Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు!

వాషింగ్టన్‌: అమెరికాలో అక్రమంగా ఉంటున్న30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్‌లను అరెస్ట్‌ చేశారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్‌లో జరిగిన తనిఖీల్లో ఈ అరెస్టులు జ‌రిగాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) వెల్లడించింది. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌తో దొంగతనంగా సెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమిగ్రేషన్ […]
Read more

ఇజ్రాయెల్-గ్రీస్-సైప్రస్ శిఖరాగ్ర సమావేశం…టర్కీని హెచ్చరించిన నెతన్యాహు!

హ్యూస్టన్(USA): తూర్పు మధ్యధరా ప్రాంతంలో టర్కీ ప్రాంతీయ పాత్ర,సైనిక ఉనికి నేపథ్యంలో, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ నాయకులు తాజాగా జెరూసలేంలో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ…”ఓట్టోమన్‌ సామ్రాజ్యాలను పునరుద్ధరించాలని కలలు కనే వారు అలాంటి భావనలను తమ మనస్సుల నుండి తొలగించుకోవాలని” టర్కీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ త్రైపాక్షిక సమావేశం కేవలం దౌత్యపరమైన సమావేశం కాదని, తూర్పు మధ్యధరాలో కొత్త కూటమి అని ఇజ్రాయెల్ ప్రధాన […]
Read more

భారత్‌తో చేదు సంబంధాలు కోరుకోవడం లేదు…బంగ్లాదేశ్‌ నేత!

ఢాకా: భారత్ వంటి పెద్ద పొరుగు దేశంతో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం “చేదు సంబంధాలు” కోరుకోవడం లేదని, దానికి బదులుగా న్యూఢిల్లీతో సంబంధాలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు డాక్టర్ సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని అన్నారు. బంగ్లాదేశ్ దినపత్రిక ‘దేశ్ రూపాంతర్’ ప్రకారం… ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ వ్యక్తిగతంగా ఉద్రిక్తతలను తగ్గించడానికి, న్యూఢిల్లీతో సంబంధాలలో […]
Read more

‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’లో తొలిగించిన ట్రంప్ ఫోటోను పునరుద్ధరించిన అమెరికా న్యాయశాఖ!

వాషింగ్టన్‌: ప్రస్తుతం అమెరికాను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాయమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోను తిరిగి పునరుద్ధరించారు. ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఎప్‌‌స్టీన్ డెస్క్ మీద ఉన్న ఒక ఫోటోలో ట్రంప్ ఒక మహిళా బృందంతో కలిసి ఉండగా, మరో ఫోటోలో తన భార్య మెలానియా, ఎప్‌స్టీన్, […]
Read more

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కొత్త స్థావరాలకు ఇజ్రాయెల్ ఆమోదం తెలపడాన్ని ఖండించిన యూకే!

జెరూసలేం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కొత్తగా 19 స్థావరాలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని బ్రిటన్‌ ఖండించింది. ఈ మేరకు ఆయన X లో విమర్శించారు. ఇవి అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం” అని బ్రిటిష్ మధ్యప్రాచ్య వ్యవహారాల మంత్రి హమీష్ ఫాల్కనర్ Xలో రాశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 19 కొత్త స్థావరాలకు ఇజ్రాయెల్ క్యాబినెట్ ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు, గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో మొత్తం కొత్త […]
Read more

బంగ్లాదేశ్ ఆగని నిరసనలు…ఢాకాకు చేరుకున్న ఉస్మాన్ హాది మృతదేహం!

న్యూఢిల్లీ: యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణానికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్‌లో రెండో రోజు నిరసనలు కొనసాగాయి. వార్తాపత్రిక గృహాలను లక్ష్యంగా చేసుకుని హింస జరిగింది. ఆగ్రహంతో బంగ్లాదేశ్‌లోని రెండు ప్రముఖ పత్రికా కార్యాలయాలు… బెంగాలీ పత్రిక ప్రోథమ్‌ అలో, ఆంగ్ల పత్రిక డెయిలీ స్టార్‌పై దాడి చేసి వాటికి నిప్పు పెట్టారు. కొందరు ఆందోళనకారులు డెయిలీ స్టార్‌ కార్యాలయంలోని సిపియులు, మానిటర్లు, కుర్చీలను ఎత్తుకెళ్లారు. హింస ఎంతకు తగ్గకపోవడంతో పత్రికా సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. […]
Read more

యువ నాయకుడి హత్య తర్వాత బంగ్లాదేశ్‌లో నిరసనలు!

ఢాకా: బంగ్లాదేశ్‌లో 2024 విద్యార్థి ఉద్యమానికి కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన షరీఫ్ ఉస్మాన్ హదిపై కాల్పులు జరగడంతో తీవ్రంగా గాయపడి, సింగపూర్‌లోని ఆసుపత్రిలో మరణించడంతో దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. వేలాది మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో ఢాకాలోని కొన్ని పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హాదీ మరణాన్ని “దేశానికి తీరని లోటు”గా […]
Read more

గాజా స్థిరీకరణ దళం ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వకూడదు…ఖతార్‌!

వాషింగ్టన్‌: కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం గాజాలో మోహరించనున్న ప్రతిపాదిత స్థిరీకరణ దళం ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వకూడదని ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థాని అన్నారు. వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సమావేశాల తర్వాత…ఖతార్‌కు చెందిన అల్ జజీరా ఛానెల్‌తో మాట్లాడుతూ, గాజాలో పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి ఉల్లంఘనలు మధ్యవర్తులను “ఇబ్బందికరమైన […]
Read more

గాజా యుద్ధ నేరాల దర్యాప్తును నిలిపివేయాలన్న ఇజ్రాయెల్ విజ్ఞప్తికి ‘నో’ అన్న క్రిమినల్‌ కోర్టు!

గాజా: పాలస్తీనాలో జరిగిన యుద్ధ నేరాలపై దర్యాప్తును ఆపేయాలన్న ఇజ్రాయెల్ పిటిషన్‌ను… అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తిరస్కరించింది. గత రెండేళ్లుగా గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ నేరాలను దర్యాప్తు చేయడానికి ICC ప్రాసిక్యూటర్‌ను అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని రద్దు చేయడానికి ICCలోని న్యాయమూర్తులు నిరాకరించారు. దీంతో కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధ నేరాలపై దర్యాప్తును కొనసాగించడానికి ICCకి వీలు కల్పిస్తుంది. 2024 నవంబర్‌లో ICC… ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు… మాజీ రక్షణ […]
Read more

‘అహ్మద్ ఆస్ట్రేలియా హీరో’…ప్రధాని అల్బనీస్‌!

సిడ్నీ: ఆస్ట్రేలియా బీచ్‌లో ఉగ్రవాదిని ధైర్యంగా ఎదుర్కొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటున్న ముస్లిం వ్యక్తి అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని పరామర్శించారు. బెడ్ పక్కన నిలబడి అతడి అసాధారణ ధైర్యాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొని జాతీయ ఐక్యతకు చిహ్నంగా నిలిచారని ఆయనను అభివర్ణించారు. అతడి తెగింపును యావత్తు ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అహ్మద్‌ను హీరో అంటూ కొనియాడిని విషయం విధితమే. మరోవంక అహ్మద్‌ను పరామర్శించిన అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ట్వీట్‌ […]
Read more
1 19 20 21 22 23 51

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.