Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారతదేశంపై 50% సుంకాలు విధించడం మామూలు విషయం కాదు…ట్రంప్‌!

వాషింగ్టన్‌: రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై 50% సుంకం విధించడం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. రష్యా చమురుకు భారత్‌ అతిపెద్ద వినియోగదారుగా మారిందని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు పాశ్చాత్య ఆంక్షల కింద, రష్యా నుండి చమురు కొనుగోళ్లపై ట్రంప్ తన ఎగుమతులలో కొన్నింటిపై 50 శాతం వరకు సుంకాలు విధించిన తర్వాత భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. […]
Read more

పాలస్తీనాకు మద్దతు పలికిన భారత్‌!

ఐక్యరాజ్యసమితి: పాలస్తీనాకు భారత్‌ మద్దతు పలికింది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారం, ‘రెండు దేశాల పరిష్కార మార్గం’ అమలుపై న్యూయార్క్‌ డిక్లరేషన్‌ను ఆమోదించే తీర్మానానికి భారత్‌ అనుకూలంగా ఓటు వేసింది. ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని 142 దేశాలు అనుకూలంగా, 10 దేశాలు వ్యతిరేకంగా, 12 దేశాలు గైర్హాజరు కావడంతో ఆమోదించారు. వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో అర్జెంటీనా, హంగేరీ, ఇజ్రాయెల్, US ఉన్నాయి. జూలైలో UN ప్రధాన కార్యాలయంలో జరిగిన ఫ్రాన్స్, సౌదీ అరేబియా సహ-అధ్యక్షత […]
Read more

“ఈ స్థలం మాది”, ఇకపై ‘పాలస్తీనా దేశం ఉండదు’…ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు!

టెల్‌అవీవ్‌: ఇక ముందు పాలస్తీనా దేశం ఉండదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో వేలాది కొత్త గృహాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జెరూసలేంకు తూర్పున ఉన్న ఈ ప్రాంతంలో వివాదాస్పద ‘E1’ సెటిల్‌మెంట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై కూడా నెతన్యాహు సంతకం చేశారు. “పాలస్తీనా రాజ్యం ఉండదన్న మా వాగ్దానాన్ని మేము నెరవేర్చబోతున్నాము, ఈ స్థలం మాది” అని నెతన్యాహు జెరూసలేంకు తూర్పున ఉన్న ఇజ్రాయెల్ స్థావరం మాలే […]
Read more

నేపాల్‌ మాజీ చీఫ్ జస్టిస్‌ను తాత్కాలిక ప్రధానిగా ప్రతిపాదించిన జన్‌జడ్‌ నేతలు!

న్యూఢిల్లీ: రాజకీయ తిరుగుబాటుగా మారిన నేపాల్ ‘జన్‌ జెడ్’నేతృత్వంలోని ప్రతినిధులు ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను కలిసి, మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రతిపాదించారని మీడియా నివేదికలు తెలిపాయి. నేపాల్‌లో సోమవారం ప్రారంభమై మంగళవారం తీవ్రరూపం దాల్చిన విద్యార్థుల నిరసనకు దెబ్బకు ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి రాజీనామాకు దారితీసింది. శాంతిభద్రతలను కాపాడటానికి సైన్యం వీధుల్లో కవాతు నిర్వహించాల్సి వచ్చింది. అల్లర్ల కారణంగా 30 మంది మరణించారు. మొత్తం 1,033 మంది […]
Read more

నేపాల్ మాజీ ప్రధాని భార్య సజీవ దహనం… ఇంటిని తగలబెట్టిన నిరసనకారులు!

ఖాట్మాండు: నేపాల్‌లో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు తీవ్రరూపం దాల్చాయి. రెండోరోజైన మంగళవారం కూడా నిరసనలు, ఆందోళనల ఉధృతి కొనసాగింది. నేపాల్‌ మాజీ ప్రధాని జాలానాథ్‌ ఖనాల్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్‌ సజీవదహనం అయ్యారు. జన్ జెడ్ ప్రదర్శనలు తీవ్రంగా పెరగడంతో నేపాల్ ప్రధాన మంత్రి కెపి ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది, అదే సమయంలో పార్లమెంట్ భవనం, ఖాట్మండులోని అధ్యక్ష కార్యాలయంతో సహా అనేక ప్రభుత్వ భవనాలను తగలబెట్టారు. మరోవంక నేపాల్ […]
Read more

ఖతార్‌లో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి!

దుబాయ్: మధ్యప్రాచ్యంలో సంపన్న గల్ఫ్ దేశం ఖతార్‌లో ఉన్న హమాస్‌ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడికి పాల్పడింది. సమ్మిట్‌ ఆఫ్‌ ఫైర్‌ పేరిట జరిపిన ఈ దాడితో దోహా నగరంలోని ఖతారా జిల్లా పరిధిలో పలు చోట్ల పేలుళ్లు సంభవించాయని, ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తాము కచ్చితమైన దాడులు చేశామని, 2023 అక్టోబరు 7 నాటి మారణహోమానికి ప్రత్యక్షంగా కారణమైనవారిని లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) తెలిపింది. కాగా, ఈ […]
Read more

గాజాకు వెళ్తున్న ఫ్లోటిల్లా ప్రధాన నౌకను ట్యునీషియా జలాల్లో ఢీకొట్టిన డ్రోన్!

గాజాకు వెళ్తున్న తమ ప్రధాన నౌకలలో ఒకదానిని ట్యునీషియా జలాల్లో డ్రోన్ ఢీకొట్టిందని… గాజాకు సహాయం అందించే అంతర్జాతీయ మానవతా మిషన్ గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా (GSF) ధృవీకరించింది. పోర్చుగీస్ జెండా కింద ప్రయాణిస్తున్న ఫ్యామిలీ బోట్ లక్ష్యంగా చేసుకున్న డ్రోన్‌ దాడిలో… నౌక, దాని ప్రధాన డెక్, దిగువ నిల్వ ప్రాంతాలకు మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి తర్వాత దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. “మా కీలక […]
Read more

ఆగమాగమైన నేపాల్‌…19 మంది మృతి, హోం మంత్రి రాజీనామా!

ఖాట్మండు: నేపాల్‌లో పలు సోషల్ మీడియా యాప్‌లపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి యువత చేపట్టిన భారీ నిరసన రాజధాని ఖాట్మండులో తీవ్రమైన హింసకు దారి తీసింది. ఘర్షణల్లో 12 ఏళ్ల బాలుడితో సహా కనీసం 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిస్థితికి బాధ్యత వహిస్తూ ఆ దేశ హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేసారు. విద్యార్థుల నిరసనల దెబ్బకు దిగివచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేయవలసి వచ్చింది. కోపంతో […]
Read more

క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు శుభవార్త చెప్పిన రష్యా!

మాస్కో: ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ బాధితులకు రష్యా గుడ్‌న్యూస్‌ వినిపించింది. సరైన చికిత్స లేక జీవితాంతం క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. ‘ఎంటెరోమిక్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌లో వంద శాతం ప్రభావం చూపింది. ఈ సంచలన వార్త లక్షలాది క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఓ ఆశాకిరణంగా మారింది. పలు కేసుల్లో క్యాన్సర్ గడ్డల పరిమాణాన్ని ఈ వ్యాక్సిన్ ఏకంగా 60 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గిస్తున్నట్లు వెల్లడైంది. ఎలాంటి దుష్ప్రభావాలు […]
Read more

పాలస్తీనియన్ ఖైదీలకు తగినంత ఆహారం ఇవ్వడం లేదని పేర్కొన్న ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు!

టెల్ అవీవ్: పాలస్తీనియన్ ఖైదీలకు ప్రాథమిక జీవనాధారానికి అవసరమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు ఆదివారం తీర్పునిచ్చింది. వారి పోషకాహారాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించింది. దాదాపు రెండు సంవత్సరాల యుద్ధంలో ప్రభుత్వ ప్రవర్తనకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన అరుదైన కేసు ఇది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ఇజ్రాయెల్ గాజాలో హమాస్‌తో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న వేలాది మందిని స్వాధీనం చేసుకుంది. నెలల తరబడి నిర్బంధంలో ఉంచిన తర్వాత ఎటువంటి ఆరోపణలు లేకుండా […]
Read more
1 21 22 23 24 25 42

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.