Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వెస్ట్ బ్యాంక్ భూమిని ప్రభుత్వ ఆస్తిగా మార్చాలనే ఇజ్రాయెల్ ‘ప్రణాళిక’ను ఖండించిన గల్ఫ్ దేశాలు!

రియాద్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని భూమిని అధికారులు “ప్రభుత్వ ఆస్తి”గా మార్చాలనే ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సౌదీ అరేబియా, ఖతార్,కువైట్ ఖండించాయి. ఈ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని, రాజకీయ పరిష్కారం కోసం అవకాశాలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది.. ఈ నిర్ణయం ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ చొరబాటుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈభూమిపై ఇజ్రాయెల్‌కు సార్వభౌమాధికారం లేదని సౌదీ నొక్కి చెప్పింది. ఈ చర్యను తిరస్కరిస్తున్నామని పునరుద్ఘాటించింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని భూమిని “ప్రభుత్వ ఆస్తి”గా […]
Read more

యూఎన్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం ఆఫ్రికన్ యూనియన్ మద్దతు…స్వాగతించిన పాలస్తీనా!

అడీస్‌అబాబా: ఐక్యరాజ్యసమితిలో (UN) పూర్తి సభ్యత్వం కోసం తన అభ్యర్థనకు ఆఫ్రికన్ యూనియన్ (AU) మద్దతు ప్రకటించడాన్ని పాలస్తీనా స్వాగతించింది. ఇథియోపియాలోని అడిస్ అబాబాలో జరిగిన 39వ ఆఫ్రికన్ యూనియన్ సదస్సులో పాలస్తీనా స్వయం నిర్ణయాధికారాన్ని బలపరుస్తూ తీర్మానం చేశారు. ఆ దేశాన్ని పూర్తి స్థాయి సభ్యదేశంగా చేర్చుకోవాలని, పాలస్తీనియన్ల బలవంతపు తరలింపును ఖండిస్తూ తీర్మానం చేశారు. ఆఫ్రికా సమ్మిట్‌లో వ్యక్తీకరించిన దృఢమైన వైఖరి తమకు ప్రోత్సాహకరంగా ఉందని పాలస్తీనా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఇది పాలస్తీనా […]
Read more

బంగ్లా ఎన్నికల్లో గెలిచిన తారిఖ్‌రహమాన్‌ను అభినందించిన మమతా బెనర్జీ!

కోల్‌కత: బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఎన్‌పీపార్టీ అధినేత తారిఖ్ రెహమాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వీట్లు, పూల బోకే పంపారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని గెలిపించినందుకు మమత బంగ్లాదేశ్ పౌరులను అభినందించారు, బిఎన్‌పి నాయకుడిని తారిఖ్ భాయ్ అని సంబోధించి పొరుగు దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు మమతా బెనర్జీ తారిఖ్ రెహమాన్‌కు ఫోన్ చేసి తన పార్టీ విజయానికి అభినందనలు […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ హత్యలను ఆపాలని, పునర్నిర్మాణం ప్రారంభించాలని సౌదీ మంత్రి పిలుపు!

మ్యూనిచ్: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ హత్యలను తక్షణమే ఆపాలని, పునర్నిర్మాణం ప్రారంభించాలని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ పిలుపునిచ్చారు. పాలస్తీనా ఐక్యతను కాపాడటానికి ఈ ప్రాంతంలో స్థిరత్వం చాలా ముఖ్యమైనదని ఆయన నొక్కి చెప్పారు. మ్యూనిచ్ భద్రతా సమావేశంలో “ది టర్నింగ్ పాయింట్: ది ఇంటర్నేషనల్ సిస్టమ్ బిట్వీన్ రిఫార్మ్ అండ్ డిస్ట్రక్షన్” అనే చర్చలో పాల్గొన్న సందర్భంగా… ఆయన మాట్లాడుతూ… ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ గాజాలో మరణాలు కొనసాగుతున్నాయని […]
Read more

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీఎన్‌పీ!

ఢాకా: బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) ముందంజలో ఉంది. నిన్న దేశంలోని మొత్తం 299 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2024లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆ పార్టీ అఖండ విజయం సాధించే దిశగా సాగుతోంది. బీఎన్‌పీ నేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి కానున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుు 155 సీట్లు అవసరం. అయితే బీఎన్‌పీ మాత్రం మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారని […]
Read more

అమెరికా-భారత్ వాణిజ్య ‘ఒప్పందం’వల్ల మనకు నష్టమే!

వాషింగ్టన్‌: దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరదించుతూ భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫలితంగా అమెరికా ఉత్పత్తుల కోసం… 140 కోట్ల జనాభా ఉన్న భారత మార్కెట్‌ తలుపులు బార్లా తెరుచుకోనున్నాయి. కాగా, భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మక ముందడుగని డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈ ఒప్పందం మన దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే అమెరికా చేసుకునే ఏ ఒప్పందమైనా అది అమెరికాకే లాభదాయకంగా ఉంటుందని […]
Read more

బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్!

ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 7:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 7:00 గంటలకు) పోలింగ్ ప్రారంభమైంది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమంతో అవామీ లీగ్ నేతృత్వంలో హసీనా ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బంగ్లా పాలనను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికలతో ఢాకాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. […]
Read more

వర్క్ పర్మిట్లను నిలిపేసిన ఇజ్రాయెల్…ఇబ్బంది పడుతున్న వెస్ట్ బ్యాంక్ పాలస్తీనియన్లు!

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్ వర్క్ పర్మిట్లను ఆపేయడంతో వెస్ట్ బ్యాంక్ పాలస్తీనియన్లు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల వెస్ట్ బ్యాంక్, గాజాకు చెందిన వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి, తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి భారత్ వంటి దేశాల నుంచి నిర్మాణ రంగ కార్మికులను ఇజ్రాయెల్ రిక్రూట్ చేసుకుంటోంది. యుద్ధం నేపథ్యంలో సుమారు లక్షకుపైగా పాలస్తీనియన్ల వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి. ఫలితంగా వెస్ట్‌బ్యాంక్‌లో నిరుద్యోగం 30%కు చేరింది. ఈకారణంగా పాలస్తీనా వాసుల కన్నీటి గాధలు […]
Read more

వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని ట్రంప్ వ్యతిరేకించారు…వైట్ హౌస్!

వాషింగ్టన్‌: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారని వైట్ హౌస్ అధికారి ఒకరు పునరుద్ఘాటించారు. “వెస్ట్ బ్యాంక్ ప్రశాంతతే ఉంటే ఇజ్రాయెల్‌ను సురక్షితంగా ఉంచుతుంది. ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది” అని వైట్ హౌస్ అధికారి సోమవారం రాత్రి ఆలస్యంగా చెప్పారు. వెస్ట్ బ్యాంక్‌పై నియంత్రణను విస్తరించాలనే ఇజ్రాయెల్ క్యాబినెట్ నిర్ణయంపై…వైట్‌హౌస్‌ అధికారి మాట్లాడుతూ… ఓస్లో ఒప్పందాల ప్రకారం ఈ ప్రాంతం పూర్తిగా లేదా పాక్షికంగా […]
Read more

H-1B వీసా ప్రోగ్రామ్‌ రద్దుకు అమెరికా సెనేట్‌లో బిల్లు!

వాషింగ్టన్: అమెరికాలో విదేశీ నిపుణులకు ఇచ్చే H-1B వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయడానికి బిల్లును ప్రవేశపెట్టినట్లు రిపబ్లికన్ సభ్యుడు గ్రెగ్ స్టీబ్ ప్రకటించారు. ఈ బిల్లు అమెరికన్లుగా అనుకూలంగా, విదేశీయులకు ప్రతికూలంగా ఉండనుంది. ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్’ (EXILE Act) పేరుతో ప్రతినిధుల సభలోకి తెచ్చిన ఈ బిల్లు ఆమోదం పొందితే వేలాది మంది భారతీయ టెకీలు, నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ బిల్లు H-1B వీసా కార్యక్రమాన్ని నిలిపివేయడం ద్వారా […]
Read more
1 4 5 6 7 8 42

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.