Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సామూహిక ఓట్ల తొలగింపు… ఈసీ నష్ట నివారణ చర్యలు సరిపోవన్న కాంగ్రెస్!

న్యూఢిల్లీ: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా కోట్ల మంది ఓటర్ల పేర్లను సామూహికంగా తొలగించారని, దీనిని సరిచేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా చేపట్టిన నష్టనివారణ చర్యలు ఏమాత్రం సరిపోవని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ… రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన ఈసీ నిబంధనలను, చట్టాలను ఉల్లంఘించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ప్రతిపాదించిన చర్యలే ఎస్ఐఆర్ తప్పుగా జరిగిందని అంగీకరించినట్లేనని జైరాం రమేశ్ […]
Read more

కోల్‌కతాలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల విధ్వంసం!

కోల్‌కతా: కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (SRFTI) విద్యార్థులపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలమని చెప్పుకున్న వ్యక్తులు నిన్న దాష్టీకానికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు; పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన ఒక లైబ్రేరియన్, పలువురు ఉపాధ్యాయులు కూడా గాయపడి రక్తమోడారు. మొత్తం 150 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. కనీసం నలుగురు విద్యార్థులకు కత్తి గాయాలు అయ్యాయి. సాయంత్రం 7 గంటల సమయంలో ఇన్‌స్టిట్యూట్ […]
Read more

రోడ్డు తనిఖీ సందర్భంగా ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మ!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని తిలక్ నగర్‌లో జరిగిన రోడ్డు తనిఖీ సందర్భంగా, ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ సహాయకుడైన సాహిబ్ సింగ్‌పై మంత్రి పర్వేష్ వర్మ చేయి చేసుకోవడంతో ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే… తిలక్ నగర్ నియోజకవర్గంలో కొత్తగా వేసిన రోడ్డును పరిశీలించేందుకు మంత్రి పర్వేశ్ వర్మ నిన్న అక్కడికి తనఖీకి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌తో పాటు కొందరు స్థానికులు రోడ్డు నాణ్యత సరిగా లేదని, చేత్తో పెకిలిస్తే ఊడి […]
Read more

పంజాబ్‌లోని ఎల్‌పీయూలో విద్యార్థుల నిరసనలు… పదిరోజుల పాటు క్లాసుల రద్దు!

చండీగఢ్‌: పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)విద్యార్థినిపై బయటి వ్యక్తి అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై క్యాంపస్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో నేటి నుండి 10 రోజుల పాటు సాధారణ తరగతులను నిలిపివేసింది. అంతేకాదు మిడ్‌టర్మ్‌ పరీక్షలను కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వాయిదా వేసింది. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (UMS) ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని LPU ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని […]
Read more

కొత్త ప్రభుత్వం వచ్చాక… బెంగాల్‌లో క్రైస్తవులపై పెరిగిన దాడులు!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని కనీసం 60 ఘటనలు నమోదయ్యాయని ఇండియా హేట్ ల్యాబ్ (IHL) నివేదిక వెల్లడించింది. మే 13 నుండి సెప్టెంబర్ 20 మధ్య 13 జిల్లాల్లో నమోదైన ఈ ఘటనలలో ప్రార్థనా సమావేశాలు, ఇళ్లు, చర్చిలపై దాడులు, భక్తులను వేధించడం, శారీరక దాడులు, విధ్వంసం, బహిరంగ అవమానాలు వంటివి ఉన్నాయి. క్రైస్తవుల సమావేశాలపై 52 దాడులు, శారీరక హింస, మూక దాడులు, విధ్వంసానికి […]
Read more

నల్సార్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన… తీవ్రంగా ఖండించిన ఏబీవీపీ!

హైదరాబాద్: జైలులో ఉన్న సామాజిక కార్యకర్త ఉమర్ ఖాలిద్‌పై రూపొందించిన ‘ప్రిజనర్ నెం. 626710’ అనే డాక్యుమెంటరీని సెప్టెంబర్ 23న ఇక్కడి నల్సార్ లా యూనివర్శిటీ క్యాంపస్‌లో ‘అనధికారికంగా’ ప్రదర్శించడాన్ని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖండించింది. ఈ ప్రదర్శనకు దారితీసిన పరిస్థితులపై పారదర్శక విచారణ జరపడంతో పాటు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. జేఎన్‌యూ నిరసనలు, సీఏఏ-ఎన్‌ఆర్‌సీ నిరసనలు, ఢిల్లీ అల్లర్ల చుట్టూ ఉన్న వివాదాలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిపై ఈ […]
Read more

మణిపూర్‌లో సాయుధ దళాల చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించిన కేంద్రం!

న్యూఢిల్లీ: మణిపూర్‌లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం (AFSPA)ను మరో ఆరు నెలల పాటు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగింపు అక్టోబర్ 1, నుంచి అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీ, మైతేయ్ వర్గాల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి మణిపూర్ జాతి ఘర్షణల్లో చిక్కుకుంది. ఈ హింసలో నిరాశ్రయులైన సుమారు 43,000 మంది […]
Read more

కోల్‌కతా కళాశాలలో మోదీపై నాటకం… భగ్గుమన్న విద్యార్థులు!

పశ్చిమబెంగాల్‌: కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక స్కాటిష్ చర్చి కాలేజీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నిర్వహించ తలపెట్టిన ‘నమో సేవా గాథ’ అనే నాటకం ప్రదర్శనపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జయంతి, ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో భాగంగా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పాఠశాలలు ‘నమో సేవా: అజానా కహానీ’ పేరుతో ఇదే నాటక మరో రూపాన్ని ప్రదర్శించిన కొద్ది […]
Read more

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం 529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ!

ముఖ్యాంశాలు పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం రూ. 529.38 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో దాదాపు రూ. 287 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో అభ్యర్థులకు రూ. 58.80 కోట్లు అందించింది. ఎన్నికల సమయంలో పార్టీకి సుమారు రూ. 1,494 కోట్ల ఆదాయం సమకూరింది ఎన్నికల ముగింపు సమయానికి రూ. 7,689.06 కోట్ల నిల్వ ఉన్నట్లు తెలిపిన బీజేపీ న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వ్యయ నివేదికల […]
Read more

ప్రధాని, అమిత్‌షా, సీఈసీ ‘దేశ ద్రోహులు’…రాహుల్‌గాంధీ!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌లు ‘దేశద్రోహులు’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. భారత ఎన్నికల వ్యవస్థను, ప్రజల ఓటు హక్కును వీరు ముగ్గురూ కలిసి నాశనం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాదు సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో రిగ్గింగ్ జరుగుతోందని తాను “వంద శాతం” నమ్ముతున్నానని లోక్‌సభ […]
Read more
1 … 8 9 10 11 12 … 118

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.