందిని నిరాశ్రయులను చేసిన ఈ డ్రైవ్, అత్యవసరంగా నిలిపివేయకపోతే ఈ ప్రాంతంలో అతిపెద్ద మానవతా సంక్షోభం వస్తుందని వెల్లడించింది. అస్సాంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు వెల్లడైన దిగ్భ్రాంతికరమైన […]
Read more

పాలస్తీనా రాజ్యాన్ని అధికారికంగా గుర్తించిన పోర్చుగల్, బ్రిటన్‌, కెనడా!

లండన్‌: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (UK), కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ అధికారికంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఈ మూడు కామన్వెల్త్ దేశాలు సంయుక్తంగా తీసుకున్న సమన్వయ చర్య ఇది, అయితే యునైటెడ్ స్టేట్స్ (US), ఇజ్రాయెల్ దీనిని వ్యతిరేకించాయి. ఈమేరకు బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ చర్య “పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీయులకు శాంతి ఆశను పునరుద్ధరించడానికి” ఉద్దేశించిందని, ఇది హమాస్‌కు బహుమతి కాదని నొక్కి చెప్పారు, పాలస్తీనా […]
Read more

తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు!

హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది రోజుల పూల పండుగ ‘బతుకమ్మ’ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. వరంగల్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… తొమ్మిది రోజుల పాటు (సెప్టెంబర్ 30 వరకు) ప్రకృతిలో లభించే పువ్వులను ఉపయోగించి మహిళలు గౌరమ్మ దేవిని భక్తి, విశ్వాసంతో పూజిస్తారని అన్నారు. వారి ప్రార్థనలు ఫలించాలని, రాష్ట్రం, ప్రజలకు శ్రేయస్సును ప్రసాదించాలని ఆయన అన్నారు. తెలంగాణ సంగీత అకాడమీ వెయ్యి స్తంభాల గుడిలో నిర్వహించిన కార్యక్రమంలో […]
Read more

రోడ్డుపై నల్లమల చెంచు మహిళ మృతదేహం…వ్యవస్థాగత వైఫల్యమే!

హైదరాబాద్: ఎయిడ్స్‌తో మరణించిన చెంచు మహిళ మృతదేహాన్ని, ఆమె సహాయకులతో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) లోపల ఉన్న కుగ్రామానికి తీసుకెళ్లకుండా 108 అంబులెన్స్ సర్వీస్… రోడ్డుపై వదిలివేయడం విచారకరం. ఈ సమస్య ఒక సాధారణ సంఘటనగా అనిపించినప్పటికీ, ఇది ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA) మన్ననూర్ అధికారుల వ్యవస్థాగత వైఫల్యాన్ని బయటపెట్టింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగల్ మండలం అప్పపూర్ గ్రామ పంచాయతీలోని ఈర్లపెంట నివాసి అయిన ఎం గురువమ్మ (29) జ్వరంతో […]
Read more
1 7 8 9 10 11 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.