Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

దోషిగా తేలిన హసీనాను అప్పగించండి…భారత్‌ను కోరిన బంగ్లాదేశ్!

ఢాకా: మరణశిక్ష పడ్డ తమ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను ఇక అప్పగించాలని మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను కోరింది. అంతేకాదు ఆమెతో పాటు ఉన్న మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ను కూడా అప్పగించమంది. “ఈ ఇద్దరు దోషులను వెంటనే బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్, భారతదేశం మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం […]
Read more

గాజా శాంతి ప్రణాళికపై అమెరికా ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించిన భద్రతా మండలి!

న్యూయార్క్‌: గాజా పాలన, పునర్నిర్మాణం, భద్రతను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ స్థిరీకరణ దళమైన “బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌”ని ఏర్పాటు చేసే తీర్మానాన్ని UN భద్రతా మండలి ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 13 ఓట్లు వచ్చాయి, చైనా, రష్యా గైర్హాజరయ్యాయి. ఓటింగ్‌కు ముందు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడుతూ… “నేడు, మంటలను ఆర్పి శాంతి మార్గాన్ని వెలిగించే శక్తి మనకు ఉంది” అని అన్నారు. “ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మాన ముసాయిదా… అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ […]
Read more

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం…42 మంది భారతీయుల దుర్మరణం!

రియాద్‌: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 42 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. భారతీయ యాత్రికులతో ఉమ్రా పర్యటనలో ఉన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ వాసులు కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన భారత కాలమాన ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 1:30 సమయంలో జరిగింది. ఉమ్రా యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ముఫరహత్​ ప్రాంతంలో […]
Read more

గాజా తీర్మానాన్ని’త్వరగా ఆమోదించండి’… ‘యూఎన్‌’ను కోరిన అమెరికా, అరబ్‌దేశాలు!

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికను త్వరగా ఆమోదించాలని అమెరికా సహా టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియాతో పాటు అనేక అరబ్ దేశాలు యూఎన్‌ భద్రతా మండలిని అభ్యర్థించాయి. ఈమేరకు “యునైటెడ్ స్టేట్స్, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా , ఇండోనేషియా, పాకిస్తాన్, జోర్డాన్, తుర్కియా ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతా మండలి తీర్మానానికి ఉమ్మడి మద్దతు ఇస్తున్నామని” నిన్న ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. గత వారం […]
Read more

సుడాన్‌లోని ‘అల్ ఫషర్‌’లో సామూహిక దురాగతాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన!

ఖార్తూమ్‌: ఒకప్పుడు ఆఫ్రికాలోని విభిన్న తెగలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలసి జీవించిన నేల సూడాన్. కానీ, నేడు ఆ దేశపు పేరు వింటే నెత్తుటి వాసన రావడం విషాదం. తాజాగా సుడాన్‌లోని అల్ ఫషర్‌లో సామూహిక దురాగతాలు, తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేశారు. కోర్డోఫాన్ ప్రాంతంలో కూడా హింస తీవ్రమవుతోందని అన్నారు. సుడానీస్ సాయుధ దళాలు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) పారామిలిటరీల మధ్య పోరాటం […]
Read more

శాశ్వత కాల్పుల విరమణ దిశగా హమాస్ “నిర్మాణాత్మక చర్యలు”… టర్కీ విదేశాంగ మంత్రి!

ఇస్తాంబుల్‌: గాజాలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా హమాస్ “నిర్మాణాత్మక చర్యలు” తీసుకుంటోందని టర్కీ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఇలాంటి సంకల్పాన్ని చూపించాలని ఆయన అభిలషించారు. ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేలట్టితో అంకారాలో జరిగిన సంయుక్త వార్తా సమావేశంలో ఫిడాన్ మాట్లాడుతూ… గాజా పాలస్తీనాలో విడదీయరాని భాగమని, స్పష్టమైన UN-మద్దతు గల చట్రంలో పాలస్తీనియన్లచే పాలన కొనసాగించాలని నొక్కి చెప్పారు. “గాజా పాలస్తీనాలో భాగం, అది అలాగే ఉండాలి.అలాగే పరిగణించాలి” […]
Read more

కాల్పుల విరమణ అమలవుతున్నా…ఇంకా చీకటిలోనే మగ్గుతున్న గాజా వాసులు!

గాజా: గత నెల ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ తర్వాత కూడా గాజాలో విద్యుత్ లేకపోవడంతో పాలస్తీనియన్లు ఇంకా చీకటిలోనే మగ్గాల్సి వస్తోంది. ఓ పాలస్తీనా తల్లి హనాన్ అల్-జౌజౌ, 31, చీకటిలో తన ముగ్గురు పిల్లలకు ఫ్లాష్‌లైట్‌తో ఆహారం పెట్టాల్సి వచ్చింది. వారు ఫ్లాష్‌లైట్ ఛార్జ్ చేయలేకపోతే, వారు ఆకలితో అలమటించాల్సిందే. “మేము చీకటిలోనే ఉంటాము”సూర్యుడు అస్తమించాక, అంటే మగ్రిబ్ తర్వాత మాకు అంతా చీకటే. “టార్చ్ వెలుగు అందుబాటులో ఉంటే, మేము దానిని వెలిగిస్తాము. లేకపోతే, […]
Read more

కాల్పుల విరమణ తర్వాత రోజుకు 8మంది పాలస్తీనియన్లు మరణించారు…హక్కుల సంఘం!

గాజా: ఇజ్రాయెల్ పాలస్తీనా పౌరులపై మారణహోమం కొనసాగిస్తోంది. గత నెలలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుండి రోజుకు సగటున ఎనిమిది మంది పాలస్తీనియన్లు చంపుతున్నారని జెనీవాకు చెందిన హక్కుల పరిశీలకుల బృందం తెలిపింది. అక్టోబర్ 10న ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కుదిరి నెల రోజులు గడిచినప్పటికీ, ఇజ్రాయెల్ పాలస్తీనా పౌరులను “ముందస్తుగా హత్య చేయడం” కొనసాగించిందని యూరో-మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. “గాజాపై కొనసాగుతున్న సమగ్ర దిగ్బంధనం, ఉద్దేశపూర్వక […]
Read more

అమెరికా షట్‌డౌన్‌ ముగింపుకు ఒప్పందం కుదుర్చుకున్న సెనేటర్లు!

వాషింగ్టన్‌: అమెరికాలో 40 రోజులుగా కొనసాగుతున్న షట్‌డౌన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈమేరకు అమెరికా సెనేటర్లు నిన్న ఒక ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈమేరకు డెమోక్రటిక్ సెనేటర్లు జీన్ షాహీన్, మ్యాగీ హసన్.. రిపబ్లికన్ లీడర్ జాన్ థూన్, వైట్‌హౌస్ ప్రతినిధులతో కలిసి వారాంతంలో జరిపిన చర్చలు ఫలించాయి. ఈ బిల్లు ప్రకారం చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జనవరి వరకు నిధులు అందుతాయి. షట్‌డౌన్ కారణంగా ప్రభావితమైన ఫెడరల్ ఉద్యోగులందరికీ బకాయిపడ్డ జీతాలను చెల్లించేందుకు హామీ ఇచ్చారు. […]
Read more

గాజా మారణహోమం…ఇజ్రాయెల్‌కు ‘బ్లాంక్‌ చెక్’ ఇచ్చిన జో బిడెన్‌!

వాషింగ్టన్‌: గాజా విషయంలో మాజీ అధ్యక్షుడు జో బిడెన్ విధానాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా తీవ్రంగా విమర్శించారు. ఇజ్రాయెల్ – పాలస్తీనా పట్ల అమెరికా విధానంలో పెద్ద మార్పు రావాలని పిలుపునిచ్చారు. వాషింగ్టన్ D.C.లో జరిగిన ఒక కార్యక్రమంలో US కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా మాట్లాడుతూ… “మనం సత్యంతో ప్రారంభించాలి. అధ్యక్షుడు బిడెన్ గాజాకు సంబంధించి సరిగ్గా వ్యవహరించలేదు. ఆయన తప్పు చేశారు. మనం ఎప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వకూడదని అన్నారు.” కాగా, […]
Read more
1 23 24 25 26 27 51

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.