Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సిట్‌ ఏర్పాటు…ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనలు!

లక్నో: మహిళా సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాను తొలగించాలని బీజేపీపై ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, సుప్రీంకోర్టు సోమవారం ఆయన అరెస్టును నిలిపివేసింది. ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరోవంక మంత్రికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్, గత కొన్ని రోజులుగా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అదేసమయంలో పస్మాండ ముస్లిం సమాజం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, […]
Read more

అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులపై అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అశోక విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగాధిపతి అలీ ఖాన్ మహ్మదాబాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అసోసియేట్ ప్రొఫెసర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం, మంగళవారం లేదా బుధవారం ఈ పిటిషన్లను విచారణకు తీసుకుంటామని తెలిపింది. […]
Read more

భారత్‌ ఎన్ని విమానాలు కోల్పోయిందో? దేశానికి నిజం తెలియాలి… రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ గురించి పాకిస్తాన్‌కు “ప్రారంభంలోనే” తెలియజేసామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనిని “నేరం” అని అభివర్ణించారు. దాని కారణంగా వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తాను అడిగిన ప్రశ్నపై విదేశాంగమంత్రి జైశంకర్ మౌనం దేశానికి నష్టం కలిగిస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ […]
Read more

ఆపరేషన్‌ కగార్‌…తెలంగాణలో 20 మంది మావోయిస్టుల అరెస్ట్‌!

హైదరాబాద్ : గత రెండు రోజుల్లో, తెలంగాణలోని ములుగు పోలీసులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌లో భాగంగా 20 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. కర్రెగుట్ట ప్రాంతం ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్లతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎలిమిడి, ఉసుర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. అరెస్ట్‌ అయిన మావోయిస్టులనుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 24 గంటల్లో లొంగిపోయిన వారి ఆకౌంట్‌లో రివార్డు డబ్బులు జమ […]
Read more

ఉపాధిహామీలో 71 కోట్ల కుంభకోణం…గుజరాత్ బీజేపీ మంత్రి కుమారుడు అరెస్టు!

గాంధీనగర్‌ : గుజరాత్‌ రాష్ట్రం ఉపాధిహామీ పనుల్లో 71కోట్ల భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఉపాధిహామీ చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన మంత్రి కుమారుడే అడ్డంగా దోచుకున్నాడు. ఈ కేసులో గుజరాత్ రాష్ట్ర పంచాయతీ, వ్యవసాయ మంత్రి బచుభాయ్ ఖాబాద్ కుమారుడు బల్వంత్ ఖాబాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు, ఈ కుంభకోణంలో కొన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీలు పని పూర్తి చేయకుండా లేదా వస్తువులను సరఫరా చేయకుండానే ప్రభుత్వం నుండి చెల్లింపులు పొందాయని పోలీసులు తెలిపారు. దాహోద్ జిల్లాలో అప్పటి […]
Read more

పహల్గామ్ దాడి తర్వాత బెంగాలీ మాట్లాడే ముస్లింలు బలిపశువులుగా మారారు!

న్యూఢిల్లీ : ఇటీవలి పహల్గామ్ దాడి, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన వివాదం, బెంగాలీ మాట్లాడే ముస్లింలను బంగ్లాదేశ్ చొరబాటుదారులని చెప్పుకుంటూ వారిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రభుత్వానికి ఒక సాకును ఇచ్చింది. బెంగాలీ మాట్లాడే ముస్లింలను రాజస్థాన్, అస్సాం వంటి రాష్ట్రాల నుండి చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా బలవంతంగా వెళ్లగొట్టడం వలన వారు బలిపశువులుగా మారారు. రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 1,000 మందికి పైగా వ్యక్తులను నిర్బంధించి, వారిలో […]
Read more

పహల్గామ్ అమరవీరుడి భార్య, సైనిక అధికారి, విదేశాంగ కార్యదర్శిపై ట్రోల్ దాడులు… ప్రభుత్వ మౌనంపై అనుమానాలు!

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత, భారతదేశం ఒక కలవరపెట్టే కొత్త కోణాన్ని చూస్తోంది: ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత ప్రచారాలు, అమరవీరుడైన సైనికుడి భార్య, సైనిక అధికారి, విదేశాంగ కార్యదర్శిపై ట్రోలింగ్‌ పెరిగింది. అయినా ప్రభుత్వం మౌనాన్ని పాటిస్తోంది. దీంతో మితవాద సమూహాలు ధైర్యంగా ఇలా చేయగలుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముస్లిం వ్యతిరేక హింసగా ప్రారంభమైన ట్రోల్స్‌ ఇప్పుడు విస్తృతమైన సైద్ధాంతిక దాడిగా మారింది. సోషల్ మీడియా ట్రోల్స్ – కొన్ని అధికార పార్టీకి సంబంధించినవి […]
Read more

మోడీ విదేశాంగ విధాన మార్పు…పర్యవసానాలు!

న్యూఢిల్లీ: కాల్పుల విరమణ తర్వాత మే 12న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేసిన 22 నిమిషాల ప్రసంగం, ప్రజల తక్షణ ఆందోళనలను పరిష్కరించడం కంటే తన రాజకీయ పునాదికి భరోసా ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రజలు ప్రైవేట్ సంభాషణల్లో… సోషల్ మీడియా పోస్ట్‌లలో లేవనెత్తిన అనేక ప్రశ్నలకు మోడీ సమాధానం ఇవ్వలేదు. ప్రధానమంత్రి, ప్రభుత్వం లోపల, వెలుపల ఉన్న ఆయన పార్టీ నాయకులు ఆ ప్రశ్నలను స్వీకరించడంలో లేదా సమాధానం ఇవ్వడంలో ఇబ్బందులు ఉండొచ్చు […]
Read more

హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ అరెస్టు…100 కోట్ల కుంభకోణం!

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల అక్రమ దిగుమతికి సంబంధించిన దాదాపు రూ.100 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత మోసంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఒక లగ్జరీ కార్ డీలర్‌ను గుజరాత్‌లో అరెస్టు చేశారు. ‘కార్ లాంజ్’ షోరూమ్ యజమాని బషరత్ ఖాన్ విదేశాల నుండి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లను విలువ తగ్గించి చూపడంలో (కొన్ని సందర్భాల్లో వాటి వాస్తవ విలువలో దాదాపు 50 శాతం) కీలక పాత్ర పోషించాడని అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ […]
Read more

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో అస్సాంలో 58 మంది అరెస్టు!

గహవటి : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అస్సాం ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. సోనిత్‌పూర్ జిల్లా నుండి మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 58కి చేరుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ముఖ్యమంత్రి ఇలా రాశారు, “58 మంది పాక్ సానుభూతిపరులు జైలులో ఉన్నారు. వారి దేశ […]
Read more
1 26 27 28 29 30 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.