Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బీహార్‌లో కొనసాగుతున్న పోలింగ్‌…ఓటేసిన లాలూ, నితీష్!

పాట్నా: బీహార్‌లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 243 సీట్లకు గాను మొదటి దశలో భాగంగా 121 స్థానాల్లో ఉదయం పోలింగ్‌ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో అధికార NDA రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టాలని ఆశిస్తుండగా, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి తేజస్వీ యాదవ్‌ సీఎం అభ్యర్థిగా నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడుతోంది. ఈ వార్త రాసే సమయానికి మొత్తం 27.65% ఓటర్ల పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ […]
Read more

‘ఓటు చోరీ’ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రధాని మోదీ…రాహుల్‌ గాంధీ!

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, ఎన్నికల సంఘం దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ” క్రమబద్ధమైన ఓటు చోరి ” వ్యవస్థను తయారు చేసారని ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీన్ని బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. నిన్న ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ ”దిహెచ్‌-ఫైల్స్‌” అనే ప్రెజెంటేషన్‌తో నకిలీ ఓట్లను ఆధారాలతో సహా వెల్లడించారు. డూప్లికేట్‌, ఫేక్‌ ఓటర్లతో బిజెపి విజయానికి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ […]
Read more

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు విఫలమైనా….కేరళ పేదరికాన్ని ఎలా నిర్మూలించగలిగింది?

తిరువనంతపురం: దేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక సెషన్‌లో సీఎం విజయన్‌ అధికారికంగా ప్రకటించారు. భారతదేశం అంతటా ఉన్న ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తుల దృష్టికి అర్హమైన మైలురాయి విజయం ఇది. భారతదేశంలో హింస లేకుండా ప్రజాస్వామ్య మార్గాల ద్వారా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన మొదటి రాష్ట్రంగా కేరళ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ సమయంలో, రాజకీయ పరిశీలకులు అటువంటి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని లేదా స్పష్టమైన ఫలితాలను […]
Read more

ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక ర్యాలీకి నేతృత్వం వహించిన మమత…చేతనైతే ఆపమని సువేందు సవాల్‌!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె ప్రధాన ప్రత్యర్థి సువేందు అధికారి చేసిన ర్యాలీలు, ప్రతి-ర్యాలీలు, ఆవేశపూరిత ప్రసంగాలు రాష్ట్రంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతతో ఉన్న రాజకీయ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నిన్న కోల్‌కతావీధుల్లో నిర్వహించిన భారీ ర్యాలీని దీదీ ముందుండి నడిపించారు. ఈ ప్రక్రియ కేంద్రం, ఎన్నికల సంఘం కుమ్మక్కై నిర్వహిస్తోన్న నిశ్శబ్ద రిగ్గింగ్ అని, రెండు కోట్ల మంది ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర పన్నుతున్నాయని […]
Read more

ప్రధాని మోదీ ‘ద్వేష రాజకీయాలకు’ పాల్పడుతున్నారని ఆరోపించిన సీఎం స్టాలిన్!

ధర్మపురి: బీహార్‌ ఎన్నికల ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఓటు రాజకీయాలకు’ పాల్పడుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడులో కూడా అదే తరహాలో మాట్లాడే ధైర్యం ఆయనకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడును సందర్శకులు నివసించే ప్రదేశంగా ప్రధాని అభివర్ణించారని పేర్కొంటూ… “ఆయనకు తమిళనాడులో మాట్లాడే ధైర్యం ఉందా?” అని స్టాలిన్ ప్రశ్నించారు. ‘2026లో డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’“ఎవరో ఎన్ని కుట్రలు చేసినా, మాపై ఎన్ని అభాండాలు వేసినా, నకిలీ వార్తలు ప్రచారం […]
Read more

“భారతదేశం విశాల దృక్పథం అలవర్చుకోవాలి”… శశి థరూర్!

న్యూఢిల్లీ: వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు హిందీ స్కాలర్‌ను ఢిల్లీ నుండి బహిష్కరించిన వారం అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ అంశంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ మాట్లాడుతూ… భారత అధికారులు విశాల దృక్పథం అలవర్చుకోవాల్సిన అవసరముందని అన్నారు. బిజెపి మాజీ ఎంపి స్వపన్ దాస్‌గుప్తా రాసిన కాలమ్‌కు థరూర్ స్పందిస్తూ, అధికారులు ఇమ్మిగ్రేషన్‌ విషయాలు చూసుకోవాలి కానీ ప్రొఫెసర్ పాండిత్యాన్ని అంచనా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. “భారతదేశం విదేశీ స్కాలర్‌లకు తలుపులు మూసివేసిందనే […]
Read more

‘ఆర్‌ఎస్‌ఎస్’ను నిషేధించండి…మల్లికార్జున్ ఖర్గే డిమాండ్!

న్యూఢిల్లీ: రాష్ట్రీ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను నిషేధించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్‌ చేశారు. ఈమేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948లో రాసిన చారిత్రాత్మక లేఖను ప్రస్తావించారు. మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన మత వాతావరణాన్ని పెంపొందించడానికి ఆ సంస్థ కారణమని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ప్రసంగించిన ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. భారతదేశ ఉక్కు మనిషిని నిజంగా గౌరవిస్తే పటేల్ వైఖరిని గౌరవించాలని సవాలు చేశారు. ఈ సందర్భంగా 1948 ఫిబ్రవరి 4న శ్యామా […]
Read more

అలీఘర్‌లో దేవాలయ గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన హిందూత్వ వ్యక్తుల అరెస్టు!

లక్నో: ముస్లిం సమాజ సభ్యులను ఇరికించడానికి,మతపరమైన అశాంతిని రేకెత్తించడానికి అలీఘర్‌లోని అనేక దేవాలయాల గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన నలుగురు హిందూత్వ కార్యకర్తలను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని జీశాంత్ సింగ్, ఆకాష్ సరస్వత్, దిలీప్ శర్మ, అభిషేక్ సరస్వత్‌గా గుర్తించారు. పోలీసు నివేదికల ప్రకారం, ఈ వారం ప్రారంభంలో అనేక దేవాలయాలపై ఈ రాతలు కనిపించాయి. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు దర్యాప్తు […]
Read more

అమెరికా నుంచి 2790 మంది భారతీయులు వెనక్కి వచ్చారన్న కేంద్రం!

న్యూఢిల్లీ: అక్రమవలసదారులపై అగ్రరాజ్యం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపేశారు. ఈ లెక్కలను స్వయంగా భారత ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు యూఎస్ లో అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి […]
Read more

ఎస్‌ఐఆర్‌ భయంతో బెంగాల్‌లో మరోవ్యక్తి ఆత్మహత్య!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓటు హక్కు లేకుండా పోయే అవకాశం ఉందని బాధపడుతూ మరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో SIRకు వ్యతిరేకంగా తన వాదనను వినిపించింది. భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు ఎన్నికల కమిషన్ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించింది. “మా చివరి రక్తపు బొట్టు వరకు, ప్రజల హక్కులను కాపాడటానికి,మన దేశ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ, దాని మిత్రపక్షాల దుర్మార్గపు ఎజెండాను ఓడించడానికి మేము […]
Read more
1 16 17 18 19 20 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.