Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు…టీవీకే సీఎం అభ్యర్థిగా విజయ్!

చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరును టీవీకే పార్టీ ప్రకటించింది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి వెళ్ళేందుకు మరింత వ్యూహాత్మకంగా విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయ్ సీఎం అభ్యర్థిగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల ఒప్పందంపై చర్చలు జరపడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఆ పార్టీ తెలిపింది. అయితే పొత్తులపై […]
Read more

మణిపూర్‌ ప్రజలు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరగడం లేదా? నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ!

ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. ప్రజలు రోడ్లపై స్వేచ్చగా తిరగడం లేదు. రాజధాని ఇంఫాల్‌ పొరుగున ఉన్న నాగాలాండ్‌లోని దిమాపూర్‌తో కలిపే జాతీయ రహదారి-2 ద్వారా రాకపోకలు సజావుగా సాగడంలేదని వచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఓ నివేదికను ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అధికారులను ఆదేశించింది. ప్రారంభంలో, ఆగస్టు 20న NHRC ఇంఫాల్ జిల్లా మేజిస్ట్రేట్/కలెక్టర్, పోలీసు చీఫ్‌కు పిటిషన్ ద్వారా లేవనెత్తిన అంశాన్ని పరిశీలించి, నివేదికను పంపాలని చెప్పింది. […]
Read more

పీఎంఓలో రాహుల్ గాంధీ…ప్రధాని మోదీతో 88 నిమిషాలు సమావేశం!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మధ్య ఈరోజు జరిగిన 88 నిమిషాల సమావేశం పార్లమెంటు కారిడార్లలో ఊహాగానాలకు దారితీసింది. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన సమాచార కమిషనర్ నియామకంపై చర్చించడానికి నేతలు సమావేశమవుతారని తెలిసినప్పటికీ, సమావేశం సుదీర్ఘంగా సాగడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం… ప్రధానమంత్రి, ప్రధాని నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు సమాచార కమిషన్, ఎన్నికల కమిషన్, విజిలెన్స్ […]
Read more

సైబర్ మోసాల వల్ల కర్ణాటకకు 5,474 కోట్ల నష్టం!

బెంగళూరు: గత మూడు సంవత్సరాలలో కర్ణాటక ప్రజలు సైబర్ మోసాల వల్ల రూ.5,474 కోట్లు కోల్పోయారని, అందులో ఇప్పటివరకు పోలీసులు రూ.627 కోట్లు రికవరీ చేయగలిగారని హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు. శాసనసభలో సకలేశ్‌పూర్ బిజెపి ఎమ్మెల్యే సిమెంట్ మంజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. “ఇటీవలి కాలంలో సైబర్ మోసం పెరుగుతోంది. గత నాలుగు సంవత్సరాలలో, కర్ణాటకలో సుమారు 52 వేల సైబర్ మోసాలు జరిగాయి,ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని” పరమేశ్వర అన్నారు. పోలీసు చట్టాలకు […]
Read more

వందేమాతరంపై మళ్ళీ నెహ్రూను విమర్శించిన మోడీ…ఇదంతా బెంగాల్‌ ఎన్నికలకోసమేనన్న విపక్షం!

న్యూఢిల్లీ: ఓవైపు ఇండిగో సంక్షోభం, మరోవైపు దేశ రాజధాని, ఇతర భారతీయ నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం, రూపాయి పతనం మధ్య… వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం లోక్‌సభ ప్రత్యేక చర్చను చేపట్టింది. రోజంతా చర్చించారు. అధికార, విపక్షాలు దాదాపు 12 గంటల పాటు ఒకరినొకరు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో చర్చను ప్రారంభించి, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై మరోసారి దాడి చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు, ముస్లిం లీగ్‌కు తలవంచి ఆయన, […]
Read more

‘ఓటు చోరీ’ అతిపెద్ద ‘దేశ ద్రోహం’…రాహుల్‌గాంధీ!

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధికారపార్టీ తీవ్ర విమర్శలు చేశారు. కాషాయపార్టీ ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై ‘ఓటు చోరీ’కి పాల్పడి భారతదేశ భావనను నాశనం చేసింది. తద్వారా బీజేపీ అతిపెద్ద దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. దిగువ సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)ని “ ఉపయోగిస్తోందని” పలు ప్రశ్నలను సంధించారు. ఎన్నికలకు ఒక నెల ముందు అన్ని పార్టీలకు […]
Read more

‘ఇండిగో’ గందరగోళంపై సమాధానం ఇవ్వాలని లోక్‌సభలో విపక్షాల డిమాండ్‌!

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై దుమారం చెలరేగింది. భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి… సభనుంచి వాకౌట్‌ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. “మిస్టర్ […]
Read more

మూడవ తరగతి పాఠాన్ని ‘లవ్ జిహాద్’గా చిత్రీకరించిన టీవీ ఛానళ్లకు మందలింపు!

న్యూఢిల్లీ: ఎన్‌సీఆర్‌టీ పుస్తకంలోని మూడవ తరగతి పాఠాన్ని కల్పిత ‘లవ్ జిహాద్’ కథనంగా మార్చినందుకు పలు టీవీ ఛానెల్‌లను న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (NBDSA) మందలించింది. ఆ మతపరమైన ప్రసారాన్ని వెంటనే తొలగించాలని కూడా ఆదేశించింది. కాగా, ఈ కథనాన్ని ఇండియా టీవీ, న్యూస్ 18 మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ మధ్యప్రదేశ్/ఛత్తీస్‌గఢ్, జీ న్యూస్, ABP న్యూస్ వార్తా ఛానెల్‌లు ప్రసారం చేసాయి. విషయంలోకి వస్తే…రీనా అనే అమ్మాయి “చిట్టి ఆయి హై” అనే […]
Read more

ఇండిగో సంక్షోభం…ఒకప్పుడు ఎలక్టోరల్ బాండ్లను ఎక్కువగా కొనుగోలు చేసిన ఎయిర్‌లైన్!

న్యూఢిల్లీ: భారతదేశంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను స్తంభింపజేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంస్థ రాజకీయ విరాళాలు దానిని వెంటాడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు 2023లో ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్ద ఎత్తున ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. భారత ఎన్నికల కమిషన్ డేటా 2024 ప్రకారం… ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ గ్రూపులు రూ. 36 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని […]
Read more

డీజీపీల సమావేశంలో పోలీసు సంస్కరణలకు హామీ…కానీ అమలవుతాయా?!

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గతవారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో పోలీస్ డైరెక్టర్ జనరల్స్, భారతదేశ అత్యున్నత రాజకీయ నాయకత్వం, పోలీసు, నిఘా,భద్రతా సంస్థల ఉన్నతాధికారులను ఒకచోటకు చేర్చింది. ఇందులో దేశ అంతర్గత భద్రత, తీవ్రవాద వ్యతిరేకత, పోలీసు ఆధునీకరణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్‌ సెక్యూరిటీ, మహిళా భద్రత వంటి అంశాలపై చర్చించారు, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ […]
Read more
1 9 10 11 12 13 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.