Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణను కోరుతున్న ఎంకే స్టాలిన్!

చెన్నై: రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం చేసే పద్ధతిని రద్దు చేస్తూ… రాజ్యాంగ సవరణను ప్రతిపాదించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో డిఎంకె సంప్రదింపులు జరుపుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో గవర్నర్లు, ఎన్నికైన ప్రభుత్వాల మధ్య ఇటీవల జరిగిన వరుస ఘర్షణలపై స్పందిస్తూ… గవర్నర్లు “పార్టీ ఏజెంట్లు”గా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తున్నారని సిఎం స్టాలిన్ ఆరోపించారు. “ముందు తమిళనాడు, తర్వాత కేరళ, ఇప్పుడు […]
Read more

కాషాయ జెండా ఊపిన కర్ణాటక అధికారిపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్!

ఉడుపి: పర్యాయ ఊరేగింపు సందర్భంగా ఉడుపి డిప్యూటీ కమిషనర్ టి కె స్వరూప కాషాయ జెండా పట్టుకున్నారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ… తాను ఆ కార్యక్రమంలో తన అధికారిక హోదాలో పాల్గొన్నానని, తన వైపు నుండి ఎలాంటి రాజకీయ ప్రేరేపిత భాగస్వామ్యం లేదని అన్నారు. జనవరి 18న పర్యాయ ఊరేగింపును ప్రారంభించేటప్పుడు కాషాయ జెండా పట్టుకున్నందుకు స్వరూపపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ […]
Read more

కేంద్ర బడ్జెట్… జమాతే ఇస్లామీ హింద్ సిఫార్సులు!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు, అది ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తెలిపే ఆర్థిక ప్రణాళిక. ఇది దేశ ఆర్థిక వృద్ధి, సంక్షేమం, వనరుల కేటాయింపు, ఆదాయ పన్నుల వంటి కీలక విధానాలను ఈ బడ్జెట్‌ నిర్దేశిస్తుంది. కాగా, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జమాతే-ఇ-ఇస్లామీ హింద్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. దేశంలో ఉపాధిని పెంచాలని, సంపద పంపిణీని మెరుగుపరచి, డిమాండ్-దిశగా […]
Read more

తమిళనాడు అసెంబ్లీలో ఘర్షణ…గవర్నర్ ఆర్.ఎన్. రవి వాకౌట్!

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి, డీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. శాసనసభ ప్రారంభ సమావేశంలో సిద్ధం చేసిన ప్రసంగానికి భిన్నంగా…గవర్నర్ ప్రసంగించాలని తీసుకున్న నిర్ణయం ఈ రగడకు కారణమైంది. ఉదయం అసెంబ్లీ సెషన్‌‌ ప్రారంభం కాగానే రాజకీయ రగడ రాచుకుంది. శాసన సభను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ప్లే చేసి, అందరూ ఆలపించాలని […]
Read more

విద్వేషానికి మూల్యం…పాఠశాల భవనం కూల్చివేత!

భోపాల్: ఏ దేశానికైనా నిజమైన బలం దాని విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఉంది. గ్రామ పంచాయతీ నుండి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉన్నప్పటికీ, ద్వేషంతో మాత్రమే పాఠశాల భవనాన్ని కూల్చివేయడం దేశ పురోగతికి పెద్ద ఎదురుదెబ్బ. తమ పౌరులను అవమానించడమే అవుతుంది. నేతలు తమ ప్రజల శ్రేయస్సు కంటే విభజన, ద్వేషపూరిత అజెండాలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత దురదృష్టకరమని ఓ సామాజిక కార్యకర్త వాపోయారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా, భైన్స్‌దేహి తహసీల్‌లో ఉన్న ధాబా గ్రామంలో ఇటీవల […]
Read more

స్వామిపై పోలీసు జులుం…’న కామ్‌కే’, ‘న రామ్‌కే’అంటూ బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు!

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు సంగం ఘాట్‌కు వెళ్లే మార్గ మధ్యలో స్వామికి జరిగిన “అవమానం”పై కాంగ్రెస్.. బీజేపీని తీవ్రంగా విమర్శించింది. ఈ “అవమానకరమైన సంఘటన”పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ‘న కామ్‌కే’,’న రామ్‌కే’ అంటూ… కేవలం అధికారం, డబ్బు కోసమే బీజేపీ నేతలు పాకులాడుతున్నారు, అంతకు మించి వారికి మతం, విశ్వాసం […]
Read more

స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తాం…కర్ణాటక ఎన్నికల సంఘం!

బెంగళూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు (ఈవీఎంలు) బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తామని, ఎన్నికలు మే 25 తర్వాత జరుగుతాయని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జి.ఎస్.సంగ్రేషి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. “గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపల్ […]
Read more

ఎస్‌ఐఆర్…ప్రజల ఓటు హక్కుపై దాడి-పౌరసత్వం ప్రశ్నార్థకం!

అబ్దుల్ మజీద్ షోయిబ్,అధ్యక్షులు, ఎం.పి.జే తెలంగాణ. ఎస్‌ఐఆర్‌పై ప్రజా ప్రతిఘటన అవసరం హైదరాబాద్‌: ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన (SIR) పేరుతో చేపడుతున్న ప్రక్రియ వల్ల కోట్లాది పౌరుల పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో పేదలు, కూలీలు, మైనారిటీలు, వలస కార్మికులు, వెనుకబడిన వర్గాల వారు ప్రభావితమయ్యారు. ఎస్‌ఐఆర్ కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాదు — ఇది రాజకీయంగా ప్రభావం చూపే చర్య. దీనిపై మౌనంగా […]
Read more

‘ఎస్‌ఐఆర్‌’ ద్వారా ఏకంగా 6.5 కోట్ల మంది ఓటర్ల తొలగింపు దేనికి సంకేతం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా ఏకంగా 6.5 కోట్ల మంది ఓటర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. 2025అక్టోబర్ 27న, భారత ఎన్నికల సంఘం, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, 1950లో సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రవేశపెట్టినప్పటి నుండి భారతదేశం ఈ స్థాయిలో ఓటర్ల తొలగింపును ఎప్పుడూ చూడలేదు – యుద్ధాల సమయంలో… కరువు సమయంలో కూడా కాదు, […]
Read more

కలుషిత నీటి మరణాల నేపథ్యంలో నేడు ఇండోర్‌కు రాహుల్ గాంధీ!

భోపాల్: ఇండోర్‌లో కలుషిత నీటి సంక్షోభంపై రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు నగరానికి వెళుతున్నారు. ఈ పర్యటన ఇప్పటికే పార్టీలకతీతంగా తీవ్ర ప్రతిచర్యలకు దారితీసింది. రాహుల్ గాంధీ పర్యటనను స్వాగతిస్తూ, మాజీ లోక్‌సభ స్పీకర్, సీనియర్ బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రను నొక్కి చెబుతూ సయోధ్య ధోరణిని ప్రదర్శించారు. “ప్రజాస్వామ్యం ఇలాగే పనిచేస్తుంది,” అని ఆమె అన్నారు. “ప్రతిపక్షం తన పనిని బలంగా, సమర్థవంతంగా […]
Read more
1 24 25 26 27 28 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.