Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆర్‌ఎస్‌ఎస్ వివాదం…ప్రభుత్వ ఆస్తుల వినియోగంపై కొత్త బిల్లును తీసుకొస్తున్న కర్ణాటక!

బెంగళూరు: ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు కార్యకలాపాలను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక బిల్లును తీసుకువస్తోంది. బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలలు నిర్వహించడంపై రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్ ఖర్గేకు, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నారు. ఈమేరకు ‘ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రభుత్వ ఆస్తుల వినియోగ కర్ణాటక నియంత్రణ బిల్లు, 2026’పై రాష్ట్ర మంత్రివర్గం చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం…ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి నమోదుకాని సంస్థలతో సహా ఏ సంస్థ అయినా […]
Read more

రాజకీయ సంభాషణలో చతురత ప్రదర్శించిన రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ‘రచనాత్మక్ కాంగ్రెస్’ జాతీయ సదస్సులో వ్యంగ్యం, చమత్కారంతో కూడిన రాజకీయ సంభాషణ ద్వారా వినూత్న శైలిని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ విధానాన్ని, ‘హగ్ డిప్లొమసీ’ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తద్వార లోక్‌సభ ప్రతిపక్షనేత ఈ సమావేశాన్ని ఒక ఉత్సాహభరితమైన, పరస్పర సంభాషణలతో కూడిన, గాఢమైన రాజకీయ చర్చగా మార్చారు. కాగా, రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై […]
Read more

యూపీలో ఇద్దరు మహిళల మత మార్పిడిని సమర్థించిన అలహాబాద్ హైకోర్టు!

లక్నో: స్వచ్ఛందంగా ఇస్లాం మతంలోకి మారినట్లు పేర్కొన్న ఇద్దరు హిందూ మహిళలను విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు గత వారం ఆదేశించింది. నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వయోజనులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తు చేస్తూనే.. వారి స్వేచ్ఛను కాపాడడంంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా విఫలం అయ్యారని పేర్కొంది. ఈ సందర్భంగానే బాధితులు అయిన ఇద్దరు అమ్మాయిలకు.. వారి తండ్రితో పాటు యూపీ సర్కారు సంయుక్తంగా రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. […]
Read more

స్వతంత్ర ఆలోచనలపై చర్చను రేకెత్తించిన ఉమర్ ఖాలిద్ ‘ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్’ పుస్తకం!

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త, జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ జైలు నుంచి చేసిన పీహెచ్‌డీ థీసిస్ ఆధారంగా రూపుదిద్దుకున్న గ్రంథమే ‘ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్. ఈ పుస్తకంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన చర్చా కార్యక్రమంలో విద్యావేత్తలు, పాత్రికేయులు, రాజకీయ ప్రముఖులు, మానవహక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పుస్తకంలోని చారిత్రక ఇతివృత్తాలతో పాటు విద్య, అసమ్మతి, స్వేచ్ఛ, న్యాయం వంటి విస్తృత ప్రశ్నలను విశ్లేషించారు. జగ్గర్‌నాట్ బుక్స్ ప్రచురించిన ‘ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్’ […]
Read more

‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు రెడీ’!

న్యూఢిల్లీ: ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదింపజేసుకునే ప్రయత్నంలో 54 మంది ఎంపీల కొరత ఎదురైన తర్వాత, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ…ఈ వర్షాకాల సమావేశాల్లో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉంటారు. వీరిలో రాష్ట్రాల నుంచి 530 మంది వరకు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మంది వరకు సభ్యులు ఉంటారు. […]
Read more

రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల నిరసనను ఆయుధంగా వాడుకుంటున్న బీజేపీ…జార్ఖండ్ సీఎం!

రాంచీ: నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఈ నిరసనలను తమ ప్రభుత్వం తీరును ఆయన సమర్థించుకున్నారు. నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడుతూ…యువతను తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ నాయకులు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ‘విద్యార్థి ముసుగు’ వాడుకుంటున్నారని సోరెన్ ఆరోపించారు. నియామక […]
Read more

‘వీబీ-జీ రామ్ జీ’తో ‘ఉపాధి చోరీ’…మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు!

న్యూఢిల్లీ: ఉపాధిహామీ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ పథకంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాం రమేశ్​ తీవ్ర విమర్శలు చేశారు. చట్టం వచ్చిన మొదటి నెల జూలైలో గ్రామీణ ఉపాధి కల్పనలో తీవ్ర తగ్గుదల కనిపించిందని అధికారిక గణాంకాలు చూపిస్తున్నాయని, మోదీ ప్రభుత్వంపై పేదల ఉపాధిని చోరీ చేసిందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది. పునరుద్ధరించిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జూలైలో కల్పించిన ఉద్యోగ-పనిదినాలలో గతేడాదితో పోలిస్తే 49.94% తగ్గుదల ఉందని అధికారిక […]
Read more

విద్యార్థులపై కాల్పులకు అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్!

న్యూఢిల్లీ: పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా చేసే సాధారణ ప్రసంగం పట్ల ప్రతిపక్షానికి ఆసక్తి లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపడానికి ఎవరు అనుమతి ఇచ్చారో హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ… గత 15 రోజులుగా పార్లమెంటుకు వచ్చి పోలీసు […]
Read more

మణిపూర్ హింసాకాండకు సంబంధించి ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం!

న్యూఢిల్లీ: మణిపూర్‌లో 2003 నాటి జాతిపరమైన హింసకు సంబంధించి రెండు ప్రత్యేక విచారణ కోర్టులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని మణిపూర్, అస్సాం ప్రభుత్వాలతో పాటు ఇతర అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం దర్యాప్తు పురోగతిని సమీక్షించింది. బాధితులు, వారి కుటుంబాలు, న్యాయవాదులు రికార్డులను పొందేందుకు వీలుగా, ఛార్జిషీట్లు దాఖలైన అన్ని కేసుల వివరాలను, కేసు నంబర్లు, ప్రస్తుత స్థితితో సహా క్రోడీకరించాలని అధికారులను […]
Read more

యువత ఇబ్బందులకు వ్యవస్థ వైఫల్యమే కారణమన్న రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: దేశంలో యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రస్తుత విద్యా, ఉపాధి వ్యవస్థల వైఫల్యమే కారణమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ… ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి నెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో తాను కలిసిన ఒక విద్యార్థి “నాకు ఇక వేరే మార్గం […]
Read more
1 … 18 19 20 21 22 … 118

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.