Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హర్ముజ్‌లో చమురు స్మగ్లింగ్… సెంట్రల్ కమాండ్ అధిపతిపై ఇరాన్ ఆరోపణ!

టెహ్రాన్‌: హర్ముజ్ జలసంధిలో చమురు స్మగ్లింగ్ కార్యకలాపాలను అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి నడిపిస్తున్నారని ఇరాన్‌కు చెందిన ఒక సీనియర్ భద్రతా అధికారి ఆరోపించారు. ఈమేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ, వారాంతంలో ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేశారు. అడ్మిరల్ బ్రాడ్ కూపర్, యూఏఈ సైన్యాన్ని ఉపయోగించి ఈ కార్యకలాపాలను నిర్దేశిస్తున్నారని, ఐదు లేదా ఆరు చిన్న పడవల ద్వారా పెద్ద […]
Read more

మనసు వికసిస్తేనే.. జీవితం పరిమళిస్తుంది!

డాక్టర్ కుత్బ్ ముహమ్మదుద్దీన్, MD సైకియాట్రిస్ట్, యూఎస్ఏ, చికాగో….✍️ ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటారు. కానీ, శరీరం ఫిట్‌గా ఉంటే సరిపోతుందా? మనసు మురిసిపోవద్దా? ఈ బిజీ ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతలో కనీస భాగం కూడా మన మానసిక ఆరోగ్యంపై పెట్టడం లేదు. గుండె జబ్బులు, రక్తపోటు, పోషకాహారం గురించి పదే పదే చర్చించుకునే మనం… మన మనసును, భావోద్వేగాలను మాత్రం గాలికి వదిలేస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, మానసిక ఆరోగ్యం అనేది ఏదో […]
Read more

రియాద్ విమానాశ్రయంపై హౌతీల దాడులు, ముగ్గురు సౌదీల మృతి!

రియాద్/దుబాయ్: అమెరికా-ఇరాన్ ఘర్షణ కారణంగా తీవ్ర ఉద్రిక్తతలో భాగంగా, యెమెన్‌ తిరుగుబాటుదారులు హౌతీ గ్రూప్ సౌదీ అరేబియాపై క్షిపణి దాడులను ముమ్మరం చేశారు. దీంతోపాటు పాటు, సౌదీ అరేబియా గగనతలాన్ని స్తంభింపజేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో, నిన్న రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించారని సౌదీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పలువురు గాయపడటంతో పాటు, సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం కూడా దెబ్బతింది. విమానాశ్రయంపై దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రపంచ చమురు అధిపతుల కీలక సమావేశానికి […]
Read more

యూఎస్ గ్రీన్ కార్డ్ నిలిపివేత…భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తేంటి?

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలపై తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంలో, కంపెనీ-ప్రాయోజిత గ్రీన్ కార్డ్ ప్రక్రియలో కీలకమైన శాశ్వత కార్మిక ధృవీకరణ (PERM) కార్యక్రమంపై యూఎస్ కార్మిక శాఖ తాత్కాలిక నిషేధం విధించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలతో పాటు కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని, అలాగే మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి యూఎస్ టెక్ దిగ్గజాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికన్ కార్మికులను పక్కనపెట్టి విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు… ఏడుగురు మృతి, పన్నెండుమందికి గాయాలు!

జెరుసలేం: గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన పాశవిక దాడుల్లో ఒక మహిళతో సహా కనీసం ఏడుగురు పాలస్తీనియన్లను హతమార్చగా, మరో డజను మందికి పైగా గాయపరిచింది. నిన్న గాజా నగరంలోని టెల్ అల్-హవా ప్రాంతం, అల్-తవామ్, అమెర్ ప్రాజెక్ట్ ప్రాంతాలు, వాయువ్యంలోని అల్-సుదానియా ప్రాంతం, అలాగే వాయువ్య రఫాలోని అల్-మవాసి, బని సుహైలా, ఈశాన్య ఖాన్ యూనుస్ చుట్టుపక్కల ప్రాంతాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. వాయువ్య గాజా నగరంలోని అల్-తవామ్ ప్రాంతంలో ఉన్న ఈజిప్షియన్ క్యాంపులో, నిరాశ్రయులకు […]
Read more

మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై సైనిక దాడులు చేయం…ట్రంప్!

వాషింగ్టన్: అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై సైనిక దాడులను తిరిగి ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయబోనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఈమేరకు రిపబ్లికన్ల తరపున ప్రచారం చేస్తున్నప్పుడు, ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఈ యుద్ధానికి ముగింపు పలకగలమనే నమ్మకాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు; అదే సమయంలో ఇరాన్‌పై పూర్తి స్థాయి సైనిక చర్యలను తిరిగి చేపట్టే అవకాశాన్ని కూడా ఆయన తోసిపుచ్చలేదు. సైనిక పోరాటం కేవలం […]
Read more

అక్టోబర్ 7 హెచ్చరికల తారుమారు… నెతన్యాహు బండారం బట్టబయలు!

టెల్‌అవీవ్‌: మూడేళ్ల క్రితం అక్టోబర్ ఏడునాటి దాడికి ముందు అందిన భద్రతా సమావేశాలు, హెచ్చరికలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన అధికారిక వివరణను తారుమారు చేశారని ఒక సవివరమైన దర్యాప్తులో వెల్లడైంది. యుద్ధానికి ముందు తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆయన కీలకమైన రికార్డులను తొలగించారు. యెడియోత్ అహ్రోనోత్ వార్తాపత్రిక అనుబంధ సంస్థ వైనెట్ నిర్వహించిన ఈ దర్యాప్తు, ఫిబ్రవరిలో నెతన్యాహు విడుదల చేసిన 55 పేజీల పత్రాన్ని అసలైన ప్రభుత్వ ట్రాన్స్క్రిప్ట్‌లు, సమావేశ నిమిషాలు, […]
Read more

హర్ముజ్‌లో నౌకపై క్షిపణి దాడి… 11 మంది భారతీయులకు గాయాలు!

న్యూఢిల్లీ: హర్ముజ్ జలసంధి గుండా పనామా జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై క్షిపణి దాడి చేయడంతో 11 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘MT ఆన్ పీస్’అనే ఈ నౌకలో 17 మంది భారతీయులతో సహా మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో మొత్తం 12 మంది సిబ్బంది గాయపడగా, వారిలో 11 మంది భారతీయులు […]
Read more

ఫ్రాన్స్ నిరసనలపై ‘ట్రంప్’ సంచలన వ్యాఖ్యలు!

వాషింగ్టన్‌: అమెరికాలో రాబోయే కీలకమైన మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో, ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారీ విద్యార్థి నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఆందోళనలకు “సామూహిక వలసలు”, ఇస్లామే కారణమంటూ ఆయన తన మితవాద వైఖరిని మరోసారి గట్టిగా వినిపించారు. “ఫ్రాన్స్‌లో జరుగుతున్నది అదుపు తప్పిన సామూహిక వలసలు తప్ప మరేమీ కాదు. ఇది పాఠశాలలకు సంబంధించిన విషయం కాదు, ఒకప్పుడు గొప్పగా ఉన్న దేశాన్ని ఇస్లాం ఆక్రమించుకోవాలని చూడటమే!” అని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో […]
Read more

ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు మోడీ, మచ్చార్‌లను ఆహ్వానించిన నెతన్యాహు!

దుబాయ్: ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కూల్చివేయడానికి కో-పైలట్ చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసినందుకు, భారత పైలట్ స్మిత్ మచ్ఛర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అతడిని “ప్రపంచ హీరో” అని అభివర్ణించారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073 కాక్‌పిట్‌లో కెప్టెన్ మచ్ఛర్‌పై అతని కో-పైలట్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న […]
Read more
1 2 3 4 5 6 … 67

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.