Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వీసా సంక్షోభం…అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 70-80% తగ్గింది!

న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థుల డాలర్‌ డ్రీమ్స్‌ కరిగిపోతున్నాయి. వీసా సంక్షోభంతో అమెరికా విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థుల రాకపోకలు బాగా తగ్గాయి. ఏకంగా భారతీయ విద్యార్థుల సంఖ్య 70 నుంచి 80 శాతం వరకూ తగ్గుతుందని అంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు అవుట్‌బౌండ్ ట్రాఫిక్ 70 శాతం తగ్గిందని నిర్ధారించారు. ఇక వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌లలో ఫ్రీజ్ , వీసా తిరస్కరణ రేట్లలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల ఏర్పడింది. “సాధారణంగా ఈ సమయానికి, […]
Read more

ట్రంప్ వలసల అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన నిరసనలు!

చికాగో: మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఎక్కిన డొనాల్డ్‌ ట్రంప్‌కు నిరసనల సెగ తగిలింది. దేశవ్యాప్తంగా 1,600 కంటే ఎక్కువ ప్రదేశాలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ట్రంప్‌ కొత్తగా ప్రవేశపెట్టిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణలు, పేద ప్రజలకు ఆరోగ్య బీమా కోత విధించడం వంటి వివాదాస్పద అంశాలున్నాయి. “గుడ్ ట్రబుల్ లివ్స్ ఆన్” జాతీయ కార్యాచరణ దినోత్సవం సందర్భంగా దివంగత కాంగ్రెస్ సభ్యుడు, పౌర హక్కుల నాయకుడు జాన్ లూయిస్‌కు నివాళి అర్పించారు. […]
Read more

గాజా మారణహోమంతో పశ్చిమ దేశాల ముసుగు తొలిగింది!

జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజాలో భారీ స్థాయిలో మారణహోమం, పాలస్తీనియన్లను అంతమొందించే ప్రక్రియలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా గాజా ప్రజలను ఆకలితో అలమటింప జేస్తోందని వివిధ మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లోని పాఠశాలలు, మసీదులు & చర్చిలు, ఆసుపత్రులపై బాంబు దాడి చేసింది. గత 19 నెలలుగా, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై, వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్లపై, లెబనాన్, సిరియా, యెమెన్, ఇప్పుడు ఇరాన్‌పై దాడి చేసింది. […]
Read more

‘ఇజ్రాయెల్‌ను అమెరికా పెంపుడు కుక్క’గా అభివర్ణించిన ఖమేనీ!

టెహ్రాన్‌ : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌పై మరోసారి మండిపడ్డారు. ఇజ్రాయెల్ అమెరికా పెంపుడు కుక్క లాగా ఆ దేశం చెప్పినట్టూ ఆడుతోందని విరుచుకుపడ్డారు. దాని సూచనల ప్రకారమే నడుచుకుంటోందని ఆరోపించారు. ఖమేనీ మాట్లాడుతూ…వారు ఏదైనా కొత్త సైనిక దాడికి పాల్పడితే… తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంలో ఇచ్చిన దానికంటే… ప్రత్యర్థులకు ఇంకా పెద్ద దెబ్బ ఇవ్వగలమని అన్నారు. “మన దేశం అమెరికా శక్తిని, దాని పెంపు […]
Read more

మేము చేయగలిగింది ఏమీ లేదు…నిమిషా కేసులో సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం!

న్యూఢిల్లీ: యెమెన్ జాతీయుడి హత్యకు సంబంధించి రేపు (జూలై 16న) యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసులో “సాధ్యమైనంతవరకు” ప్రతిదీ చేస్తున్నామని భారత ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, యెమెన్‌తో ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితి, దౌత్యపరమైన పరిమితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితం అని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన […]
Read more

అక్రమ వలసదారుల బహిష్కరణకు అమెరికా కఠిన నిబంధనలు!

వాషింగ్టన్: తమ దేశంనుండి అక్రమ వలసదారులను పంపించేందుకు అమెరికా కఠిన నిబంధనలు రూపొందిస్తోంది. ఆరు గంటల ముందస్తు నోటీసుతో వలసదారులను బహిష్కరించాలని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) యోచిస్తున్నట్లు సమాచారం. వీరిని తమ సొంత దేశాలకు కాకుండా వేరే దేశాలకు కూడా పంపించేయవచ్చునని చెప్తున్నారు. ఆయా దేశాల నుంచి వీరి రక్షణకు భరోసా లేకపోయినా పట్టించుకోరు. భద్రతా హామీ లేకుండా వలసదారులను పంపే సందర్భంలో సాధారణంగా 24 గంటల ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం […]
Read more

కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన…ఆగని ఇజ్రాయెల్‌ రక్తదాహం, 43 మంది మృతి!

జెరూసలేం: గాజాలో రోజుల తరబడి అమాయక పాలస్తీనియన్లను చంపడమే ఇజ్రాయెల్‌ పనిగా పెట్టుకుంది. ఎంతమందిని చంపినా దాని రక్తదాహం తీరడం లేదు. తాజా సెంట్రల్ గాజాలో నీటి పంపిణీ కేంద్రం వద్ద క్యూలో వేచి ఉండగా ఎనిమిది మంది పిల్లలు సహా కనీసం 10 మంది ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో మరణించారని అత్యవసర సేవా అధికారులు తెలిపారు. హమాస్, నెతన్యాహు ప్రభుత్వం మధ్య కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోగా…ఆదివారం ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 43 మంది పాలస్తీనియన్లు […]
Read more

కాలిఫోర్నియాలో అక్రమ వలసదారుల అరెస్టులను ఆపాలని ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయమూర్తి!

లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్‌తో సహా ఏడు కాలిఫోర్నియా కౌంటీలలో అక్రమ వలసదారుల అరెస్టులను ఆపేయాలని నిన్న ఫెడరల్ న్యాయమూర్తి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆదేశించారు. దక్షిణ కాలిఫోర్నియాలో కొనసాగుతున్న వలసల అణచివేత సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో శ్వేత జాతీయులను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపిస్తూ వలస న్యాయవాద సంఘాలు గత వారం దావా వేసాయి. వీరిలో ముగ్గురు నిర్బంధిత వలసదారులు, ఇద్దరు US పౌరులు ఉన్నారు, ఏజెంట్లు తన గుర్తింపును చూపించినప్పటికీ నిర్బంధించారు. […]
Read more

ట్యాక్సీల్లో ఏసీ సమస్యలకు పరిష్కారం కనుగొన్న ఆఫ్ఘన్ డ్రైవర్లు!

కాబూల్‌: ఆఫ్ఘన్ టాక్సీ డ్రైవర్లు మండుతున్న ఎండలనుంచి ఉపశమనం కోసం ఓ సృజనాత్మక పరిష్కారాన్ని రూపొందించారు. దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ నగరంలో ఉష్ణోగ్రతలు సులభంగా 40 డిగ్రీల సెల్సియస్ (104 ఫారెన్‌హీట్) కంటే ఎక్కువగా ఉంటాయి, నీలిరంగు టాక్సీలు పైకప్పుకు ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌ను కట్టి, ప్రయాణీకుల కిటికీ ద్వారా ఎగ్జాస్ట్ గొట్టంతో చల్లని గాలిని అందించే ఏర్పాటను మనం చూడవచ్చు. మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రితం నుంచి మా దేశం చాలా వేడిగా మారడం […]
Read more

“డ్రోన్‌తో ఢీ కొట్టి”ట్రంప్‌ను హత్య చేయాలనుకున్నాం… ఖమేనీ సలహాదారు!

టెహ్రాన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన ఇంట్లో సన్‌బాత్‌ చేస్తున్నప్పుడు డ్రోన్‌తో దాడి చేసి చంపాలనుకున్నామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మాజీ సలహాదారుడు పేర్కొన్నాడు. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా సైన్యం కూడా పెద్దఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమపై దాడులకు ట్రంప్, అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ […]
Read more
1 36 37 38 39 40 51

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.